Guppedantha Manasu Weekly Roundup: ఒక్కసారిగా మారిన పరిస్థితులు.. వసు-జగతి-మహేంద్రలపై రిషి సీరియస్!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.
ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 13వ ఎపిసోడ్ లో..
రిషిని చూసి లోపలికి రమ్మంటారు మహేంద్ర. మేడమ్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని రిషి అడుగుతాడు. షాక్ అయిన జగతి.. మేం నీ దగ్గర ఏం దాస్తాం రిషి అని జగతి అంటుంది. వసుధార పెళ్లి చేసుకుని వచ్చాక కోపంగా ఉన్నారు. దూరం పెట్టారు. కానీ ఈ మధ్య మీరేదో మారినట్లు అనిపిస్తుంది నాకు అని రిషి అంటాండు. ఆహా పుత్ర.
ఇప్పుడు దారిలోకి వచ్చావ్. ఇదే మంచి అవకాశం రిషికి నిజం చెప్పేద్దామని జగతితో చిన్నగా అంటాడు మహేంద్ర. మేడమ్ వసుధార విషయంలో మీ మాట తీరు మారినట్లు ఉంది. అన్నీ మర్చిపోయి ఏం జరగనట్లు మాములుగా ఉంటున్నారు అని రిషి అంటే.. డేట్ మారుతుంది, క్యాలేండర్ మారుతుంది కదా రిషి.. అలానే అని మహేంద్ర అంటాడు.
డాడ్ మీరు ఉండండి అని మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి మేడమ్ అని రిషి అంటాడు. అసలు నిజం తెలిశాక చెప్పలేదని ఎంత గొడవ చేస్తాడో అని జగతి అనుకుంటుంది. తర్వాత ఇంతన్నా చెప్పేది లేదు అని వెళ్లిపోతాడు రిషి. మంచి అవకాశం జగతి ఇప్పుడే అసలు నిజం చెప్పేస్తే అయిపోయేది అని మహేంద్ర అంటాడు.

ఫిబ్రవరి 14వ ఎపిసోడ్ లో..
వసుధారను గమనించిన నువ్వెప్పుడు వచ్చావ్ అని రిషి అడుగుతాడు. నేనేప్పుడు మీ వెనకే ఉంటాను కదా సార్ అని వసుధార అంటుంది. నువ్వు నా వెనకాల కాదు.. నా పక్కన ఉండాల్సింది అని రిషి మనసులో అనుకుంటే.. వెనుక ఉన్న వారే పక్కకు వస్తారు. ఆ తర్వాత ముందుకు వస్తారు అని వసుధార అంటుంది. మ్యాథ్స్ లో లాజిక్స్ ఉంటాయి.
జీవితంలో కాదు అని రిషి అంటాడు. ఎక్కువగా ఆలోచించకండి సార్.. అన్ని విషయాలు తెలిసాక అంత ప్రశాంతంగా ఉంటుంది అని వసుధార అంటే.. అలాంటప్పుడు ఎందుకని కొన్ని విషయాలు దాచావ్ అని రిషి అంటాడు.
కొన్ని విషయాలు దాచాలి సార్ అని వసుధార అంటుంది. ఇదే నీతో వచ్చింది వసుధార. చెప్పాల్సినవి దాచేస్తావ్. దాచాల్సినవి చెబుతావ్ అని రిషి అంటాడు. ఇలా బాధ, జీవితం, ప్రేమ అంటూ మాట్లాడుకుంటూ ప్రేమగా పోట్లాడుకుంటారు.

ఫిబ్రవరి 15వ ఎపిసోడ్ లో..
రిషికి కావాల్సిన మనిషి గదిలో ఉన్నాడని చెప్పడంతో అక్కడికి వెళ్లి చూస్తాడు రిషి. అయితే అక్కడ ఎవరు ఉండకపోగా అద్దంలో రిషి కనిపిస్తాడు. గదిలో ఎవరు లేరన్న కోపంతో బయటకు వెళ్లిపోతాడు రిషి. అనంతరం జగతి, మహేంద్రను కలిసి జరిగినదంతా చెబుతుంది. ఇలా కాదు.. ఏదో ఒకటి తేల్చేద్దాం అని వసుధార దగ్గరికి బయలు దేరతారు జగతి-మహేంద్ర.
వసుధార లైబ్రరీలో బుక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అక్కడికి రిషి కూడా వస్తాడు. తనకు కావాల్సిన బుక్స్ వెతుక్కుంటూ చూస్తాడు. ఇంతలో కిందపడిన బుక్స్ తీస్తుండగా వసుధార మెడలోని తాళి బయటపడతుంది. ఆ తాళికి వీఆర్ అని గతంలో రిషి ఇచ్చిన ఉంగరం ఉంటుంది.
లైబ్రరీలో ఎదురెదురుగా బుక్స్ చూసుకుంటూ వెళ్తుంటారు వసుధార, రిషి. ఇలా బుక్స్ చూస్తుండగా.. అటవైపు నిల్చున్న వసుధార మెడలో తాళికి ఉన్న వీఆర్ ఉంగరం చూసి షాక్ అవుతాడు రిషి.

