39 ఏళ్ల ఏజ్‌లో 19 అమ్మాయిలా జగతి మేడం.. జ్యోతి రాయ్ గ్లామర్ షో అదుర్స్!

సౌతిండియాలో ఎంతో మంది భామలు ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ కన్నడ నటి జ్యోతి రాయ్ ఒకరు. మొదట్లో సినిమాల్లో నటించిన ఈమె.. తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఈ మధ్య కాలంలో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఘాటు ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

ఆ భాషల్లోనటించి ఫేమస్
కర్నాటకకు చెందిన జ్యోతి రాయ్ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించింది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా' అనే సీరియల్ ద్వారా నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ తర్వాత అదే భాషలో చాలా సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి యమా ఫేమస్ అయింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Stunning Photos In Instagram

తెలుగులోనూ.. జగతిగానే

సీరియల్ నటిగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న జ్యోతి రాయ్.. చాలా కాలం క్రితమే 'కన్యాదానం' అనే సీరియల్‌తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో జగతి అనే పాత్రలో కనిపించి అలరించింది. ఈ రోల్ కారణంగా జ్యోతి రాయ్ రేంజ్ భారీగా పెరిగింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Stunning Photos In Instagram

ఇప్పుడు వాటితో ఫుల్లుగా
ఫుల్ ఆఫర్లు అందుకుంటోన్న జ్యోతి రాయ్.. 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి చిత్రాల్లోనూ నటించింది. అలాగే, 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' అనే సిరీస్‌లను చేసింది. ఇప్పుడు 'ప్రెట్టీ గర్ల్', 'నో మోర్ సీక్రెట్స్' అనే వెబ్ సిరీస్‌లు చేస్తోంది. అలాగే, యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్‌తో జ్యోతి రాయ్ ప్రేమాయణం సాగిస్తోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Stunning Photos In Instagram

అందులో యమా బిజీగా

ఎన్నో ఏళ్లుగా సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్న జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో సైతం ఫుల్లు యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. తద్వారా అభిమానులకు మజాను అందిస్తోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Stunning Photos In Instagram

హాట్ షోతో కాక రేపుతూ
చాలా మంది నటీమణులు మాదిరిగా జ్యోతి రాయ్ కేవలం సోషల్ మీడియాలో అప్‌డేట్లే చేయడంలేదు. ఇందులో ఈమె తరచూ తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా క్రేజ్ తెచ్చుకుంటోంది. అలాగే, నిత్యం సెన్సేషన్ అవుతోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Shares Stunning Photos In Instagram

జ్యోతి పిక్స్ ఫుల్ వైరల్‌

జ్యోతి రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు షర్ట్ విప్పేసి, లోదుస్తుల జిప్ తీసేసి మరీ అందాలను ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె పరువాలు యమా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా జ్యోతి రాయ్ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X