Guppedantha Manasu Weekly Roundup: రిషికి జ్వరం.. దేవయానికి వరుసగా షాక్ లు.. వసుధార క్లారిటీ

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 20వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 20వ ఎపిసోడ్ లో..

చెప్పడానికి టైమ్, ధైర్యం చాలలేదు సార్ అని వసుధార అంటుంది. అలా అనకు వసుధార. ఏంటీ టైమ్, ధైర్యం లేవా. నాకు పరీక్షలు పెట్టే సమయంలో ఈ తాళి ఎవరు కట్టలేదు.. నాకు నేనే వేసుకున్నా అని చెప్పొచ్చు. లేదా ఒక్క మెసేజ్ చేయొచ్చు. ఒక్క వాయిస్ నోట్ పంపిచొచ్చు కదా. ఏంటీ వసుధార ఈ ఆటలు అని రిషి బాధగా అంటాడు. ఎవడో వచ్చి చంపేస్తా అంటూ భయపడిపోతావా వసుధార. కాలేజీ మొదట్లో ప్రెస్ మీట్ పెడతా అన్న నువ్వేనా ధైర్యం లేదని అన్నావ్ అని రిషి అంటాడు. ఆ టైమ్ లో నాకు వేరే మార్గం కనిపించలేదు. మనసుకు ఇదే కరెక్ట్ అనిపించి చేశాను. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను మిమ్మల్ని కాకుండా వేరే వాళ్లన పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని వసుధార అంటుంది. నేను నిన్ను వదులుకుంటానని నువ్వు ఎలా అనుకుంటావ్. దీని వల్ల నువ్వు ఏం సాధించావ్ నన్ను బాధ పెట్టడం, నాతో ఆడుకోవడం తప్పా ఇంకేం లేదు అన్న రిషి.. చక్రపాణి తీసుకొచ్చిన కాఫీ తాగి.. కాఫీ బాగుంది, కానీ చల్లారిపోయింది అనేసి వెళ్లిపోతాడు. తర్వాత ఒక చోట ఆగిన జగతి-మహేంద్ర రిషి అన్న మాటల గురించి మాట్లాడుకుంటారు. రిషి అన్నదాంట్లో నాకు తప్పేం కనిపించడం లేదు మహేంద్ర అని జగతి అంటుంది.

 ఫిబ్రవరి 21వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 21వ ఎపిసోడ్ లో..

మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఉదయం మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేద్దమాని రిషి అనుకునేలోపు వసుధార పిలుస్తూ ఆ అవకాశం ఇవ్వదు. నేను మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటానికి కాల్ చేయలేదు అని వసుధార అంటుంది. నువ్ ఈ సయమంలో కాల్ చేస్తే అందుకే అనుకున్నా అని రిషి అంటాడు. వసుధార ఏదేదో చెప్పి విసిగిస్తే కాల్ కట్ చేస్తాడు. మళ్లీ వసుధార కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ఛాప్ చేసే అవకాశం కూడా ఇవ్వవా అనుకుంటూ కాల్ లిప్ట్ చేస్తాడు రిషి. ఏంటి చెప్పు అని రిషి అంటే.. ఏంటి సార్ సంగతులు అని వసుధార అంటుంది. మూడు సార్లు కాల్ కట్ చేస్తే ఇప్పుడు ఏంటీ సంగతులు అని అడుగుతున్నావా.. టీవీ చూడూ సంగతులు, విశేషాలు తెలుస్తాయని రిషి అంటాడు. అది కాదు ఎండీ గారు అని వసుధార అంటుంది. ఈ సమయంలో ఎండీ గారు అని అనడం అవసరమా అని విసుక్కుంటూ కాల్ కట్ చేస్తాడు రిషి.

 ఫిబ్రవరి 22వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 22వ ఎపిసోడ్ లో..

పాటలు వింటూ వంట చేసుకుంటుంది వసుధార. రిషి గురించి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. సార్ కి నాపై ఉన్న కోపాన్ని పెద్దగా పట్టించుకోను అనుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో చక్రపాణి బయటకు వెళ్లోస్తానని చెప్పి వెళ్లిపోతాడు. అది వసుధారకు వినిపించదు. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. నేను ఇంత పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చాను. ఇదే మాట వసుధార అడిగితే నా దగ్గర సమాధానం ఏంటీ అనుకుంటూ చేతిలో నుంచి పెండ్రైవ్ తీసుకుని.. సమాధానం ఉందిలే అనుకుంటాడు. తర్వాత నాన్నా.. ఏం చేస్తున్నారు. ఆ టీపాయ్ ఖాళీ చేయండి.. నేను ఉప్మా చేస్తున్నాను అంటుంది వసుధార. అది రిషి క్లీన్ చేస్తాడు. అనంతరం నాన్న ఇక్కడికి రండి అని పిలుస్తుంది వసుధార. వెంటనే రిషి వెళ్లి వెనుకే నిల్చుంటాడు. అప్పుడే వసుధార వెనక్కి తిరిగి రిషిని చూసి అలాగే ఉండిపోతుంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుంది.

