తెల్లచీరలో జ్యోతిరాయ్ విధ్వంసం.. 40 ఏళ్ల వయసులో కిర్రాక్ ఫోజులతో అరాచకం!
ఇటీవలి కాలంలో సీరియల్ నటులు .. హీరో హీరోయిన్లను మించిన ఫేమ్ సంపాదిస్తూ దూసుకెళ్తున్నారు. ఇక సీరియల్ ముద్దుగుమ్మల ముందు హీరోయిన్లు కూడా ఎందుకు పనికిరావడం లేదు. అందంలోనూ, అభినయంలోనూ వీరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు ఫేమ్ జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్. సోషల్ మీడియాలో ఈమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. జగతి షేర్ చేసే ఫోటోషూట్‌లు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా జ్యోతిరాయ్ పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్. కన్నడ సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయ్యింది. దియా, సప్లయర్ శంకర, జెర్సీ నెంబర్ 10 ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి. కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన జ్యోతిరాయ్‌కి గుప్పెడంత మనసు సీరియల్ బ్రేక్ ఇచ్చింది. ఇందులో ఆమె పోషించిన జగతి మేడం క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. లెక్చరర్‌గా, కొడుకు కోసం తపించిపోయే తల్లి క్యారెక్టర్‌లో జ్యోతి అద్భుతంగా నటించింది. గుప్పెడంత మనసు తర్వాతి నుంచి జ్యోతిని అంతా జగతి మేడంగానే గుర్తుపడుతున్నారు.

గుప్పెడంత మనసు సీరియల్‌లో నిండుగా చీర కట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని హోమ్లీగా కనిపించిన జ్యోతి రాయ్ మేకప్ తీస్తే మాత్రం ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉంటారు. అల్ట్రా మోడ్రన్ డ్రెస్సుల్లో అందాలతో విధ్వంసం సృష్టిస్తుంటారు. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే సినీ దర్శకుడు సుక్కూ పూర్వజ్‌తో ప్రేమలో పడిన ఆమె కొన్నాళ్లు ఆయనతో డేటింగ్ చేసి అనంతరం ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
బుల్లితెరను పూర్తిగా పక్కనపెట్టేసిన జ్యోతిరాయ్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, కన్నడ సినిమాలలో బిజీ అవుతోంది. స్కిన్ షో విషయంలో ఏ మాత్రం మొహమాట పడకపోవడంతో గ్లామరస్ రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. మొన్నామధ్య ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో జ్యోతిరాయ్‌ని తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న డ్రాగన్‌లో జ్యోతిరాయ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.. జ్యోతి భర్త సుక్కు పూర్వజ్.. ప్రశాంత్ నీల్‌కు సన్నిహితుడు. ఈ సినిమాలో జ్యోతిని తీసుకోవాల్సిందిగా ప్రశాంత్‌కు సుక్కూ సిఫారసు చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి జగతి మేడంకు ప్రశాంత్ నిజంగానే ఆఫర్ ఇచ్చారా? లేక ఇది గాసిప్ మాత్రమేనా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జ్యోతిరాయ్ ఎప్పటికప్పుడు తన వ్యక్తగత విషయాలు, సినిమాలు పంచుకుంటూ ఉంటారు. ఇక చీరలో, మోడ్రన్ డ్రెస్సుల్లో ఆమె చేసే హాట్ హాట్ ఫోటో షూట్‌లకు యూత్ ఫిదా అయిపోతుంటారు. తాజాగా ఎరుపు రంగు అంచున్న తెల్ల చీర కట్టిన జ్యోతిరాయ్ తన నడుము, ఎద అందాలను చూపెడుతూ చేసిన ఫోటో షూట్‌ను షేర్ చేశారు. మరి ఇంకేందుకు ఆలస్యం జ్యోతిరాయ్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











