యువ దర్శకుడితో బుల్లితెర నటి రెండో పెళ్లి.. అలా ఆలోచించలేరంటూ 'గుప్పెడంత మనసు' జగతి

తెలుగు రాష్ట్రాల్లో గుప్పెడంత మనసు సీరియల్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. ఇందులో రిషి, వసుధార పాత్రలతో పాటు జగతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. రిషీంద్ర భూషణ్ తల్లిగా అమ్మ ప్రేమ చూపిస్తూనే ధైర్యవంతురాలైనా మహిళగా తన నటనతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా డైలాగ్స్ లేని సమయంలోను కేవలం కళ్లతో హావాభావాలు పలుకుతూ గుండెను పిండేసేలా పర్ఫామెన్స్ ఇస్తుంది. ఇదిలా ఉంటే జగతి పాత్ర చేసిన జ్యోతి రాయ్ పర్సనల్ జీవితంపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ పోస్ట్ పెట్టింది.

మంచి క్రేజ్:గుప్పెడంత మనసు సీరియల్ (Guppedantha Manasu Serial) ద్వారా మంచి క్రేజ్ తో పాటు ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది జగతి అలియాస్ జ్యోతి రాయ్ (Jyothi Rai). ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా తెగ ఫేమస్ అయిన జ్యోతి రాయ్ సినిమాల్లో సైతం నటించింది. పదేళ్ల క్రితం వచ్చి కన్యాదానం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జ్యోతి రాయ్ తర్వాత అనేక ధారావాహికలతో ఆకట్టుకుంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Post About Marriage With Suku Purvaj

హీరోయిన్ గా:కన్యాదానం తర్వాత కన్నడ, తుళు భాషల్లో బాగా పాపులర్ అయింది జ్యోతి రాయ్. సుమారు 20కిపైగా ధారావాహికల్లో నటిగా, హీరోయిన్ గా అట్రాక్ట్ చేసింది. కస్తూరి నివాస్ సీరియల్ మంచి పేరు తీసుకుని వచ్చింది. జోగుల, బందె బరతావ కాల, గెజ్జెపూజే, కన్యాదాన, లవలవికే, మురుగంటు, ప్రేరణ, కిన్నెర, అనురాగ సంగమం వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

రిలేషన్ న్యూస్:ప్రస్తుతం జ్యోతి రాయ్ 'ప్రెట్టీ గర్ల్' వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది హిందీ, ఇంగ్లీషు భాషలో విడుదల కానుంది. అలాగే ఏ మాస్టర్ పీస్ అనే మరో మూవీ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అందాలను ఘాటుగా వడ్డించే జ్యోతి రాయ్ యువ దర్శకుడు సుకుపుర్వాజ్ (Suku Purvaj) అలియాస్ సురేష్ కుమార్ తో రిలేషన్ లో ఉందని ఈ మధ్య వార్తలు తెగ వస్తున్నాయి.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Post About Marriage With Suku Purvaj

కొడుకుతోపాటు:జ్యోతి రాయ్ రిలేషన్ పై వస్తున్న వార్తలను నిజం చేసేలా ఆమె ట్విటర్ హ్యాండిల్ లో జ్యోతి పుర్వాజ్ అని పేరు పెట్టుకోవడం ఉంది. దీంతో జ్యోతి రాయ్ రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో టాక్ ఒక్కసారిగా గుప్పుమంది. అయితే తనపై వస్తున్న వార్తలపై తాజాగా ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఓ ఫొటో ద్వారా రియాక్ట్ అయింది. ఇందులో సుకు పుర్వాజ్ తో పాటు జ్యోతి రాయ్ కొడుకు కూడా ఉన్నాడు.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Post About Marriage With Suku Purvaj

అలా ఆలోచించలేరు:"మీకు ఏం తెలియకుండా ఎవరినీ నిందించొద్దు. మీరు ఎప్పుడూ నా స్థానంలో ఉండి ఆలోచించలేరని గుర్తు పెట్టుకోండి" అని క్యాప్షన్ రాసుకొచ్చింది జ్యోతి రాయ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆమె ఎవరినీ ఉద్దేశించి అలా పోస్ట్ చేసిందనేది తెలియరాలేదు. ఇక వారిపై వస్తున్న పుకార్లపై ఈ పోస్టుతో ఓ క్లారిటీ వచ్చేసిందనే అనుకోవచ్చు.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Post About Marriage With Suku Purvaj

మడికేరిలో:ఇదిలా ఉంటే కర్ణాటకలోని మడికేరిలో జన్మించిన జ్యోతి రాయ్ మంగళూరులో చదువుకుంది. ఆమెకు 20 ఏళ్లప్పుడే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి కుమారుడు ఉన్నాడు. ఇక ప్రస్తుతం జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉన్న డైరెక్టర్ సుకుపుర్వాజ్.. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X