Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Guppedantha Manasu Weekly Roundup: ఈ వారం ఎన్నో ట్విస్టులతో సీరియల్.. వసుధార తల్లి బతుకుతుందా?
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే జనవరి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..
జనవరి 2వ ఎపిసోడ్ లో..
గదిలో వసుధార, రిషి ఇద్దరు ఉంటారు. వసుధార పెళ్లికూతురు దుస్తుల్లో ఉంటుంది. జగతి మేడమ్ ఇచ్చిన తాళిబొట్టును బాక్స్ లో నుంచి తీసి రిషికి ఇస్తుంది. కన్నీళ్లతో చాలా ఎమోషనల్ గా ఆ తాళి బొట్టును ఇస్తుంది వసుధార. తర్వాత వసుధార మెడలో ఆ తాళి బొట్టును రిషి వేస్తాడు. బ్యాక్ గ్రౌండ్ లో మంగళవాయిద్యాలు వినిపిస్తుంటాయి. అప్పుడు వసుధార సంతోషంతో కనిపించినా సన్నివేశం మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ వసుధార మీది సార్ అని వసుధార అంటే.. మనసుకు హత్తుకుంటాడు రిషి. తర్వాత ఇద్దరూ మురిసిపోతుంటారు. కానీ తర్వాతే అర్థం అవుతుంది వసుధార అలా రిషి వచ్చి మెడలో తాళి వేయడాన్ని ఊహించుకుందని.
జనవరి 3వ ఎపిసోడ్ లో..
రిషి ముహుర్తం టైమ్ కన్నా ముందే వచ్చేస్తాడేమో అని రాజీవ్ కు కంగారుగా చెబుతుంటాడు చక్రపాణి. నేను వసుతో మాట్లాడి వస్తానంటాడు రాజీవ్. రాజీవ్ రావడంతో వసుధార విసుక్కుంటుంది. కాసేపట్లో మనిద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం. ఇంకా బావా ఏంటీ.. ప్రేమగా ఏవండి అని పిలువు అంటాడు. మర్యాదగా బయటకు వెళ్లు బావా అని వసుధార అంటుంది. దీంతో నువ్ రిషి సార్ చట్టాపట్టాలు వేసుకుని తిరిగినవీ, నాకు దొరికినవి రికార్డ్ చేసి పెట్టాను. అంతేకాకుండా ప్రెస్ వాళ్లకు మీడియా వాళ్లకు కొన్ని కాపీలు కూడా పంపించాను. నన్ను పెళ్లి చేసుకోను అంటే మీడియా వాళ్లు ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్లు వస్తే మీ నాన్న పరువు పోతుంది. అప్పుడు మీ నాన్న ఉరి వేసుకుని చస్తాడు. మీ నాన్న పోతే మీ అమ్మ ఏం చేస్తుంది. ఆమె కూడా చనిపోతుంది అని రాజీవ్ బెదిరిస్తాడు.
జనవరి 4వ ఎపిసోడ్ లో..
వసుధార ఇంటికి వచ్చిన రిషి పెళ్లి బట్టల్లో ఉన్న వసుధారను చూసి కంగారుపడతాడు. ఏం జరుగుతోంది వసుధార.. మనం వెళ్లిపోదాం అని అడుగుతాడు. తర్వాత జగతి, మహేంద్ర వస్తారు. వాళ్లు వచ్చనట్లుగా రాజీవ్ మాట్లాడుతూ చేతితో గన్ చూపిస్తూ వసుధారను భయపెడతాడు. చేతిసైగలతో గన్ లా చూపిస్తూ మాట్లాడు వసుధార అంటాడు. మళ్లీ రా వెళదాం వసుధార అంటూ చేయి పట్టుకుంటాడు రిషి. రిషి చేయిని విసిరికొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరుస్తుంది. నన్ను వెళ్లిపోమ్మంటావా.. మనిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం కదా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కదా నిన్ను ఎవరైనా బెదిరించారా అని అడుగుతాడు రిషి. అయినా వసుధార ఏం మాట్లాడకుండా రిషి చేయిని దూరంగా నెట్టేస్తుంది. మహేంద్ర కూడా.. ఏంటమ్మా ఇది అని అడిగితే.. ఇది మా ఇంటి సమస్య మీరు వెళ్లిపోండని అంటుంది వసుధార. దీంతో వెళ్దాం పద జగతి.. లేకపోతే మేడం మెడపట్టి గెంటించేలా ఉంది అని వెళ్లిపోతారు.
