Guppedantha Manasu Weekly Roundup: జగతి-మహేంద్ర దెబ్బకు తోక ముడిచిన దేవయాని.. రిషికి నిజం తెలియనుందా?

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.

ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 6వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 6వ ఎపిసోడ్ లో..

చపాతీలు తెచ్చాను సార్.. మీకు కూడా చపాతీలు చేయడం వచ్చు కదా సార్ అని వసుధార అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అని రిషి అంటే.. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అడగటానికి మీకు ఇగో అడ్డు వస్తుంది. అయినా మీరు అడిగినా నేను చెప్పను అని వసుధార అనుకుంటుంది.

రిషి పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్ గా అడిగితే వసుధార కూడా అంతే వంకరగా సమాధానాలు చెబుతుంది. చెప్పాల్సింది మాత్రం చెప్పవ్ కదా అని తిట్టుకుంటాడు రిషి. ఇద్దరు కిలిస చపాతీలు తింటారు. జీవితాంతం మీతో కలిసి తినే అవకాశం ముందు ముందు వస్తుందని వసుధార అనుకుంటే.. నీతో కిలిసి గడిపే ప్రతీ క్షణం ఎంతో బాగుంటుందని రిషి అనుకుంటాడు. మరోవైపు ఇంట్లో రాజీవ్ పోలీసులకు పట్టుబడటంపై కంగారు పడుతుంది దేవయాని.

వాడు ఉంటే వసుధారను ఎలాగో ఇబ్బంది పెట్టేవాడు. ఉన్న ఒక్క ఆయుధం పోయింది. ఇప్పుడు రిషి అయితే వసుధార పక్కన కూర్చోవాలి లేదా జగతితో ఉండాలి. అందులో ఏది జరిగినా నాకే నష్టం. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని.

ఫిబ్రవరి 7వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 7వ ఎపిసోడ్ లో..

మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అని చక్రపాణి మర్యాదలు చేస్తుంటాడు. మర్యాదలు పక్కన పెట్టి కాసేపు కూర్చోండి. వీళ్లిద్దరిని చూస్తే బాధేస్తుంది.. భయమేస్తుంది. రిషి తనంతట తానే నిజం తెలుసుకోవాలని వసుధార అనుకుంటుంది. వసుని తప్పుబట్టలేం. కానీ రిషి బాధను చూడలేకపోతున్నాం అని జగతి అంటుంది.

వసుధార బయటకు అలా అంటుంది కానీ, రిషి సార్ గురించి చాలా బాధపడుతోంది మేడమ్ అని చక్రపాణి అంటాడు. అందుకే.. వారిద్దరినీ పక్కపక్కన ఉండేలా ఒకటి ప్లాన్ చేశాం. దానికి మీరు సహాయం చేస్తే చాలు.

వాళ్లిద్దరినీ ఏదైనా టూర్ పంపించాలి అని అనుకుంటున్నాం అని మహేంద్ర అంటాడు. కాలేజీలో పొడిపొడిగా మాట్లాడుకుంటున్నారు. అదే పక్కపక్కన ఉంటే చనువు పెరిగి నిజం తెలిసే అవకాశం ఉంది. టూర్ వివరాలు తర్వాత చెబుతాం అని జగతి అంటుంది. అందుకు సరే అని అంటాడు చక్రపాణి.

ఫిబ్రవరి 8వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 8వ ఎపిసోడ్ లో..

రిషి, మహేంద్ర-జగతి ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగంగా చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్లి కిట్ లు ఇవ్వాలి కదా. అందుకు నేను జగతి వెళ్తున్నాం అని చెబుతాడు మహేంద్ర. సరే వెళ్లండి డాడ్ అని రిషి అంటాడు. అయితే టూర్ కు వెళ్లేది మనం కాదు.. రిషి వసుధార అని తెలిస్తే.. ఉంటుంది అని జగతితో అంటాడు మహేంద్ర.

మరోవైపు ఇంట్లో లవ్ సింబల్ వేసి దాంట్లో వీఆర్ అని లెటర్ రాసి సంతోషపడుతుంది వసుధార. మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు. ఇవి రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి అనుకుంటూ ఆనందంగా ఉంటుంది వసుధార. ఇంతలో చక్రపాణి వచ్చి వసుధారను చూసి సంతోషిస్తాడు.

త్వరలోనే మీ ఇద్దరు ఒక్కటి అవుతారని అనిపిస్తోందమ్మా అని చక్రపాణి అంటాడు. నాక్కూడా అలాగే ఉంది నాన్న అని చెప్పిన వసుధార వెళ్లి చందమామతో మాట్లాడుతుంది. హలో చందమామ నీకు కూడా కోపంగా ఉందా.. నేను నీకు భయపడతానని అనుకుంటున్నావా.. నేను రిషి సార్ కే భయపడను అని అంటుంది వసుధార.

ఫిబ్రవరి 9వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 9వ ఎపిసోడ్ లో..

రిషి సార్ అని మాటిమాటికి వసుధార అంటే.. భర్తను సర్ అంటున్నారు ఏంటీ.. మా ఊర్లో అయితే ఏమిటోయ్.. ఏవండి.. పెనిమిటీ అని పిలుస్తారని చెబుతుంది ధర్మయ్య భార్య. ఆమె లానే వసుధార ఏమిటోయ్.. ఏవండి.. పెనిమిటీ అని రిషిని ఇన్ డైరెక్ట్ గా పిలుస్తూ నవ్వుకుంటుంది. దీంతో రిషికి ఏం అర్థం కాదు. మీరు మా ఊరికి వచ్చి సాయం చేశారు.

