Guppedantha Manasu: అదిరిపోయిన రిషి ఫైటింగ్.. వసు గట్టి వార్నింగ్.. పాండ్యన్ బ్యాచ్ సెక్యురిటీ
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది.
మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

జూలై 31వ ఎపిసోడ్ లో: మళ్లీ కుట్ర చేస్తున్నావా. నా కొడుకుని చంపాలనుకుంటున్నావా అని మహేంద్ర అంటే.. బాబాయ్ నేను అని శైలేంద్ర అంటాడు. హేయ్.. ఆపు ఇక నటించకు చూడలేకపోతున్నా. నువ్వు ఎంత మేకవన్నే పులివో నాకు తెలిసి చాలా కాలం అయింది. తెలిసిన మరుక్షణమే నీ అంతు చూడాలి అనుకున్నా. కానీ మా అన్నయ్య కోసం ఆగాను. అందుకే నువ్వు బతికి బట్ట కట్టావ్. ఛ పదవి కోసం తమ్ముడిపై పగ పెంచుకుంటావా.
తనపై కక్ష సాధిస్తావా. మా కుటుంబంలో నువ్వు చెడబుట్టావ్ కదా అని మహేంద్ర అంటే.. బాబాయ్.. అని కోపంగా శైలేంద్ర అంటాడు. అలా పిలవకు. నీకు నాకు మధ్య ఏ బంధం లేదు. ఏ రోజు నా కొడుకుని చంపాలనుకున్నావో ఆరోజే నా మనసులో నీ స్థానం చచ్చిపోయింది అని మహేంద్ర అంటాడు.

ఆగస్టు 1వ ఎపిసోడ్ లో: అటెండర్ కు ఎంగెజ్ మెంట్ ఫొటోలు పంపిన విషయం మహేంద్రకు చెబుతుంది వసుధార. నేను వస్తున్నాను అని మహేంద్ర చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోవైపు ఫ్లెక్సీల కోసం రిషి వెళ్తాడు. కాలేజీ ఫ్లెక్సీల గురించి మాట్లాడుతుండగా ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మీరే కదా అని షాప్ అతను ఫొటోలు చూపిస్తాడు. అది చూసి రిషి షాక్ అవుతాడు.
ఇది మీకు ఎవరిచ్చారని అడిగితే.. విష్ కాలేజీ అటెండర్ ఇచ్చాడని చెబుతాడు. ఎందుకిచ్చాడని రిషి అడిగితే తెలియదు అని షాప్ అతను చెబుతాడు. అలా తెలియకుండా ఎలా ఇస్తారు అని రిషి ఫైర్ అవుతాడు. వాటన్నింటిని డిలీట్ చేయమని చెబుతాడు. అటెండర్ నెంబర్ ఉందా అని అడిగితే ఉందంటాడు షాప్ అతను.

ఆగస్టు 2వ ఎపిసోడ్ లో: కారు డ్రైవర్ తలకు తన కాళ్లతో మలిపెట్టి అటు ఇటు తిప్పుతాడు రిషి. దీంతో కారు అటు ఇటు ఊగిపోతుంది. డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో కారు ఓ పోల్ ను ఢీ కొడుతుంది. రౌడీలందరి కారులోనుంచి బయట పడిపోతారు. అప్పుడు సినిమాల్లో హీరోలాగా రిషి కారులోనుంచి హీరోయిటిక్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలతో కొద్దిసేపు ఫైట్ చేసిన రిషికి మత్తుమందు ఉన్న కర్చీఫ్ పెడతారు.
దీంతో స్పృహ కోల్పోతాడు రిషి. అప్పుడు రిషిని పట్టుకుని కత్తితో పొడిచేందుకు రౌడీ ముందుకు నడుస్తాడు. ఇంతలో రౌడీ చేతికి రాడ్ తగిలుతుంది. దాన్ని మహేంద్ర విసురుతాడు. ఆ రౌడీలందరితో మహేంద్ర ఫైట్ చేస్తుంటాడు. రిషిని లేపేందుకు వసుధార ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో పోలీసుల కారు సైరన్ వినిపించడంతో రౌడీలు పారిపోతారు.