ఫిబ్రవరి 23వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 23వ ఎపిసోడ్ లో..

ఈ కోపం ఎన్నాళ్లు సార్.. నా వల్ల పొరపాటు జరిగింది అని అంటుంది. పొరపాటు కాదు వసుధార.. తప్పు జరిగింది. మరోసారి అడుగుతున్నాను నీ మెడలో ఉన్న తాళిని తీసేస్తావా.. తీయలేవు కదా అని రిషి అంటుండగా.. చక్రపాణి కాఫీ తీసుకొస్తాడు. రిషి సార్ ఉప్మా తింటారు అని వసు అంటే.. చక్రపాణి కాఫీ తాగుతారు అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. దీంతో నేను సెలవు తీసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు జగతి-మహేంద్ర కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు. రిషి-వసుధార సమస్య ఒక కొలిక్కి వచ్చింది కదా.. పెళ్లి చేద్దామం అని ఉంది.. కానీ రిషి ఒప్పుకోడేమో అని మహేంద్ర అంటాడు. రిషి మాటను గౌరవిద్దాం. నువ్వు తొందరపడకు అంటుంది జగతి. సమయం సందర్భం చూసి పెళ్లి గురించి మాట్లాడతానేమో అని అంటుంది. మరోవైపు కాలేజీలో స్టూడెంట్స్ తో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ గురించి వసుధార స్పీచ్ ఇస్తుంది

 ఫిబ్రవరి 24వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 24వ ఎపిసోడ్ లో..

రిషి గది నుంచి జగతి మహేంద్ర వెళ్తుండగా.. అక్కడ దేవయానిని చూసి షాక్ అవుతారు. అక్కయ్య ఎక్కువసేపు అలానే నిల్చుని ఉంటే కాళ్లు నొప్పి పుడతాయి పదండి అని జగతి అంటుంది. వదిన గారు మాట్లాడింది అంతా విన్నారు కదా.. రిషిలో కొత్త మార్పు వచ్చింది కనిపెట్టారా అని మహేంద్ర అంటే.. నేనేం వినలేదు.. ఇప్పుడే వచ్చాను అని దేవయాని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత వసుధార-రిషి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. మా జెంటిల్మెన్ ఏం చేస్తున్నారు అని వసుధార అంటే.. ఈ పొగరు ఏం చేస్తుందో అని మెసేజ్ చేయానా అని అనుకుని ఎందుకులే కదపడం అని ఊరుకుంటాడు. అంతలోనే వసుధార నుంచి మెసేజ్ వస్తుంది. ఇలా అనుకున్నానో లేదో అప్పుడే మెసేజ్ వచ్చింది అని రిషి అనుకుంటాడు. ఇద్దరు కాసేపు తలనొప్పి, సంగతులు అంటూ సెటైరికల్ గా మాట్లాడుకుంటారు.

 ఫిబ్రవరి 25వ ఎపిసోడ్ లో..

ఫిబ్రవరి 25వ ఎపిసోడ్ లో..

వసుధార పాలు తీసుకొస్తుండగా.. దేవయానిని చూసి.. ఏంటీ మేడమ్ మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. పడుకునేంత ప్రశాంతత ఇంట్లో ఎక్కడ ఉంది అని దేవయాని అంటే.. అదేంటి మేడమ్ ఇల్లు ప్రశాంతంగానే ఉంది కదా అని వసు అంటుంది. చాలా ఎక్కువ చేస్తున్నావ్.. చాలా ధైర్యం ఎక్కువ మొండి దానివి అని దేవయాని అంటే.. థ్యాంక్స్ మేడమ్ నాకు అవన్నీ ఉన్నాయని గుర్తించినందుకు అని వసు అంటుంది. అవన్నీ పక్కన పెట్టు నీ మెడలో తాళి సంగతి ఏంటీ పెళ్లి జరిగింది అంటున్నావ్.. ఆ తాళి ఎవరు కట్టారు. ఏది మాట్లాడిన ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంటున్నావ్ అని దేవయాని అంటుంది. ఈ తాళికి ఎవరైతే కారణమో వాళ్లే చెబుతారు. అప్పటివరకు ఒపిక పట్టండి అని వసుధార వెళ్లిపోతుంది. ఉదయం రిషి జ్వరం గురించి అడిగితే తగ్గిపోయింది సార్ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అని వసుధార అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X