Guppedantha Manasu: ఏంజెల్ మనసులోనూ రిషి.. కన్నీళ్లతో వసుధార.. దేవయాని అలా!

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఆగస్టు 14వ ఎపిసోడ్ లో..:జగతికి మహేంద్ర ఆ న్యూస్ చూపిస్తాడు. దీంతో జగతి కళ్లు తిరిగి కుర్చీలో కూలబడిపోతుంది. మహేంద్ర వాటర్ ఇస్తాడు. ఇంత బ్యాడ్ గా రాయడం ఏంటీ. అసలు ఇదంతా ఎవరు చేశారు. మన స్టాఫ్ లో ఎవరైనా చేయించారా లేదా. శైలేంద్ర చేసి ఉండవచ్చు అని జగతి అంటే.. నా అనుమానం కూడా అదే. నేను అన్నీ కనుక్కుంటాను అని మహేంద్ర అంటాడు. ఇంతలో పేపర్ టేబుల్ పై వేసి ఏంటీ ఇది పిన్ని అని నిలదీస్తాడు శైలేంద్ర. నేను కూడా అదే అడుగుతున్నాను అని జగతి గట్టిగా అంటుంది. నేను మిమ్మల్ని అడగటానికి వస్తే నన్ను అనుమానిస్తున్నారా. అని శైలేంద్ర అంటాడు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని జగతి అంటుంది. ఇది మిషన్ ఎడ్యుకేషన్ కు సంబధించింది కాదు. నేను కాలేజ్ బోర్డ్ మెంబర్ ని. దీని గురించి ఎవరెవరో ఫోన్ చేసి మాట్లాడుతుంటే నా తల కొట్టేసినట్లుంది అని శైలేంద్ర అంటాడు. ఎంటీ శైలేంద్ర. నీకు ఫోన్ చేశారా. ఎవరు చేశారు చెప్పు అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu August 3rd Week 2023 Roundup Story August 14 To 19 Episodes Highlights

ఆగస్టు 15వ ఎపిసోడ్ లో..:ఎడ్యుకేషన్ విషయంలో పిల్లల్ని చదివించగలిగే స్థోమత ఉన్నవాళ్లను ఒక స్టూడెంట్ బాధ్యత తీసుకునేలా చేద్దాం. స్టూడెంట్ సపోర్ట్ పేరుతో డీబీఎస్టీ లాంటి పెద్ద కాలేజీలో చదివించేలా చేయాలి. 500 మంది స్టూడెంట్స్ మన టార్గెట్. అలాగే చేద్దాం అని పాండ్యన్ వాళ్లు వెళ్లిపోతారు. మరోవైపు ఇంట్లో పెళ్లి చేసుకోవాలా. నాకు ఎలాంటి వాడు కరెక్ట్ అని ఆలోచిస్తుంటుంది. ఇంతలో వచ్చిన రిషి ఏంజెల్ ను పలకరిస్తాడు. ఇంట్లోకి ఎవరు వచ్చారో కూడా తెలియకుండా పరధ్యానంగా ఉన్నావేంటి. విశ్వనాథం సర్ గురించి ఆలోచించవద్దు. నేను చూసుకుంటాను అని రిషి అంటాడు. తర్వాత ఇద్దరం కలిసి తిందాం అని ఏంజెల్ అంటే.. నాకు ఆకలిగా లేదు. నువ్ తినేసేయ్ అని రిషి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu August 3rd Week 2023 Roundup Story August 14 To 19 Episodes Highlights

ఆగస్టు 16వ ఎపిసోడ్ లో..:మీరు కూడా ఏంజెల్ కు మంచి ఫ్రెండ్ కదా. ఆ విషయం మీరే తెలుసుకోవచ్చు కదా అని వసుధార అంటుంది. నేను వేరేవాళ్లతో పెళ్లి, ప్రేమ, మనసులో ఎవరు ఉన్నారు అని మనసువిప్పి మాట్లాడలేను. ఇబ్బందిగా ఉంటుంది అందుకే నీకు చెబుతున్నాను అని రిషి అంటాడు. మరి నా దగ్గర మాత్రం బాగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. అంటే నేను పరాయి మనిషిగా ట్రీట్ చేయడం లేదని, మన మధ్య ఏందో సమ్ థింగ్ ఉందని అనుకోవచ్చా అని వసుధార అంటుంది. ప్రతిది మీ దాకా తేకండి. చిన్న హెల్ప్ అడిగితే ప్రశ్నలతో విసిగిస్తూ పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం లేదు అని రిషి సీరియస్ అవుతాడు.

