Jyothi Rai: భర్తను వదిలేసి కుర్రాడితో 'గుప్పెడంత మనసు' జగతి లవ్ ట్రాక్.. రిలేషన్ కన్ఫర్మ్!
సినీ గ్లామర్ ప్రపంచంలో పెళ్లిళ్లు, విడాకులు, లవ్ అఫైర్స్ సర్వ సాధారణం అని తెలిసిందే. ఎవరు ఎప్పుడూ ఎవరితో ముడి పడతారో, ఎవరితో బంధాన్ని పెంచుకుంటారో తెలియదు. ఇక సీరియల్స్ నటీనటులకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ సొంతవారిలా భావిస్తారు.
అలా తెలుగు సీరియల్ ద్వారా బీభత్సంగా పాపులారిటీ తెచ్చుకున్న నటి జ్యోతి రాయ్. ఆమెను జ్యోతి రాయ్ అంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ, గుప్పెడంత మనసు సీరియల్ జగతి అంటే అందరికి తెలుసు. అయితే జ్యోతి రాయ్ భర్తను వదిలేసి కుర్రాడితో ప్రేమలో ఉందని తెలుస్తోంది.

జగతి పాత్ర: గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. ఒక సమయంలో కార్తిక దీపం సీరియల్ కు కూడా పోటినిచ్చి సత్తా చాటింది. ఈ సీరియల్ లో రిషి, వసుధార పాత్రలతో పాటు జగతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. రిషీంద్ర భూషణ్ తల్లిగా అమ్మ ప్రేమ చూపిస్తూనే ధైర్యవంతురాలైనా ఆడపులిగా విలన్స్ అయినా శైలేంద్ర, దేవయానిల ప్లాన్స్ కు అడ్డుకట్ట వేస్తుంటుంది.

కన్యాదానంతో: అలా గుప్పెడంత మనసు సీరియల్ (Guppedantha Manasu Serial) ద్వారా ఎనలేని క్రేజ్ తో పాటు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది జగతి అలియాస్ జ్యోతి రాయ్ (Jyothi Rai). ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా తెగ ఫేమస్ అయిన జ్యోతి రాయ్ సినిమాల్లో కూడా అలరించింది. పదేళ్ల క్రితం వచ్చి కన్యాదానం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

హీరోయిన్ రోల్: కన్యాదానం తర్వాత సీరియల్ నటిగా కన్నడ, తుళు భాషల్లో బాగా పాపులర్ అయింది జ్యోతి రాయ్. సుమారు 20కిపైగా ధారావాహికల్లో నటించింది. 10-15 వరకు సీరియల్స్ లో హీరోయిన్ రోల్ చేసి అట్రాక్ట్ చేసింది. కస్తూరి నివాస్ సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకుని వచ్చింది. ఆమెను కన్నడనాట బుల్లితెర శ్రుతి అని పిలుస్తుంటారని టాక్.

సినిమాలు-సిరీసులు: బ్యూటిఫుల్ జ్యోతి రాయ్ జోగుల, బందె బరతావ కాల, గెజ్జెపూజే, కన్యాదాన, లవలవికే, మురుగంటు, ప్రేరణ, కిన్నెర, అనురాగ సంగమం వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే రాయ్ దియా, గంధాడ గుడి వంటి వెబ్ సిరీసులలోనూ సత్తా చాటింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషలో వచ్చే 'ప్రెట్టీ గర్ల్' వెబ్ సిరీస్, ఏ మాస్టర్ పీస్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

యువ దర్శకుడితో: సోషల్ మీడియాలో నిత్యం ఘాటు ఫొటోలతో గ్లామర్ ట్రీట్ అందించే జ్యోతి రాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్ లో ఉందని టాక్ నడుస్తోంది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సుకుపుర్వాజ్ (Suku Purvaj) అలియాస్ సురేష్ కుమార్ తో ప్రేమాయణం సాగిస్తుందని తెగ చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు.
రిలేషన్ కన్ఫర్మ్: 38 ఏళ్ల జ్యోతి రాయ్ తాజాగా యంగ్ డైరెక్టర్ సుకుపుర్వాజ్ తో దిగిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు మీరు రిలేషన్ లో ఉన్నారా అని అడుగుతున్నారు. "లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్.. కీప్ రాకింగ్ ఆల్వేస్" అని ఒకరు కామెంట్ చేయగా.. దానికి 'థ్యాంక్యూ డియర్' అని జ్యోతి రాయ్ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె రిలేషన్ షిప్ ను జ్యోతి రాయ్ కన్ఫర్మ్ చేసినట్లుగా భావిస్తున్నారు.
20 ఏళ్ల వయసులో: ఇదిలా ఉంటే జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. నెట్ వర్కింగ్ ఇంజినీర్ గా పని చేస్తున్న పద్మనాభ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. జ్యోతి రాయ్ నటిగా రాణించడానికి కారణం అతనే కారణం అనేది కన్నడ మీడియాలో టాక్. ఇప్పుడు భర్తను వదిలేసి యంగ్ డైరెక్టర్ అయిన సుకుపుర్వాజ్ తో రిలేషన్ లో ఉండటం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











