Guppedantha Manasu Weekly Roundup: ఆశయం కోసం రిషిధార త్యాగం.. మరోవైపు దేవయాని, సాక్షి ప్లాన్​..

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే ఆగస్టు 22వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఆగస్టు 22వ ఎపిసోడ్​లో..

ఆగస్టు 22వ ఎపిసోడ్​లో..

సాక్షి కోసం రిషి చేయించిన ఉంగరాన్ని తీసుకున్న వసుధార.. తన మెడలో కట్టుకుంటుంది. ఈలోపే సడెన్​గా రిషి ఆమె ఇంటికి వస్తాడు. అతను రావడం చూసిన వసుధార షాక్​ అయి ఎంటీ సార్​ ఇలా వచ్చారు అని అడుగుతుంది. అనంతరం వసుధార ఉన్న బుక్ తీసుకుని ఇంపార్టెంట్​ టాపిక్స్​ మార్క్ చేసి ఇస్తాడు. తర్వాత వసుధారకు రిషి డబ్బు ఇస్తాడు. ఎంటీ సార్ అని అడిగిన వసుధారకు, డబ్బు అవసరం ఉందని అడ్వాన్స్​ అడిగావట కదా, డబ్బు ఎందుకు అని నేను అడగటం బాగుండదు కానీ, నీకు ఇంకెప్పుడు అవసరం ఉన్న నన్నే అడుగు. ఎవరినీ అడగొద్దు అని చెప్పి డబ్బును మేనేజర్​కు ఇవ్వమంటాడు. చదువుపై దృష్టి పెట్టమని చెప్పి రిషి వెళ్లిపోయాక, రింగ్​ను చూస్తూ మురిసిపోతుంది వసుధార.

ఆగస్టు 23వ ఎపిసోడ్​లో..

ఆగస్టు 23వ ఎపిసోడ్​లో..


వసుధారతో రిలేషన్‌ గురించి రిషిని గౌతమ్ నేరుగా ప్రశ్నించాడు. ఆమెను నీవు ప్రేమిస్తున్నావు కదా.. అంటే.. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని రిషి సమాధానం చెప్పాడు. వసుధార విషయంలో నీవు చేసేది సరికాదు అని గౌతమ్ అంటే.. ఒక సమస్య వచ్చింది. దాని అంతటా అదే సాల్వ్ అవుతుంది. మా విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు అంటూ రిషి చెప్పాడు. దాంతో దయచేసి వసుధారను వదులుకోవద్దు.అయితే గౌతమ్, రిషి సంభాషణ విన్న తర్వాత నేరుగా అమ్మవారి వద్దకు వెళ్లి.. ఎవరు లేని వారికి నీవే దిక్కుగా నిలుస్తారు కదా.. నేను అందరిని వదులుకొని వచ్చాను. కాబట్టి నాకు కొంత ధైర్యం ఇవ్వు. నాకు అండగా ఉండమ్మా.. రిషి సంగతి నాకు తెలుసు. నాకు ఏ కష్టమొచ్చినా నీవద్దకే వస్తున్నా అని వసుధార అమ్మవారి ముందు ప్రార్థిస్తుంటే.. అక్కడికి వచ్చిన మహేంద్ర అంతా విన్నారు. దాంతో మహేంద్రను చూసి కంగారు పడిన అంతా విన్నారా అంటే.. కొంత విన్నాను.. కొంత వినలేదు అని అన్నారు. డబ్బు దాచుకొన్నట్టు కొన్ని విషయాలు మనసులో దాచుకోవద్దు. నీ గురించి నేను, జగతి ఆలోచిస్తున్నాం. మౌనం అన్ని సార్లు కరెక్ట్ కాదు అని మహేంద్ర చెబుతాడు.

ఆగస్టు 24వ ఎపిసోడ్​లో..

ఆగస్టు 24వ ఎపిసోడ్​లో..

డీబీఎస్టీ కాలేజ్ ఫేర్‌వెల్ గురించి జగతి, మహేంద్ర మాట్లాడుకొంటుంటే. ఏంటి ఫేర్‌వెల్ గ్రాండ్‌గా చేయిస్తున్నారా దేవయాని అంటే.. లేదు అని మహేంద్ర సమాధానం ఇచ్చారు. ఎవరో వెళ్లిపోతున్నారు కదా?? అదే వసుధార అంటే కాలేజ్.. కాలేజ్ అంటే వసుధార అనే బిల్డప్ క్రియేట్ చేశారు. అందుకోసం స్వీట్ చేయించాను అనగానే.. జగతి, మహేంద్ర ముఖాలు చూసుకొన్నారు. దేవయానికి సమాధానం చెబుతూ.. మనసులో విషం పెట్టుకొని స్వీట్స్ పెట్టడం ఎందుకు అని జగతి సమాధానం ఇచ్చింది.అయితే నీవు రిషిని సార్ అని మాత్రమే పిలుస్తావు. రిషి అని కూడా పిలువలేవు. రిషి నీ కొడుకు అయినా నీవు నాలాగ నాన్న అని పిలువలేవు. నీకు ఉన్న అర్హత అది అని దేవయానికి దురుసుగా మాట్లాడింది. అంతలోనే రిషి రావడం, ధరణి చేతిలో కాఫీ కప్పు ఉండటం జగతి చూసింది. వెంటనే కాఫీ కప్పు తీసుకొని.. రిషి అని పిలిచింది. కాఫీ తాగు అంటూ కప్పును రిషి చేతిలో పెట్టింది. దాంతో దేవయాని, ధరణి షాక్ తిన్నారు.

