బట్టలు లేకుంటే చేస్తారా.. డబ్బు కోసమే ఆ పని: బయటపెట్టిన జగతి మేడం
సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్లు కొంత కాలానికే పరిమితం అవుతుంటారు. కానీ, కొందరు మాత్రం ఏజ్‌తో సంబంధం లేకుండా యాక్టింగ్ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ నటి జ్యోతి రాయ్ ఒకరు. చాలా ఏళ్ల నుంచే నటిగా సత్తా చాటుతోన్న ఈ భామ.. టీవీ సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా ఇప్పుడు కూడా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జ్యోతి రాయ్ సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
అలా ఫేమస్ అయిన జ్యోతి
బెంగళూరుకు చెందిన జ్యోతి రాయ్ మొదట మోడల్‌గా ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఈ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించింది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా' అనే సీరియల్ ద్వారా నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ తర్వాత అదే భాషలో చాలా సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో కూడా చాలా సీరియళ్లు చేసి ఫేమస్ అయింది.

తెలుగులోకి.. జగతిగా క్రేజ్
కెరీర్ ఆరంభంలోనే నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న సొంతం చేసుకున్న జ్యోతి రాయ్.. చాలా కాలం క్రితమే 'కన్యాదానం' అనే సీరియల్‌తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో జగతి అనే పాత్రలో కనిపించి అలరించి తన క్రేజ్‌ను పెంచేసుకుంది.
సిరీస్‌లు, సినిమాలు చేస్తూ
ఈ మధ్య కాలంలో దూసుకుపోతోన్న జ్యోతి రాయ్.. 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి చిత్రాల్లో నటించింది. అలాగే, 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' అనే సిరీస్‌లు చేసింది. ఇప్పుడు 'ప్రెట్టీ గర్ల్', 'నో మోర్ సీక్రెట్స్' అనే వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. అలాగే, యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్‌తో జ్యోతి రాయ్ లవ్ ట్రాక్ నడుపుతోంది.

అమ్మాయిలే శత్రువులని
జ్యోతి రాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'అమ్మాయిలే అమ్మాయిలకు శత్రువులు. మొన్న రేప్ జరిగింది. ఆ న్యూస్‌కు సంబంధించి కామెంట్స్ చూస్తే.. అమ్మాయిలే నెగెటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. అలా ఇంకొకరి గురించి మీరు ఎలా మాట్లాడుతారు? ఎక్కడో గాలిలో ఒక న్యూస్ వస్తే అది ఎలా ఫార్వర్డ్ చేస్తారు' అని ప్రశ్నించింది.
డబ్బు కోసం.. రాసి ఉంది
జ్యోతి రాయ్ కంటిన్యూ చేస్తూ.. 'సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోల వల్ల డబ్బులు వస్తాయి. కానీ, రేపు వాళ్ల ఫ్యామిలీలో ఎవరికైనా అలా అయితే.. అప్పుడెలా మాట్లాడతారు? ఎలా జడ్జ్ చేస్తారు? కాబట్టి ఇకపై అలా చేయకండి' అని చెప్పింది. సినిమాల గురించి స్పందిస్తూ.. 'నేను ఆలస్యంగా సినిమాలు చేస్తున్నా.. ఇలాగే చేయాలని ఉంది కాబోలు' అని చెప్పుకొచ్చింది.

బట్టలు లేకుంటే చేస్తారా
జ్యోతి రాయ్ కొనసాగిస్తూ.. 'నాకు పర్సనల్‌గా వచ్చే మెసేజ్‌లు చూపిస్తూ అందరూ షాక్ అవుతారు. చాలా మంది శ్రీరాముడిలా మాట్లాడతారు.. మళ్లీ ఇలా చెత్త మెసేజ్‌లు పంపిస్తారు. ఇప్పుడు నీ అక్క, నీ చెల్లి, మీ అమ్మ.. ఒకవేళ బట్టలు లేకుండా ఉంటే మీరు వాళ్లను రేప్ చేస్తావా? రేపు మీ కూతురుతోనూ అలాగే ప్రవర్తిస్తారా' అంటూ తన ఆవేదనను అంతా బయటపెట్టేసింది.


Click it and Unblock the Notifications











