Guppedantha Manasu Weekly Roundup: ఎమోషనల్ గా ఎపిసోడ్స్, ఇక కలవని రిషిధార.. అవమానించిన జగతి-మహేంద్ర!

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జనవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

 జనవరి 23వ ఎపిసోడ్ లో..

జనవరి 23వ ఎపిసోడ్ లో..

సోఫా పై రిషి కూర్చుని ఉంటాడు. వసుధార రావడంతో లేచి నిల్చుంటాడు. మీకు థ్యాంక్స్ చెప్పి వెళదామని వచ్చాను సార్ అని అంటుంది వసుధార. అప్పుడు జగతికి ఇచ్చి కీ ఇవ్వమన్నది గుర్తు చేసుకుంటాడు రిషి. తర్వాత సార్ మనం మాట్లాడుకోవాలి అని వసుధార అంటుంది. మనం మాట్లాడుకోవాలి అని వసుధార అనడంతో.. ఒక్కసారిగా కోపం తెచ్చుకుని ఆపు అన్నట్లుగా చేయి చూపుతాడు రిషి. మనం అనే పదం వాడకు.. వినలేకపోతున్నాను అని బాధగా అంటాడు రిషి. తర్వాత మనం అనుకోవడం కరెక్ట్ కాదేమో ఇప్పుడు అని రిషి అంటాడు. దీంతో బాధగా వసుధార వెళ్లిపోతుండగా వెనుక నుంచి రాజీవ్ చేయి పట్టుకుంటాడు. వసు మనం బంధం అప్పుడే తెగిపోలేదు. ఒకసారి నీకు పెళ్లయిందని రిషి సార్ తో అన్నావ్ కదా అని రాజీవ్ అంటాడు. అప్పుడు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి నాకు జరిగిందన్న తన మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార. పెళ్లయిందని అన్నావ్ కదా ఇంకేముందు అని వసుధారతో రాజీవ్ అంటాడు. దీంతో షటప్.. రిషి సార్ ని నా నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదు అని వసుధార స్ట్రాంగ్ గా అంటుంది. దీంతో అలా చూస్తుండిపోతాడు రాజీవ్.

 జనవరి 24వ ఎపిసోడ్ లో..

జనవరి 24వ ఎపిసోడ్ లో..

తలనొప్పితో సోఫాపై వాలి కళ్లు మూసుకుని కూర్చుని ఉంటాడు రిషి. అది చూసిన వసుధార వచ్చి సైలెంట్ గా రిషి తలపై చేతులతో బామ్ రాస్తుంటుంది. అది ఎవరా అని ఆ చేతుల స్పర్శకు ఉలిక్కి పడి లేచిన రిషి.. వసుధారను చూసి షాక్ అవుతాడు. అసలు నేను ఇక్కడ ఉన్నాని నీకు ఎలా తెలిసింది అని రిషి అంటే.. మనసుకు ఎవరు చెప్పాలి సార్ అని వసుధార అంటుంది. మనసు గురించి నువ్ మాట్లాడకపోతేనే బాగుంటుందేమో. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా వెళ్లిపో వసుధార అని రిషి అంటాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. మీరే నన్ను ప్రాజెక్ట్ హెడ్ గా అంగీకరించారు. మీరే నన్ను ప్రాజెక్ట్ హెడ్ పదవి నుంచి దించేయండి అని వసుధార అంటుంది. అప్పుడు వసుధార ఈ సీట్ కు మేడమ్ తర్వాత నువ్వే కరెక్ట్ అని రిషి చెప్పింది గుర్తు చేసుకుంటాడు.

జనవరి 25వ ఎపిసోడ్ లో..

జనవరి 25వ ఎపిసోడ్ లో..

ఏం జరగనట్టు ఎప్పటిలా ఎలా మాట్లాడుతున్నావ్.. నీకెలా సాధ్యమవుతుందో అనుకుంటాడు రిషి. నాకోసం రెండు నిమిషాలు కేటాయించండి అని వసుధార అంటే.. ఈ టైమ్ లో మాట్లాడటం కరెక్ట్ కాదు.. వెళ్లు అని రిషి అంటాడు. గౌతమ్ సార్ ఫ్లాట్ వైపు మీరెందుకు వచ్చారని అడుగుతుంది వసుధార.. దీంతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. తర్వాత ఇంటికెళ్లిన వసుధార ఫోన్ పట్టుకుని రిషి అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతుంది. వసుధార కన్నీళ్లు చూసి తండ్రి చక్రపాణి ఓదార్చుతాడు. రిషి సార్ కోపంలో ఓ మాట అన్నా ఓర్చుకో అని చెబుతాడు. అపార్థాలను నిర్లక్ష్యం చేయవద్దు. అవి తొలగించుకోకుంటే జీవిత ప్రయాణం ప్రమాదం తల్లీ.. ఆలస్యం చేయకు. జరిగినదంతా చెప్పు అంటాడు తండ్రి చక్రపాణి. నీవల్ల కాకపోతే నేను వెళ్లి వాళ్ల కాళ్ల పట్టుకుంటాను అని చెప్పి వసుధారకు ధైర్యం చెబుతాడు చక్రపాణి. నాకు అసలు చెప్పే అవకాశమే ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. తర్వాత ఉదయం కాలేజీలో రిషి గురించి మాట్లాడుకుంటారు జగతి-మహేంద్ర. అనుకున్న దానికంటే రిషి తొందరగానే గాయం నుంచి బయటకొచ్చాడు అంటాడు మహేంద్ర.