ఆగస్టు 25వ ఎపిసోడ్​లో..

ఆగస్టు 25వ ఎపిసోడ్​లో..

మీ మనసు అని వసుధార, అది పగిలిన మనసు అని రిషి మాట్లుడుకుంటూ ఉంటారు. ఇంతలో రిషికి వసుధార రింగ్ చూపిస్తుంది. దాని మీద వీఆర్​ అని రాసి ఉంటుంది. పగిలిన గిఫ్ట్​ను అతికించినంత సులభం కాదు. ఒకప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్పాను. నువ్ ఏమన్నావో ఆ మాటలు ఇంకా నాకు వినిపిస్తున్నాయి అని రిషి అంటాడు. కాదన్నావు. మళ్లీ ఈ గిఫ్ట్​ ఏంటీ? అని వసుధారను నిలదీస్తాడు రిషి. దీంతో ప్రేమ అని బదులిస్తుంది వసుధార. దీంతో షాక్​కు గురవుతాడు రిషి. తను రిషి ప్రేమను కాదు అనడానికి ఎంత వేదన అనుభవించిందో చెబుతుంది వసుధార. కాదన్నందుకు మీరు బాధపడ్డారు. కానీ అలా అనాల్సి వచ్చిందానికి వంద రెట్టు ఎక్కువ బాధపడ్డాను తన ఫీలింగ్స్​ చెబుతుంది వసుధార.

ఆగస్టు 26వ ఎపిసోడ్​లో..

ఆగస్టు 26వ ఎపిసోడ్​లో..

రిషి, వసుధార ఒకరి ప్రేమను ఒకరు ఒప్పుకుని రిషిధారగా మారుతారు. తర్వాత ప్రేమను కొద్దిసేపు ఆస్వాదించిన తర్వాత ఒక త్యాగం చేయాలని వసుధారకు షాక్ ఇస్తాడు రిషి. చదువు, యూనివర్సిటీ టాపర్, ఆశయం కోసం కొద్ది రోజులు ఒకరినొకరు మాట్లాడుకోకుండా త్యాగం చేయాలని చెబుతాడు. యూనివర్సిటీ టాపర్​ అనే స్థానం కన్నా ఈ ఉంగరం మీతో తొడిగించుకోవడం చాలా గొప్ప అంటుంది వసుధార. నేను ఆ అదృష్టాన్ని పోగొట్టుకోలేను. తప్పకుండా మీరు అన్నట్టే చేస్తాను. కానీ, మీరు నాకు ఓ మాట ఇవ్వాలి. ఇది ఎప్పటికీ నాదే కదా అని అడుగుతుంది. దీంతో ఈ రిషేంద్ర భూషణ్ నీకు మాటిస్తున్నాడు. ఈ పంచభూతాలు, మన మనసుల సాక్ష్యం. ఎప్పటికీ ఇది నేకే. కానీ, నీ ఆశయం.. నీ చదువు. నువ్వు నాకు మాటివ్వు.. నేను చెప్పినట్టు నీ దృష్టి అంతా చదువు మీదే పెట్టు అని అన్న రిషితో ఉంగరం సాక్షిగా వసుధార మాటిస్తుంది.

ఆగస్టు 27వ ఎపిసోడ్​లో..

ఆగస్టు 27వ ఎపిసోడ్​లో..

ఎవరి ఇంటికి వారు వెళ్లిన రిషి, వసుధార ప్రేమ విరహంతో తపించిపోతారు. ఒకరి ఫొటోలు మరొకరు చూసుకుంటూ తమలో తాము ప్రశ్నించుకుంటారు. ఈలోపు తెల్లవారుతుంది. జగతి కాఫీ పట్టుకుని రిషి గదికి వెళ్తుంది. కానీ, రిషి ఇంకా నిద్ర లేవడు. గౌతమ్​, మహీంద్రా ఇద్దరు రిషితో మాట్లాడుదామని అనుకున్నా రిషి ఇంకా లేవడు. ఇంతలో దేవయాని వచ్చి ఏం గూడు పుఠాని చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో ఏం లేదు అని చెప్పి మహీంద్రా, గౌతమ్​ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు వసుధార నిద్రలేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X