Guppedantha Manasu August 3rd Week 2023 Roundup Story August 14 To 19 Episodes Highlights

ఆగస్టు 17వ ఎపిసోడ్ లో..:మా కాలేజీలో సీట్లు ఎలా భర్తి చేయాలో ఆలోచిస్తుంటే దేవుళ్లా మీరు వచ్చారు. ఈ లోకలం నాశనం కోరుకునేవారు ఉన్నట్లే బాగు కోరుకునే వారు ఉన్నారు అని జగతి అంటుంది. పాండ్యన్ బ్యాచ్ వెళ్లిపోతుంటే వాళ్లను పంపించేసి వస్తాం అని వెనుకే జగతి, మహేంద్ర వెళ్తారు. ఈ స్కీమ్ ఆలోచన ఎవరిదీ అని జగతి అడుగుతంది. రిషి తన పేరు చెప్పొద్దన్న మాటలు గుర్తు చేసుకున్న పాండ్యన్ సైలెంట్ గా ఉంటాడు. పేపర్ లో వార్త చూసి రిషి సారే పంపించారు కదా. మీరు చెప్పకపోయినా అర్థం చేసుకోగలం. రిషి సార్ కు థ్యాంక్స్ చెప్పండి అని జగతి అంటుంది. దటీజ్ రిషీంద్ర భూషణ్ అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu August 3rd Week 2023 Roundup Story August 14 To 19 Episodes Highlights

ఆగస్టు 18వ ఎపిసోడ్ లో..:వసుధారను చూసిన పాండ్యన్ సార్.. మేడమ్ వస్తున్నారు అని చెబుతాడు. దీంతో సరే నువ్ క్లాసుకు వెళ్లు అని పాండ్యన్ ను పంపించేస్తాడు రిషి. ఏంజెల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ వసుధార చాలా డల్ గా వస్తుంది. రిషి పిలుస్తున్న వసుధార ఆగదు. మరోసారి గట్టిగా పిలిచేసరికి ఆగుతుంది వసుధార. కాలేజీకి ఎందుకు లేట్ వచ్చారు మేడమ్ అని రిషి అడిగితే.. ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది వసుధార. మాట్లాడుతుంటే వెళ్లిపోతారేంటీ మేడమ్ అని రిషి అంటాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాను కదా. ఇంకా మాట్లాడేందుకు ఏముంది అని వసు అంటుంది. నేను మాట్లాడాలి. నాకు సమాధానం చెప్పాలి. మెసేజ్ పెట్టి ఎందుకు డిలీట్ చేశారని రిషి అడుగుతాడు. డిలీటెడ్ కదా సార్. డీటెల్స్ ఎందుకని వసు అంటే.. డిలీట్ మెసేజ్ చూసినప్పటినుంచి మనసు మనసులో లేదు అని రిషి అంటాడు.

Guppedantha Manasu August 3rd Week 2023 Roundup Story August 14 To 19 Episodes Highlights

ఆగస్టు 19వ ఎపిసోడ్ లో:పాండ్యన్ వచ్చి వసుధార మేడమ్ అందరి స్టూడెంట్స్ కు రాంగ్ వేస్తున్న విషయం చెబుతాడు. ఎందుకో మేడమ్ చాలా మూడీగా ఉన్నారు. క్లాస్ తీసుకోవడం లేదు. కాలేజీలో, గానీ ఇంట్లో గానీ ఏమైనా సమస్య ఉందా అని పాండ్యన్ అడుగుతాడు. వసుధార కన్నీళ్లు గుర్తు చేసుకున్న రిషి అదేంటే నేను కనుక్కుంటానులే అని పంపిస్తాడు. చక్రపాణి కోసం వెళ్తుంటే బయట రోడ్డుపై కనిపించడంతో ఆగుతాడు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా. లేదంటే జగతి మేడమ్, డాడీ గాని ఫోన్ చేశారా, లేదా ఎవరైనా ఇంటికి వచ్చి బెదిరించారా అని రిషి అడుగుతాడు. అలాంటిదేం లేదు. మీరు అలా అడుగుతుంటే భయంగా ఉంది. వసుకి ఏమైంది అని చక్రపాణి అంటాడు. ఇవాళ ఎందుకో మేడమ్ చాలా డల్ గా ఉంది. ఇంట్లో ఏమైనా సమస్య అని తెలుసుకుందామని అడుగుతున్నాను అని రిషి అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X