Guppedantha Manasu: రిషిపై అటాక్స్.. కోలుకోలేని దెబ్బ కొట్టిన శైలేంద్ర.. కాలేజీ పరువు గోవిందా
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఆగస్టు 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..
ఆగస్టు 7వ ఎపిసోడ్ లో..: మహిళ గర్భిణి వేషంలో మరో రౌడీతో పక్కన కూర్చుని ఉంటుంది. ఇంతలో రిషి కారులో వస్తుంటాడు. రిషి కారును ఆపి సార్ నా చెల్లెలు. నొప్పులు వస్తున్నాయి. హాస్పిటల్ కు తీసుకెళ్లాలని చెప్పడంతో రిషి కిందకు దిగుతాడు. ఆమెను పట్టుకుని వచ్చి కారు వెనుక డోర్ తీస్తాడు రిషి. ఇంతలో కత్తి తీసి రిషిని పొడవబోతుంది. కానీ, అది చూసిన రిషి పొడవుకుండా ఆపుతాడు. మహిళను అటు నెట్టేసి రౌడీతో ఫైట్ చేస్తాడు. ఇంతలో అక్కడున్న రౌడీలందరూ వస్తారు. అప్పుడు రిషిని పట్టుకుని ఉంటారు. మరొకడు కత్తి తీస్తాడు. ఈరోజు నీ పని అయిపోయింది అని కత్తితో ముందుకు వస్తాడు ఆ రౌడీ. ఇంతలో పాండ్యన్ బ్యాచ్ స్టూడెంట్స్ తో హాకీ స్టిక్స్ పట్టుకుని అదిరిపోయే ఎంట్రీ ఇస్తారు. మా సార్ పైనే అటాక్ చేస్తార్రా అని రౌడీలందరినీ చితక్కొట్టి పారిపోయేలా చేస్తారు.

ఆగస్టు 8వ ఎపిసోడ్ లో..: రౌడీ ఫోన్ లో శైలేంద్ర వాయిస్ విని అది మీ అన్నయ్యది అని రిషికి చెబుతుంది వసుధార. మీ అన్నయ్య, దేవయాని మీ వెనుక ఎన్ని కుట్రలు పన్నారో మీకు తెలియదు. కావాలంటే సాక్ష్యాలు చూపిస్తానని అంటుంది వసుధార. చాలు వసుధార అని గట్టిగా అరుస్తాడు రిషి. నీ దగ్గర అన్నింటికి సాక్ష్యాలు ఉంటాయి. నాపై కూడా సాక్ష్యాలతోనే అభియోగం మోపారు కదా. అలానే వీళ్ల మీద కూడా సృష్టించి ఉంటారు. మా పెద్దమ్మ, అన్నయ్య గురించి నువ్వే కాదు. ఆ దేవుడు చెప్పినా కూడా వినను అని రిషి అరుస్తాడు. రిషి గట్టిగా అరిచేసరికి వసుధార తేరుకుంటుంది. పక్కనే ఉన్న ఎస్సై ఆ గొంతు ఎవరిదో గుర్తు పట్టారా అంటే మాట్లాడరేంటి మేడమ్ అని అడుగుతాడు. దీంతో ఇదంతా కల అని వసుధార అనుకుంటుంది.

ఆగస్టు 9వ ఎపిసోడ్ లో..: ఇంటికి వసుధార రావడంతో.. రిషి వచ్చిన విషయం చెప్పడానికి చక్రపాణి బయటకు వస్తాడు. అల్లుడు గారు అని చక్రపాణి అంటే.. హా మీ అల్లుడు గారి గురించి నా దిగులు. అరే చెబితే వినకుండా పంతానికి పోతారే. ఏం మనిషో ఏమో అనుకుంటూ లోపలికి వచ్చిన వసుధార రిషిని చూసి షాక్ అవుతుంది. ఏంటీలా వచ్చారు అంటే.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. గతం అందరికి తెలిసిన వాళ్ల మధ్య మన సంభాషణ జరిగితే మంచిది కదా అని రిషి అంటాడు. కాసేపు పోటాపోటీగా వాదించుకుంటారు. మహేంద్ర సార్ కాల్ చేశారు. మీ గురించి తిండి తినకుండా, నిద్ర పోకుండా భయపడుతున్నారు. మీకు కాల్ చేస్తే మీరు విసుక్కుంటారని మీకు కాల్ చేయకపోవచ్చు. నాకు జాగ్రత్తలు చెబితే మీకు చెప్పినట్టే భావిస్తున్నారు. ఎస్సైకి కాల్ చేసిన ఆ ఫోన్ గురించి వివరాలు తెలుసుకోండి అని వసుధార చెబుతుంది.

