For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu weekly roundup: రిషికి దిమ్మతిరిగే షాకిచ్చిన సాక్షి.. అందరి ముందూ అడకత్తెరలో పోకచెక్కను చే

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్ లోవసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టుతో సీరియల్ మంచి లవ్ స్టోరీగా ముందుకెళ్తున్నది. గత వారం రోజులుగా అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందనే వివరాల్లోకి వెళితే..

   ఆగస్టు 1వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 1వ తేదీ ఎపిసోడ్


  కాలేజీలో అందరి ముందు మీటింగ్ లో తాను రిషికి కాబోయే భార్యను అనే విషయాన్ని సాక్షికి చెబుతుంది. అంతేకాక అక్కడికి వెళ్లి ఆమెను వారించబోయిన రిషికి మీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయని వాటిని బయట పెడతానని ఆమె భయపెడుతుంది. అయితే రిషి భయపడడు కానీ వసుధార అల్లరి అవుతుంది అనే ఉద్దేశంతో కాస్త వెనకడుగు వేస్తాడు. దీంతో రెచ్చిపోయిన సాక్షి ఇంటికి వెళ్లి పోతుంది, అయితే ఇలా జరిగినా సరే రిషి ఏమీ మాట్లాడకపోవడంతో వసుధార చాలా బాధపడుతుంది. రిషి ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నాడు నిజంగానే సాక్షి అంటే ఇష్టమా ఇష్టం లేదు కదా మరి ఎందుకు ఇలా మౌనం పాటిస్తున్నాడు అంటూ భావిస్తుంది. మరోపక్క మనం సగం విజయం సాధించాము ఇంకా మున్ముందుకు వెళ్లాలని దేవయాని సాక్షికి ఇంకా నూరపోస్తూ ఉంటుంది.

   ఆగస్టు 2వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 2వ తేదీ ఎపిసోడ్


  సాక్షి ఇలా చేయడంలో రిషి చాలా బాధపడుతూ ఉంటాడు తన గదిలో ఉన్న రిషి దగ్గరికి వెళ్లిన జగతి వసుధారకు మీ మీద చాలా ప్రేమ ఉందనే విషయాన్ని వెల్లడిస్తుంది. అంతేగాక సాక్షి మీకు కరెక్ట్ కాదని వసుధార ప్రేమ వ్యక్తం చేసే సమయానికి ఇలా జరిగిందని అంటూనే రిషికి అసలు విషయం అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే రిషి మాత్రం వినకుండా మీరు అప్పట్లో ఒక జ్యోతిష్యం చెప్పారు అది నిజమైంది అని, మళ్లీ ఇప్పుడు దాన్నే తిరిగేసి చెబుతున్నారు అని అంటాడు. అయితే సాక్షి మాటలు విని ఎలాగైనా వారిద్దరికీ పెళ్లి చేయాలని సిద్ధమైన దేవయాని మీద ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు.

  ఆగస్టు 3వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 3వ తేదీ ఎపిసోడ్


  ఎలా అయినా సాక్షితో తన వివాహం జరిపించాలి అని చూస్తున్న తన పెద్దమ్మకు సాక్షి నిజ స్వరూపాన్ని అర్థమయ్యేలా చెబుతాడు రిషి.. అయితే ఆమెకు అప్పటికి తెలిసినానా రిషి చెపుతున్నప్పుడు ఇప్పుడే వింటున్నట్టుగా నాటకం ఆడుతుంది. అయితే మిగతా ఇంట్లో వాళ్ళందరూ రిషి చెప్పిన విషయాలన్నీ విని షాక్ అవుతారు. సాక్షి తనను బెదిరించిందని బ్లాక్మెయిల్ చేసిందని అలా అయినా సరే తనను వివాహం చేసుకోవాలని సాక్షి ప్రయత్నిస్తుందని రిషి బయట పెడతాడు. ఆమె ఉద్దేశాలు మంచివి కావని అప్పుడు వదిలేసి వెళ్ళింది, ఇప్పుడేమో ఇలా చేస్తుంది అంటూ ఆమె చేసిన రచ్చ అంతా బయట పెడతాడు. ఇక అక్కడితో ఆ ఎపిసోడ్ ముగించారు. అయితే ఎపిసోడ్ మొత్తం కూడా ఆసక్తికరంగా సాగింది.

   ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్


  అలా ఆమె గురించి అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పేసిన రిషి బయటకు వెళ్లి వసుధారను కలుస్తాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిన సమయంలో సాక్షి ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావ్ రిషి అని అడిగితే తాను వసుధారతో ఉన్నాననే విషయం చెప్పడంతో సాక్షి రెచ్చిపోతుంది. రిషి ఇంటికి వచ్చి ఇలా వసుధారతో తిరుగుతున్నాడు నేను అతనిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కదా అంటే నువ్వంటే అతనికి ఇష్టం లేదని దేవయాని తెగేసి చెబుతుంది. దయచేసి ఇంకోసారి అతని వెంట పడవద్దు అని కూడా వార్నింగ్ ఇస్తుంది. అయితే సాక్షి మాత్రం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ అవసరమైతే తాను చచ్చిపోయి మీ అందరి పేర్లు రాసి ఇరికిస్తానంటూ బెదిరించి బయటికి వెళుతుంది.

  ఆగస్టు 5వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 5వ తేదీ ఎపిసోడ్


  అయితే దేవయాని ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించి సాక్షి మీద ఫైర్ అవడంతో మళ్ళీ కొత్త ప్లాన్ ఏదైనా వేస్తుంది ఏమో అనే ఉద్దేశంతో జగతి దేవయాని దగ్గరకు వెళ్లి రిషి నీ కడుపున పుట్టకపోయినా నువ్వే పెంచావు కదా దయచేసి సాక్షి లాంటి అమ్మాయికిచ్చి అతని గొంతు కోయవద్దు దయచేసి నా మాట విని సైలెంట్ గా ఉండమని అంటుంది. అయితే రిషి ని నేను పెంచాను కాబట్టి అతను నా మాటే వినాలని దేవయాని అంటుంది. అలాగే తాను చేయాలనుకున్నది చేసి తీరతాను అని జగతికి ఆమె తగేసి చెబుతుంది. అంతేకాక కచ్చితంగా సాక్షితోనే రిషి పెళ్లి జరిపిస్తానని ఎలా జరిపిస్తానో చూస్తూ ఉండమని కూడా ఆమె వార్నింగ్ ఇస్తుంది. ఆమె వార్నింగ్ ఇచ్చిన విధంగానే ఒక అద్భుతమైన ప్లాన్ డిజైన్ చేసి తనకు ఆరోగ్యం బాగోలేదంటూ రిషి కి ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తుంది.

   ఆగస్టు 6వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 6వ తేదీ ఎపిసోడ్


  ఇక రిషి, వసుధార వేరే చోట ఉండగా వారి ఫోన్లు చాలా సేపు చూసుకోరు. చూసుకున్న తర్వాత రిషి పెద్దమ్మకు కాల్ చేస్తే తన ఆరోగ్యం బాగోలేదు అనే విషయాన్ని చెబుతుంది అలా చెప్పిన తర్వాత ఏం జరిగింది అని అడిగితే ఇంటికి రమ్మంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తాను చనిపోతానంటూ నాటకం ఆడుతుంది దేవయాని. రిషి కాస్త భయపడతాడు, ఆలోచిస్తాడు. సాక్షి భయపెడుతుందని, నేనే మాట ఇచ్చాను కాబట్టి నేనే దూరం అయిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ దేవయానికి కొత్త నాటకాన్ని ప్రారంభిస్తుంది. దీంతో రిషి కొంత ఆలోచనలో పడతాడు, దేవయాని వసుధారను కూడా మానిప్యులేట్ చేయడానికి చూస్తుంది. అలా అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు.

  English summary
  Guppedantha Manasu is a telugu soap telecasting on star maa. here are the written updates of August 1st to 6th Episodes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X