twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Weekly Roundup: జగతి-మహేంద్రలకు తెలిసిన నిజం.. అపార్థంలో రిషి.. దేవయాని కొత్త ప్లాన్!

    |

    యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

     జనవరి 30వ ఎపిసోడ్ లో..

    జనవరి 30వ ఎపిసోడ్ లో..

    రిషి ఎక్కడ అని వసుధారను అడుగుతుంది దేవయాని. రిషి సర్ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు అని వసుధార అంటుంది. జరిగినవన్నీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఏం చేశావో.. నీకు మాత్రమే తెలుసు.. మళ్లీ ఎందుకు వచ్చావో నాకు అర్థం కావడం లేదు అని దేవయాని అంటుంది. రిషి సర్ కి, నాకు అర్థం అయితే చాలు అని వసుధార అంటుంది. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఈ బ్లాంక్ చెక్ తీసుకుని ఊరు వదిలి వెళ్లిపో అని దేవయాని అంటుంది. నేను ఎందుకు వెళ్లాలి అని వసుధార అంటే.. పెళ్లి చేసుకుని మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్. పైగా గౌతమ్ ఇంట్లో ఉంటున్నారు. అసలు రిషిని ఏం చేద్దామని అనుకుంటున్నారు అని దేవయాని అడుగుతుంది. అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నారు అని చక్రపాణి నిజం చెప్పబోతుంటే.. అది ఆపి.. ఏం అనుకోకుండా లోపలికి వెళ్లండి నాన్నా అని పంపించివేస్తుంది వసుధార. ఒక చెక్ మీద సంతకం పెట్టి వెళ్లిపోమ్మంటే నేను ఎలా వెళ్తాను. వచ్చిన దారిలోనే వెళ్లిపోండి. ఇంతకన్నా మర్యాదగా చెప్పలేను అని వసుధార అంటుంది. రిషికి దూరంగా వెళ్లిపో.. ఈరోజుతో సమస్యకు పుల్ స్టాప్ పెడదాం అని దేవయాని అంటుంది. చాలా సమస్యలకు మీరే కారణం. మీరు సమస్యల గురించి మాట్లాడకపోతేనే బెటర్ అనేసి చెక్ చేతిలో పెడుతుంది.

    జనవరి 31వ ఎపిసోడ్ లో..

    జనవరి 31వ ఎపిసోడ్ లో..

    రిషి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవయాని. అలాగే కంగారుపడతుంటుంది. పెద్దమ్మా మీరు ఇక్కడ ఏంటీ అని రిషి అడుగుతాడు. తను ఇక్కడ ఉండటమేంటీ.. గౌతమ్ ఫ్లాట్ కదా అని రిషితో దేవయాని అంటుంది. అవన్నీ మీకెందుకు.. తను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్. తనకు ఒక సౌకర్యాలు సమకూర్చే బాధ్యత మనది. అందుకే ఈ ఫ్లాట్ ఇచ్చాం అని రిషి అంటాడు. అప్పుడు దేవయాని ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు.. ఏం మాట్లాడారో కూడా తెలియదు. కానీ ఇదంతా ప్రేమ వల్ల వచ్చిన సమస్య. అదే పెద్దమ్మకు నాపై ఉన్న ప్రేమ వల్ల వచ్చిన సమస్య అని చెబుతాడు రిషి. తర్వాత పెద్దమ్మ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అని చేతులు జోడించి క్షమాపణలు చెబుతాడు రిషి. అయ్యో మీరు క్షమాపణలు చెప్పడం ఏంటీ అన్నట్లుగా చూస్తాడు చక్రపాణి. అనంతరం దేవయానిని తీసుకుని తన ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతాడు.

    ఫిబ్రవరి 1వ ఎపిసోడ్ లో..

    ఫిబ్రవరి 1వ ఎపిసోడ్ లో..

    మనమంతా కలిసి మాట్లాడుకునే రోజు ఆనందంగా ఉండే రోజు ఎప్పుడొస్తుంది. ఈ పొగరుని మళ్లీ ఎప్పుడు పొగరు అని పిలుస్తారు సార్ అనకుంట తాళి చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. ఇంతలో తండ్రి చక్రపాణి వస్తాడు. బాధపడుతున్నావా అమ్మా అని చక్రపాణి అంటే.. ఎదురుచూస్తున్నాను అని వసుధార అంటుంది. రిషి సార్ మాటల్లో నీపై ఆకాశమంతా ప్రేమ ఉందమ్మా.. రిషి కళ్లల్లో నీపై ఉన్న ప్రేమను చూశాను అని చక్రపాణి అంటాడు. నాన్న ప్రేమను ఎవరు గెలిపించాల్సిన అవసరం లేదు.. ప్రేమ తనను తాను గెలిపించుకుంటుంది అని వసుధార అంటుంది. రిషి సార్ కు నిజం చెప్పొచ్చు కదమ్మా అని చక్రపాణి అంటే.. లేదు నాన్నా రిషి సారే తెలుసుకోవాలి.. నేను చెబితే చెవులు మాత్రమే వింటాయి. అదే రిషి సార్ తెలుసుకుంటే.. మనసు కూడా వింటుంది అని వసుధార అంటుంది. మరోవైపు తన గదిలో నా జీవితంలోకి వచ్చిన నా మనసుని, నా ఆనందాన్ని అన్నింటిని రంగులమయం చేశావు.. అవన్నీ జ్ఞాపకాలుగా మార్చి వెళ్లిపోయావు అని అనుకుంటాడు రిషి. అంతలోనే.. వసుధార మెడలో తాళీ, వసుధార నా భార్య అని రాజీవ్ అన్న మాటలు తలుచుకుని.. వేరొకరి భార్య గురించి నేను ఆలోచించకూడదు అని అనుకుంటాడు రిషి.