ఆగస్టు 10వ ఎపిసోడ్ లో..: రిషికి కాల్ చేసిన ఎస్సై ఆ ఫోన్ ఎవరిదో తెలియలేదు. కేవలం ఆ రెండు నెంబర్ల నుంచి మాత్రమే కాల్స్ వెళ్లాయి. ఈ రెండు నెంబర్లు కూడా ఒక వ్యక్తివే. అది కూడా చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్నాయి. వాడెవడో పెద్ద క్రిమినల్ లా ఉన్నాడు. ఎక్కడ క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా సరే కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో ఏంజెల్ ఏడుపు విని హాల్లోకి వెళ్తాడు రిషి. అక్కడ విశ్వనాథం గుండె పట్టుకుని కుప్పకూలిపోతాడు. ఏంజెల్ ఏడుస్తూ కంగారుపడుతుంది. వెంటనే రిషి డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. మరోవైపు రిషి సార్ ఇంకా రాలేదా అని వసుధార ఆలోచిస్తు ఉంటుంది. పాండ్యన్ ని అడిగితే సార్ ఇంకా రాలేదు అని చెబుతాడు. డాక్టర్ వచ్చి విశ్వనాథంకు ట్రీట్ మెంట్ ఇస్తాడు. మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఏది సీరియస్ గా ఆలోచించొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్.

ఆగస్టు 11వ ఎపిసోడ్ లో..: విశ్వనాథంకు జ్యూస్ ఇస్తుంది ఏంజెల్. అక్కడ రిషి లేకపోవడంతో.. తన గదికి వెళ్లి కాఫీ ఇవ్వమని వసుధారకు ఏంజెల్ చెబుతుంది. ముందు తటాపటాయించిన వసుతో ఏంజెల్ గట్టిగా చెప్పడంతో కాఫీ తీసుకెళ్తుంది. మీరెందుకు వచ్చారు మేడమ్ అని రిషి అంటాడు. ఏంజెల్ కాఫీ ఇమ్మని చెప్పింది. తను ఏది చెబితే చేయమని చెప్పారు కదా అందుకే తెచ్చాను అని వసు అంటుంది. ఏమైనా చెప్పాలా అని రిషి అంటాడు. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది. కానీ మీరు వినరు. అయినా ఒక విషయం మాత్రం చెప్పాలని ఎందుకో అనిపిస్తుంది. ఒకసారి మహేంద్ర సార్ కు కాల్ చేసి మాట్లాడండి. చాలా సంతోషిస్తారు అని వసు అంటుంది. అందరి సంతోషాల గురించి ఆలోచించే మీరు.. ఆ క్షణంలో చెప్పే అబద్ధం నా సంతోషాన్ని మింగేస్తుందని మీకు తెలియదా అని మనసులో అనుకుంటాడు రిషి.
ఆగస్టు 12వ ఎపిసోడ్ లో: నేను చెప్పింది తూచా తప్పకుండా చేశావా అని శైలేంద్ర అడుగుతాడు. మీరు చెప్పిందే తప్పుడు పని. అది కూడా తప్పుగా ఎలా చేస్తాను సార్. మీరే చూడండి అని ఓ పేపర్ ఇస్తాడు అతను. పేపర్ చదివిని శైలేంద్ర ఆనందంతో గుడ్ జాబ్. అనుకున్నదానికన్నా బాగా రాసావ్ అని చెప్పి డబ్బు ఇస్తాడు. దీంతో అతను వెళ్లిపోతాడు. ఈ దెబ్బతో మీకు మీరుగా కాలేజీ బాధ్యతల నుంచి తప్పుకుని ఎండీ సీటు నాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉండండి. పిన్నీ బాబాయ్ ఈసారి మీరు ఊహించని దెబ్బ కొడుతున్నాను. మీరు తప్పించుకోలేరు అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ఫైల్ రెడీ చేస్తుంది జగతి. అప్పుడే వచ్చిన మహేంద్ర రిషి గురించి మాట్లాడుకుంటూ ఎమోషనల్ అవుతారు. రిషి వస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. రిషి నిజం తెలుసుకుని వస్తాడని మహేంద్ర ధైర్యం చెబుతాడు.


Click it and Unblock the Notifications