 జనవరి 26వ ఎపిసోడ్ లో..

జనవరి 26వ ఎపిసోడ్ లో..

మినిస్టర్ దగ్గరకు రిషి, వసుధార కారులో వెళుతుండగా అటు వైపు నుంచి రాజీవ్ తన కారుతో వచ్చి అడ్డంగా ఆపుతాడు. రాజీవ్ ను రిషికి ఏం చేయాలో తెలియక కారు ఆపుతాడు. అప్పుడు కారు ఆపొద్దు సార్.. పోనివ్వండి అని కంగారుగా అంటుంది వసుధార. తను వస్తున్నాడు కదా.. అలా ఎలా వెళ్లిపోతాం వసుధార అని కాస్త అసహనంగా అంటాడు రిషి. నాకు మీరు ఇంపార్టెంట్ సార్ అని వసుధార అంటుంది. దీంతో షాక్ అవుతాడు రిషి. తర్వాత ఇద్దరు కారు దిగి రాజీవ్ దగ్గరికి వెళతారు. రిషి సార్.. నా భార్యని నాతో పంపిస్తారా అని రాజీవ్ అంటే.. నేను రాను.. రిషి సార్ తోనే వెళతాను.. అని వసుధార అంటుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రిషి సైలెంట్ గా ఉండిపోతాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో మీకు తెలియాలి సార్.. చెబుతాను వినండి అని వసుధార అంటుంది.

జనవరి 27వ ఎపిసోడ్ లో..

జనవరి 27వ ఎపిసోడ్ లో..

మరుసటి రోజు ఉదయం రిషి క్యాబిన్ కు వెళుతుంది వసుధార. ఎప్పటిలానే జరిగింది చెప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది వసుధార. కానీ రిషి అదేం పట్టించుకోడు. అస్సలు వినిపించుకోకుండా ఫైర్ అవుతాడు. వసుధార ఏదో చెప్పబోతుంటే.. షటప్ వసుధార.. అంటూ కుర్చీలో నుంచి లేచి నిలుచుని కోప్పడతాడు రిషి. ఎవరితోనో తాళి కట్టించుకుని.. ఆ ముచ్చట్లన్నీ సరదాగా నాకు చెబుతానంటే.. నేను వినను గాక వినను. అయినా చెప్పడానికి, నిజానికి నీకు చెప్పడానికి అర్హత కూడా లేదు అని రిషి అంటాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. ఇకమీదట మీకు ఇంకేం చెప్పను అని వసుధార అంటుంది. దానికి సంతోషం.. చాలా సంతోషం. ఇక నువ్వు వెళ్లొచ్చు.. అని రిషి అంటే బాధగా బయలుదేరుతుంది వసుధార. నా తల్లి చేసిన గాయం కన్నా వేయ్యి రెట్టు ఎక్కువ గాయం చేశావ్ వసుధార అని రిషి అంటే మరింతగా బాధపడిపోతుంది వసుధార. దీంతో గాయం నా మనసుకి కూడా అయింది సార్.. థ్యాంక్స్ అని వసుధార అంటుంది.

జనవరి 28వ ఎపిసోడ్ లో..

జనవరి 28వ ఎపిసోడ్ లో..

రిషి ఇంటి గేటు నుంచి లోపలికి వెళుతుంటాడు చక్రపాణి. నేను కూడా నా కూతురికి ఇలాంటి సంబంధం తీసుకురాలేను అని సంతోషపడతాడు. ఇంతలో ఇంట్లో నుంచి వచ్చిన జగతి-మహేంద్ర చక్రపాణిని చూసి షాక్ అవుతారు. ఎందుకొచ్చారు.. వెళ్లిపోండి అని సీరియస్ అవుతాడు మహేంద్ర. చక్రపాణి ఏదో చెప్పేందుకు ప్రయత్నించిననా జగతి వినిపించుకోదు. కాదమ్మా, అప్పుడు నా కళ్లు నెత్తిమీదకెక్కి.. పరువు కోసం పాకులాడాను. నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నా కూతురు గొప్పగా ఉందంటే అందుకు కారణం మీరేనమ్మా. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను అని చక్రపాణి అంటాడు. మీ కూతురు, మీ ఫ్యామిలీ మాకు ఇచ్చిన బహుమతికి మేమే జీవితాంత కృతజ్ఞతతో ఉంటాం. ఇంట్లో నుంచి వెళ్లి పోమ్మన్నారు అదెలా మర్చిపోతాం అని జగతి అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X