ఆగస్టు 3వ ఎపిసోడ్ లో: రిషి గురించి మాట్లాడుకుంటారు మహేంద్ర. జగతి. నా కొడుకు మనసులో నా స్థానం చెరిగిపోయి ఉంటుందని జగతి అంటుంది. లేదు. మీపై రిషికి ఇంకా ప్రేమ అలాగే ఉంది అని రిషి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అది విన్న జగతి ఎమోషనల్ అవుతుంది. నీ విలువ తెలిసి నీకు దగ్గరవుదాం అనుకున్న సమయానికి మీరు అలా చేసేసరికి తట్టుకోలేకపోయాడు. మంచి చేసిన మీపై కోపం పెంచుకున్నాడు. శత్రువులు మంచిగా కనిపిస్తున్నారు అని మహేంద్ర అంటాడు.
అన్నింటికి కారణం శైలేంద్ర. రక్తం రుచి మరిగిన మృగం ఎప్పటికైనా ప్రమాదమే. శైలేంద్ర గురించి చెప్పేద్దాం అని జగతి అంటుంది. రిషి నమ్మడు. వదిన ప్రేమను తలుచుకుంటున్నాడు. శైలేంద్ర మంచోడని అనుకుంటున్నాడని మహేంద్ర అంటాడు. నువ్వు చెప్పిన నమ్మడా. ఇలా ఎప్పటికీ భయపడుతూనే ఉండాలా అని జగతి అంటుంది.
ఆగస్టు 4వ ఎపిసోడ్ లో: రిషి సార్ పై అటాక్ జరిగిన విషయం కాలేజీలో పాండ్యన్ బ్యాచ్ కు తెలుస్తుంది. మనం రిషిని సార్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఉండగా సార్ ని ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి సార్ కి సెక్యూరిటి ఇవ్వాలి అని డిసైడ్ అవుతారు పాండ్యన్ బాచ్. ఇంతలో రిషి సార్ వస్తే.. బాడీ గార్డ్స్ ల అతని వెంటే నడుస్తారు.
ఏంటీ ఇదంతా అంటే మీపై అటాక్ జరిగింది కదా. మీకు సెక్యూరిటిగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని పాండ్యన్ చెబుతాడు. అలా చేయొద్దు. అటాక్ అనేది వ్యక్తిగతం అంటూ క్లాస్ ఇస్తాడు రిషి. నేను చూసుకోలేనప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే బాగుంటుంది. కానీ నేను చూసుకోగలను అని చెప్పేసి వెళ్లిపోతాడు రిషి.
ఆగస్టు 5వ ఎపిసోడ్ లో: మీలా నేను ప్రేమను చంపుకుని బతకలేను. మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండలేను అని వసు అంటుంది. నాకు మనసెక్కడ ఉంది. అదెప్పుడో చంపేశావ్ కదా అని రిషి అంటే.. అంతకన్న క్షణం ముందే నా మనసు చచ్చిపోయింది అని వసు బాధగా అంటుంది. ఏదైనా ఉంటే మన ఇద్దరి మధ్య ఉండాలి అని రిషి అంటాడు. ఇద్దరి మధ్య ఏముంది. ఏం లేదని మీరే అంటారు కదా. మాట్లాడేందుకు రమ్మంటే వస్తారా.
మాట కూడా వినకుండా వెళ్లిపోతారు అని వసు అంటుంది. ఇంతకుముందు వసుధారల మొండిగా బిహేవ్ చేస్తున్నారు. ఇలా ప్రవర్తించే ప్రేమను దూరం చేసుకున్నారు అని రిషి అంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమతో చేశాను. కానీ ఇలా దూరమవుతుందని అనుకోలేదు. మూలాలు చూడకుండా పైపై కారణాలు చెప్పి నన్ను దూరం పెడుతున్నారు. ఇక మీ మాటలు వినదల్చుకోలేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసు. పొగరు ఎక్కడా తగ్గదు అని రిషి అనుకుంటాడు.


Click it and Unblock the Notifications











