భర్తకు విడాకులిచ్చి మరొకరితో డేటింగ్.. 38 ఏళ్ల ఏజ్‌లో జగతి మేడం రొమాన్స్ చూశారా?

గతంలో కంటే ఇప్పుడు చాలా మంది నటీమణులు నిత్యం వార్తల్లోనే ఉంటూ తెగ హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం వాళ్లు యాక్టింగ్ చేస్తూ బిజీగా ఉండడం మాత్రమే కాదు.. సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. అవును.. దీని ద్వారా ఎంతో మంది సీనియర్ భామలు సైతం సెన్సేషన్ అవుతున్నారు. అందులో 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతి రాయ్ ఒకరు. చాలా కాలంగా నటిగా సత్తా చాటుతోన్న ఈ భామ.. ఎన్నో ఆఫర్టు అందుకుంటోంది. అలాగే, ఓ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ రొమాంటిక్ పిక్ వదిలింది. అది మీరే చూడండి!

అలా ఎంట్రీ.. పాపులర్
కర్నాటకకు చెందిన జ్యోతి రాయ్ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అలా ఆ రంగంలో తనదైన అందంతో మాయ చేసేసింది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా' అనే సీరియల్ ద్వారా నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ తర్వాత అదే భాషలో పలు సీరియళ్లను కూడా చేసింది. అనంతరం తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి పాపులారిటీ పొందింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Cute Pic In Instagram

జగతి మేడంగా ఫేమస్
దక్షిణ భారతదేశంలో చాలా భాషల్లో సీరియల్ నటిగా సెన్సేషన్ అయిపోయిన జ్యోతి రాయ్.. చాలా ఏళ్ల క్రితమే 'కన్యాదానం' అనే సీరియల్‌తో తెలుగులోకి కూడా వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇందులో జగతి అనే పాత్రలో జీవించేసి ఎనలేని పాపులారిటీని, క్రేజ్‌ను పెంచేసుకుంది.

వరుస ఆఫర్లతో బిజీగా
సుదీర్ఘ కాలంగా నటిగా ప్రయాణం సాగిస్తోన్న జ్యోతి రాయ్.. సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి చిత్రాలను చేసింది. అలాగే, 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు 'నో మోర్ సీక్రెట్స్', 'ప్రెట్టీ గర్ల్' సిరీస్‌లలో నటిస్తోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Cute Pic In Instagram

ఆ డైరెక్టర్‌తో డేటింగ్
జ్యోతి రాయ్‌ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బాబుకు కూడా తల్లైంది. అనంతరం భర్తకు విడాకులు ఇచ్చేసింది. అయితే, ఇప్పుడు జ్యోతి రాయ్.. సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్‌తో డేటింగ్ సాగిస్తోంది. కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని వివాహానికి సైతం రెడీ అయిపోయారు.

అక్కడ యమ యాక్టివ్‌
చాలా ఏళ్లుగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Cute Pic In Instagram

లవర్‌తో ఎంజాయ్
తనదైన రీతిలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న సీనియర్ బ్యూటీ జ్యోతి రాయ్.. తరచూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ నటీమణి తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో రొమాంటిక్‌గా ఉన్న పిక్స్‌ను కూడా వదులుతోంది. అలాగే, నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూ సంచలనంగా మారిపోతోంది.

రొమాంటిక్ పిక్‌తో
జ్యోతి రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమెను ప్రియుడు సుకు పుర్వాజ్ ఎత్తుకుని గాల్లో తిప్పుతున్నట్లు కనిపించింది. అంతేకాదు, ఈ ఫొటోలో జ్యోతి రాయ్ షార్ట్ గౌన్ మాత్రమే ధరించింది. ఫలితంగా ఈ ఫొటోకు భారీ స్థాయిలో నెటిజన్ల నుంచి స్పందన కూడా లభిస్తోంది. దీంతో ఇది కాసేపట్లోనే వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X