Mukhesh Gowda Vs Ravi Shankar: అమ్మ, అక్క, చెల్లిలపై బూతులు.. గుప్పెడంత మనసు హీరోల ఫ్యాన్ వార్

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్ వార్స్ గురించి వింటూనే ఉంటాం. మా హీరో గొప్ప అని ఒక హీరో ఫ్యాన్స్.. లేదు మా హీరో గొప్ప అని ఇంకో హీరో ఫ్యాన్స్ తిట్టుకోవడం చూస్తూనే ఉంటాం. ఇక ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే.. ఆ సమయంలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఒక మినీ యుద్ధమే జరుగుతుంది.

మా హీరోకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉందని ఒకరు అంటే.. లేదు మా వాడి వలనే సినిమా హిట్ అయ్యిందని ఇంకొకరు చెప్పుకొస్తారు. ఇలాంటివి నిత్యం సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటాయి. కానీ, మీరెప్పుడైనా సీరియల్ హీరోల మధ్య కూడా ఫ్యాన్ వార్స్ చూసారా..? వామ్మో ఇదెక్కడి విడ్డూరం అమ్మా..ఇప్పుడు వీళ్లు కూడా మొదలుపెట్టారా.. ? సినిమా హీరోల ఫ్యాన్స్ తోనే చస్తున్నాం అంటే.. ఇప్పుడు వీరు కూడా వచ్చారా.. ? ఇంతకీ ఏ సీరియల్.. ? ఆ హీరోలు ఎవరు.. ? అని తెలుసుకోవాలని ఉందా.. రండి తెలుసుకుందాం.

guppedantha manasu fame ravishankar talking about Mukesh Gowda aka Rishi fans Trolling

స్టార్ మా టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఒక చిన్న సీరియల్ గా మొదలైన గుప్పెడంత మనసు కథ, కథనం బాగుండడంతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. కుమార్ పంతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీరియల్ లో రిషి వసుధార జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా రిషి అలియాస్ ముఖేశ్ గౌడకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. రిషి సార్ గా ఆయన హుందాతనం, నటన అందరిని మంత్రముగ్దులను చేసింది.

ఇక గతకొన్ని నెలల క్రితం ముఖేశ్.. సీరియల్ నుంచి తప్పుకున్నాడు. కొన్ని అనారోగ్య కారణాల వలన ఆయన సీరియల్ కు దూరమవడంతో.. డైరెక్టర్, మను అనే క్యారెక్టర్ ను దింపాడు. అది కూడా కొన్నిరోజులు బాగానే నడిచింది. అయితే రిషి కన్నా.. మనుకే ఎక్కువ పేరు రావడంతో రిషి ఫ్యాన్స్.. మనుపై ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. రిషి వలనే సీరియల్ ఇంకా ఉందని, ఆయన ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేయలేరని చెప్తూ మను అలియాస్ రవి శంకర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రిషిని తప్పించి మనును తీసుకొచ్చారని.. అతడి తల్లిని, చెల్లిని తీసుకొచ్చి మరీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ నెగెటివ్ కామెంట్స్ పై రవి శంకర్ స్పందించాడు. ఇది పద్దతి కాదని, వారు ఇలా చేయకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి శంకర్ మాట్లాడుతూ.. " గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రలో నటించే ముఖేశ్ గౌడకు ఆరోగ్యం బాలేదు. దీంతో ఆ కథకు ఒక హీరో అవసరమని నన్ను తీసుకున్నారు. హీరో లేకుండా కథను ముందుకు తీసుకువెళ్లలేరు. అందుకే ఆ పాత్రకు నాన్ని తీసుకున్నారు. నాకు ఇచ్చిన పాత్రను నేను పోషించాను. కానీ, ఆ పాత్ర చేసినందుకు నన్ను బూతులు తిడుతున్నారు.

అమ్మను, అక్కను, చెల్లిని.. ఇలా అందరిని టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సరే ఆ బూతులు తిట్టేవాడు.. బూతు పోస్టులు పెట్టేవాడి ప్రొఫైల్ చూస్తే అవన్నీ ఫేక్ అకౌంట్స్ .. అందులో ఏం ఉండవు. పోనీ బయటకు వచ్చి మాట్లాడరా అంటే మాట్లాడలేడు. లైవ్ లోకి వస్తాడా అంటే రాడు.. అక్కడకురా తేల్చుకుందాం అని చెప్తున్నా. నేను సీరియల్స్ కు ఊరికే రాలేదు. నటన మీద ఫ్యాషన్ తో వచ్చాను.

నేను ఈరోజు సీరియల్స్ మానేసినా కూడా బిందాస్ గా బతకగలను. మేము సంపాదించింది దానం చేస్తున్నాం. అడుక్కోవడంలేదు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ మెంబర్ ను నేను. మా నాన్న ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఆటో స్టాండ్ నిర్మించారు. అందుకే నన్ను ఆ యూనియన్ మెంబర్ ను చేశారు. నన్ను తిడుతున్నట్లు వాళ్లకు చెపితే వాయించిపడేస్తారు. నేను తిట్టగలను.. అలా చేస్తే మీకు వాళ్లకు తేడా ఏముంటుంది. ఇలా పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ " అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X