జనవరి 5వ ఎపిసోడ్ లో..
వసుధార మాటలు తలుచుకుంటూ బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. తర్వాత వసుధార వసుధారను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు బావ రాజీవ్. వసుధార మెడలో తాళి కట్టేందుకు వెళతాడు రాజీవ్. ఇంతలో వసుధార మెడలో నల్లపూసలు చూసి షాక్ అవుతాడు రాజీవ్. వాటిని తెంపి అయినా తాళి కడతానంటాడు. నాకు పెళ్లయిందని చెప్పిన వినవేంటి అని వసుధార అంటే.. నాకు ఒకసారి పెళ్లయింది.. నీకు ఒకసారి అయింది.. లెక్క సరిపోయింది కదా అని అంటాడు రాజీవ్. నాన్న బావ ఒక దుర్మార్గుడు అని వసుధార తండ్రి చక్రపాణికి చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. సుమిత్ర కూడా అవునండీ అంటే.. నువ్ నోరు మూయు అని సుమిత్రను బెదిరిస్తాడు చక్రపాణి. రిషి సార్, నా తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యం నాకు.. నా ప్రాణాలు కాదు అని రాజీవ్ నిజస్వరూపం బయట పెడతానంటుంది వసుధార.
జనవరి 6వ ఎపిసోడ్ లో..
వసుధార ఏమైంది అని ఎంత అడిగినా వసుధార చెప్పదు. తర్వాత వెళ్లిపోండి రిషి సార్ అని అంటుంది వసుధార. దీంతో విసిగిపోయిన రిషి ఏంటి.. వెళ్లిపోయేది.. ఎక్కడికి వెళ్లను.. వచ్చింది వెళ్లిపోవడానికా అని అరుస్తాడు రిషి. ఇంతలో రాజీవ్ కలగజేసుకునే సరికి కోపంతో రాజీవ్ పైకి వెళ్తాడు రిషి. ఇద్దరు కొద్దిసేపు నెట్టుకుంటారు. అది చూసి వెళ్లిపోమ్మని చెప్పాను కదా అని గట్టిగా అరుస్తూ రిషి వైపుగా తిరుగుతుంది వసుధార. అప్పుడు వసుధార మెడలో తాళి కనపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి. మెల్లిగా వసుధారవైపుకు వెళ్లి తాళిని చూస్తాడు. ఇంతలో జగతి ఈ తాళి అని అడిగితే.. నేను కట్టలేదు ఆ తాళి అని కోపంగా అరుస్తాడు రిషి. ఆ తాళికి నాకు ఎలాంటి సంబందం లేదు అని బాధతో అంటాడు రిషి. మరోవైపు వసుధారకు తాళి రిషి కట్టకుంటే ఇంకెవరు కట్టారు.. కనిపెడితే.. అవకాశాలు నాకు చాలా ఉన్నాయి అని అనుకుంటాడు రాజీవ్.
జనవరి 7వ ఎపిసోడ్ లో..
సుమిత్ర కాళ్లు చేతులు కొట్టుకోవడం చూసిన రిషి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెడతాడు. డాక్టర్స్ ని పిలిచి ఆక్సిజన్ మాస్క్ ఎందుకు పెట్టలేదు. పేషెంట్ ను సరిగా చూసుకోరా అని అడుగుతాడు రిషి. ఎంత ఖర్చు అయిన సరే ట్రీట్మెంట్ ఇవ్వండి. వీళ్లకు ఎవ్వరు లేరనుకోకండి. నేనున్నాను అని రిషి అంటాడు. ఇదంతా చక్రపాణి వింటాడు. రిషి సార్ వజ్రం.. మంచి మనసున్న మనిషి అని వసుధార చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు తండ్రి చక్రపాణి. అప్పుడు చక్రపాణి కళ్లు కొద్దిగా కన్నీటితో కనిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే రిషి మంచితనం, రాజీవ్ నిజ స్వరూపం చక్రపాణికి తెలిసినట్లే అనిపిస్తుంది. డాక్టర్స్ తో రిషి మాట్లాడుతుండగా.. రాజీవ్ వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని రిషిని రాజీవ్ అడిగితే.. వీళ్లను చూసుకునే బాధ్యత నాకు ఉందని రిషి అంటాడు.