ఫిబ్రవరి 16వ ఎపిసోడ్ లో..
ఆ వీఆర్ అనే ఉంగరం అక్కడ ఎందుకుంది అని రిషి అడుగుతాడు. నా మెడలోకి ఈ ఉంగరం నా ఇష్టం లేకుండా రాదు కదా సార్ అని వసుధార అంటుంది. రిషి ఏదో చెప్పబోతుండగా ఇంతలో లైబ్రేరియన్ వస్తాడు. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న బుక్స్ వచ్చాయని రిషికి చెబుతాడు. వసుధారను చూసి మేడమ్ మీరు ఎప్పుడు వచ్చారని అడుగుతాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.
ఆటోలో వెళుతూ రిషి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నేను ఎంత చెబుదామని ట్రై చేస్తున్నా మీకు అర్థం కావడం లేదు. ఆ గదిలో మీకు కావాల్సిన వాళ్లు ఉన్నారని చెబితే వెళ్లారు. ఆ గదిలో మీరు ఒక్కరే ఉన్నారని ఎందుకు అర్థం చేసుకోలేదని, అనవసర కోపం తెచ్చుకుని నన్నే ప్రశ్నిస్తున్నారు.
నా ప్రశ్నకు మీరే సమధానం అని ఎప్పటికి తెలుసుకుంటారు అని వసుధార అనుకుంటుంది. మన మధ్య అడ్డుతెర ఎప్పుడో తొలగిపోయింది. కానీ మీరే తెలుసుకోవడం లేదు అని వసుధార మనసులో అనుకుంటుండగా.. తండ్రి చక్రపాణి ఫోన్ చేస్తాడు.

ఫిబ్రవరి 17వ ఎపిసోడ్ లో..
ఓ నిజం తెలుసుకునేందుకు నాకు ఇన్నాళ్లు పట్టిందేంటి.. ఇన్నాళ్లు ఎందుకు ఆగాలి. ఎందుకు ఇలా చేశావ్ వసుధార అని రిషి అంటే మీకోసమే సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది. నాకోసమే అయితే నాకు ఎందుకు చెప్పలేదు.. ఏంటీ దాగుడుమూతలు. ఎందుకు దాచావ్ అని రిషి అడిగితే.. నేను దాచలేదు సార్ అని వసుధార అంటుంది.
ఇన్ని రోజులు నా ఎమోషన్స్ తో, నా మనసుతో, నా ప్రేమతో ఆడుకున్నావ్.. ఇలా ఎందుకు అని రిషి అంటాడు. అసలు ఆరోజు ఏమైందంటే అని పెళ్లి రోజు జరిగినదంతా చెబుతుంది వసుధార. తన బావ రాజీవ్ రిషిని చంపేస్తానని బెదిరించడం.. తన తల్లిని పొడవడం అన్నీ చెబుతుంది. వసుధార చెప్పింది విన్న రిషి షాక్ అవుతాడు. మన మధ్య దాపరికాలు ఉండవు అనుకున్నాను.
నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్ గానే చేసి నన్ను చేతగాని వాడివి చేశావ్ అని రిషి అంటే.. అయ్యే అలా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్ అని వసుధార అంటుంది. దానికి.. కాలేజీలో వసుధార పెళ్లి చేసుకుంది అని ప్రతి ఒక్కరు అన్నప్పుడల్లా రంపంతో నా గుండె కోసినట్లు అయింది. ఇన్ని రోజులు ఒక శవంలా బతికాను.

ఫిబ్రవరి 18వ ఎపిసోడ్ లో..
మీరందరూ గొప్ప నటీనటులు. మీ అందరికీ తెలిసి కూడా నిజం చెప్పలేదు అంటూ మాట్లాడతాడు రిషి. దీంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. అంత బాధపడుతున్నాడు. నిజం చెప్పి తన బాధను తగ్గిద్దామాని మీకు అనిపించలేదా మేడమ్ అని బాధగా అడుగుతాడు రిషి. నేను ఆ ఒక్క విషయంలో తప్పా మిగతా అన్నింట్లో గౌరవంగానే చూస్తున్నాను కాద మేడమ్.. దానికి ప్రతిఫలంగా మీరు నాకు ఇచ్చింది ఇదా.
మిమ్మల్ని వసుధార ఏమైనా చెప్పిందా అని ఎన్నిసార్లు అడిగాను మేడమ్ అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా అని అంటాడు రిషి. డాడ్ మీరు నటులు అని తెలుసు.. కానీ మహా నటులు అని ఇప్పుడే తెలిసిందే ఇలా ఒక్కొక్కరిని ఆవేదనగా అడుగుతాడు. నేను బాధపడుతుంటే మీరు లోపల నవ్వుకున్నారు కదా.
దాన్ని రాక్షస ఆనందం అంటారు అని కఠినంగానే మాట్లాడాతాడు రిషి. మీరు కూడానా అని చక్రపాణి అడుగుతాడు. ఇంతలో నేనే వీళ్లను నిజం చెప్పొద్దని చెప్పాను సార్ అని వసుధార అంటుంది.


Click it and Unblock the Notifications