వెళ్లేటప్పుడు మీ దంపతులకు బట్టలు పెడతాం అని ధర్మయ్య అనేసరికి.. రిషి మళ్లీ షాక్ తో బిత్తరపోతాడు. ఏదో ఒక కారణం చెప్పి వద్దంటాడు రిషి. భోజనం అయ్యాక మళ్లీ వచ్చే ఏడాది కల్లా పాపతోనో.. బాబుతోనే మా ఇంటికి రావాలని ధర్మయ్య అనే సరికి మళ్లీ షాక్ అయిన రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. తర్వాత రిషి, వసుధార ఇద్దరు వెళ్లివస్తామని చెప్పి బయలు దేరతారు.

ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉందామని వసుధార అనుకుని నిద్ర పోతుంది. అది చూసి నేనేమైనా డ్రైవర్ నా.. అని అడ్డదిడ్డంగా కారు నడుపుతాడు రిషి. దీంతో ఏంటీ సార్ ఈ డ్రైవింగ్ అని వసు అంటే.. రోడ్డు మీద గుంతలు ఉంటే నన్నేం చేయమంటావ్ అని అంటాడు. నా జీవితంలో లేవని బాధపడాలో.. ఈ రకంగా అయినా నా పక్కన ఉన్నందుకు సంతోషించాలో అర్థం కావడం లేదని రిషి మనసులో అనుకుంటాడు.

ఫిబ్రవరి 10వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 10వ ఎపిసోడ్ లో..

నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు.. ఎన్నాళ్లు దాస్తావ్.. నువ్వు.. నీ ప్రేమ.. మాటలు అన్నీ అబద్ధమా అని రిషి అంటాడు. గట్టిగా అరిచి మాట్లాడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా అని వసుధార అంటుంది. నిన్ను నేను భయపెట్టడం ఏంటీ వసుధార.. అడుగుతున్నాను.. ఎవడు వాడు.. నీ మెడలో తాళి కట్టింది ఎవడు వాడు.. అని రిషి అంటే.. తాళికి సంబంధించిన వ్యక్తి గురించి అగౌరవంగా మాట్లాడొద్దు అని వసుధార అంటుంది.

నేను లవ్ చేస్తున్నా అని చెప్తే ముందు నో అన్నావ్.. తర్వాత నువ్వే వచ్చి ఎస్ చెప్పావ్. నేను ప్రేమిస్తున్నప్పుడే నో చెబితే అయిపోయేది కదా.. ఎందుకు నన్ను బాధపెడుతున్నావ్.. ఇదంతా నీ ప్లానా.. ఎందుకు ఇలా రంగులు మారుస్తున్నావ్.. ఎందుకు ఇలా జీవితాలు తలకిందులు చేస్తున్నావ్ అని రిషి కోపంగా, ఆవేదనగా అంటాడు. నేను రంగులు మారుస్తానా.. ఏంటీ సర్ మీరు ఇలా కూడా మాట్లాడుతారా అని వసుధార అంటుంది. నువ్వే ఇలా మాట్లాడిస్తున్నావ్ వసుధార.. ఆ తాళి ఎవరు కట్టారో చెప్పి తీరాలి.. అని గట్టిగా అడుగుతాడు రిషి.

ప్రేమగా అడిగితే చెప్పేదాన్ని కానీ మీరు చాలా ఘోరంగా మాట్లాడారు. నేను చెప్పను సార్.. చెప్పను గాక చెప్పను. నన్ను ఎన్ని మాటలు అన్నారు. రంగులు మారుస్తున్నా. నా గురించి ఇన్ని తెలుసుకున్న వాళ్లు ఇది కూడా మీరే తెలుసుకోండి.

ఫిబ్రవరి 11వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 11వ ఎపిసోడ్ లో..

పెళ్లయిన వసుధార వెంట రిషిని పంపించడం ఏంటీ. ఈ విషయం రిషికి చెప్తే ఏమవుతుందే తెలుసా అని దేవయాని బెదిరిస్తుంది. చెప్పండి అక్కయ్య. ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురుచూస్తున్నా. మా గురించి మీరు చెప్పండి. మేం ఇన్నాళ్లు కడుపులో దాచుకున్నవన్నీ మేం చెబుతాం అని జగతి అంటుంది. ప్రేమ అనే ముసుగులో రిషిని తప్పుదారి పట్టించారు.

అవన్నీ రిషికి చెబితే తెలుసు కదా.. అని ఇద్దరూ రివర్స్ లో దేవయానిని బెదిరిస్తారు. దీంతో ఏం చేయలేక, ఏం మాట్లాడలేక దేవయాని వెళ్లిపోతుంది. మరోవైపు రిషి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది వసుధార. ఇంతలో నిజం తెలియక రిషి సార్ బాధపడటం.. నిజం చెప్పలేక నువ్వు బాధపడటం ఎందుకమ్మ అని చక్రపాణి అంటాడు. అసలు నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో అని భయంగా ఉందని వసుధార అంటుంది.

మీ ఇద్దరి మధ్య దూరం పెరగకముందే నిజం చెప్పేయమని తండ్రి చక్రపాణి సలహా ఇస్తాడు. దీనికి చెప్పేస్తాను నాన్న.. మనసులోని భారాన్ని మోయలేకపోతున్నా. ఇక ఆలస్యం చేయను. వెళ్లి రిషి సార్ కి నిజం చెప్పేస్తాను అని వసుధార అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X