     ఫిబ్రవరి 2వ ఎపిసోడ్ లో..

    ఫిబ్రవరి 2వ ఎపిసోడ్ లో..

    రిషి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు తూలి పడబోతుంటే.. వసుధార వచ్చి పట్టుకుంటుంది. అలా ఇద్దరు కొద్దిసేపు కళ్లలో కళ్లు పెట్టి చూసకుంటారు. అక్కడ తండ్రి చక్రపాణి, జగతి-మహేంద్ర ఉన్న విషయం మరిచిపోయి మరి రొమాన్స్ సాగిస్తారు. తర్వాత ఇద్దరూ తేరుకుంటారు. షూస్ వేసుకుని వెళ్లండి సార్ అని వసుధార అంటుంది. రిషి కారు దగ్గరికి వెళతాడు. ఇంతలో వసుధార దగ్గరికి తండ్రి చక్రపాణి వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారు నిజం చెప్పేద్దాం అంటే.. వద్దు నాన్నా.. మనం చెబితే.. సంజాయిషీ అవుతుంది అని చెప్పి వద్దంటుంది వసుధార. తర్వాత అక్కడి నుంచి అందరు వెళ్లిపోతారు. మరోవైపు ఇంట్లో వీళ్లందరూ ఎక్కడికి వెళ్లారు అంటూ ధరణిపై కోప్పడుతుంది. ఇంతలో మహేంద్ర-జగతి ఎంట్రీ ఇవ్వడం చూసి.. ఏంటో ఆది దంపతులు పొద్దున్నే అని అంటుండగా.. రిషి వస్తాడు. రిషిని చూసి షాక్ అయి అలాగే ఆగిపోతుంది దేవయాని.

    ఫిబ్రవరి 3వ ఎపిసోడ్ లో..

    ఫిబ్రవరి 3వ ఎపిసోడ్ లో..

    ఏంటీ సార్ ఈ ట్విస్ట్ అని రాజీవ్ అంటే.. ట్విస్ట్ ఇక్కడ కాదు అక్కడ అని పోలీసుల దగ్గరికి పంపిస్తాడు రిషి. పోలీసులను చూసి షాక్ అవుతాడు రాజీవ్. ఏరా తప్పించుకుంటే దొరకవు అనుకున్నావా. నువ్ వస్తావని తెలిసే మేము రిషి సార్ ని ఆపమని చెప్పాము. ఏంట్రా ఆ అమ్మాయి నా పెళ్లామా.. అసలు నువ్వు తాళే కట్టలేదు కదరా.. నీకు ఎలా పెళ్లాం అవుతుంది అని ఎస్సై అనడంతో.. జగతి-మహేంద్ర, రిషి అందరూ షాక్ అవుతారు. కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్లండి అని చెప్పిన ఎస్సై.. రిషి దగ్గరికి వెళ్లి అప్పుడు మిస్ అండస్టాండ్ అయింది అని సారీతోపాటు రాజీవ్ ను పట్టించినందుకు థ్యాంక్స్ చెబుతాడు. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడ జరిగినదంతా దేవయానికి కాలేజీ మేడమ్ చెప్పడంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాజీవ్ ఇలా దొరికేసేడేంటీ.. ప్లాన్ మార్చాలా అని అనుకుంటుంది దేవయాని.

    ఫిబ్రవరి 4వ ఎపిసోడ్ లో..

    ఫిబ్రవరి 4వ ఎపిసోడ్ లో..

    వసుధార అలా చెప్పడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక రిషికి జరిగింది చెప్పేయ్ అని జగతి అంటుంది. లేదు మేడమ్. అది రిషి సార్ తెలుసుకోవాలి అని వసుధార అంటుంది. మళ్లీ ఇదంతా ఎందుకు వసుధార అని మహేంద్ర అంటాడు. నువ్వు చెప్పకపోతే మేము వెళ్లి చెబుతాం అని చక్రపాణి అంటాడు. వద్దు నాన్న. నన్ను క్షమించండి. నాకు మీపై గౌరవం ఉంది. కానీ నాకు రిషి సార్ మధ్య ఎవరి సంప్రదింపులు జరుపకూడదుని నిశ్చయించుకున్నాను. రిషి సార్ నన్ను అపార్థం చేసుకున్నారు. దాన్ని తొలగించుకోవాలి. మా ప్రేమకు నాకు నేనుగా పెట్టుకున్న పరీక్ష. అందులో రిషి సార్ గెలవాలి. గెలిపిస్తాడని నమ్మకం ఉంది. నేను వేరేవాళ్లతో తాళి కట్టించుకున్నా అని రిషి సార్ అలా ఎలా అనుకుంటారు మేడమ్ అని వసుధార అంటుంది. దీంతో వసుధారను వెళ్లి జగతి హగ్ చేసుకుంటుంది. సారీ అని చెబుతుంది. రిషి సార్ లేకపోతే నేను ఉండలేను అని తెలుసుకున్నాను. అలాగే రిషి సార్ కూడా ఉండలేరన్న నిజం తెలుసుకోవాలి. దయచేసి ఈ నిజాన్ని రిషి సార్ కు మీరు చెప్పొద్దు అని ఒట్టు వేయించుకుంటుంది వసుధార.

    English summary
    Guppedantha Manasu Weekly Roundup:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X