Guppedantha Manasu: పిన్ని, బాబాయ్‌ని చంపేందుకు శైలేంద్ర స్కెచ్.. కొడుకు దగ్గరికి జగతి-మహేంద్ర

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూలై 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

జూలై 3వ ఎపిసోడ్ లో..: వసు గదిలోకి రిషి వెళ్లి ట్యాబ్లెట్ ఇస్తాడు. నీళ్లు తాగుతుంటే వసుధారకు పొలమారుతుంది. వెంటనే రిషి తల నిమురుతాడు. కాసేపు కంపెనీ ఇవ్వొచ్చు కదా అని వసు అంటే.. కంపెనీలు, కాఫీలు ఇచ్చేందుకు నేను ఇదివరకు.. అని రిషి ఆగిపోతాడు. ఎందుకు సార్ అలాంటి మాటలతో గుండెను కొట్టినట్లు చేస్తారు అని వసుధార అంటే.. నా గుండెను కోసేసారు కదా అని రిషి అంటాడు. మరి మీ చేతికి ఉన్న ఆ బ్రేస్ లెట్ గతాన్ని గుర్తి చేయడం లేదా అని వసు అడుగుతుంది. ఇది ఉంటేనే కదా నాకు జరిగిన మోసం అన్నీ గుర్తుకు వచ్చేది. అయినా నేను మాట ఇస్తే తప్పను. కొంతమందిలాగా మోసం, ద్రోహం చేసే అలవాటు లేదు. అయినా ఇది పెట్టుకుని సంతకాలు పెట్టమని చెప్పారు. నేను జ్ఞాపకాలు వదులుకోలేను. ఎందుకంటే నీకు తెలిసో లేదో.. నేను జెంటిల్ మెన్ అనేసి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు శైలేంద్ర, దేవయానికి తెలియకుండా రిషిని ఎలాగైనా మళ్లీ కాలేజీలోకి తీసుకురావాలని డిసైడ్ అవుతారు మహేంద్ర, జగతి.

Guppedantha Manasu

జూలై 4వ ఎపిసోడ్ లో..: ఫణీంద్ర ఇంటికి రాకపోవడంపై దేవయాని, శైలేంద్ర ఆలోచిస్తుంటారు. నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంటికి తీసుకు రా. ఇప్పుడు మన ఆయుధం మీ నాన్న. నువ్వు దూకుడుగా ఉంటే ప్రయోజనం లేదు. నువ్వు చెప్పే ప్రతి మాటకు మీ నాన్న కరిగిపోవాలి. లేదంటే అక్కడే ఉంటారు. మీ నాన్న మాటను మహేంద్ర కాదనలేడు. మహేంద్ర చెబితే జగతి వింటుంది. మీ నాన్నకి మనపై అనుమానం వచ్చింది. ఎప్పుడు కోప్పడని మా నాన్న నిన్న ఎలా ఊగిపోయారో చూశావ్ కదా. కొంచెం తడబడినా పసిగట్టేస్తారు. అందుకే పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ముగ్గుర్ని ఇంటికి తీసుకు రా అని దేవయాని చెబుతుంది. దీంతో శైలేంద్ర బయలుదేరతాడు. మరోవైపు పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని వచ్చి కాలేజీ, అటు నుంచే మా ఇంటికి వెళ్తాను, ఇప్పుడు బాగానే ఉన్నా కదా అని ఏంజెల్ కు చెబుతుంది వసుధార. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా అని ఏంజెల్ అంటుంది.

Guppedantha Manasu

జూలై 5వ ఎపిసోడ్ లో..: ఏంజెల్ తో మీ ఫ్రెండ్ ట్యాబ్లెట్స్ వేసుకుందా లేదా అని అడుగుతాడు రిషి. ఇదేదో తననే అడిగితే సరిపోతుంది కదా అని ఏంజెల్ అంటుంది. సార్ చెప్పరు. మనసులో నాపై ప్రేమ ఉంది. కానీ చెప్పరు అని వసుధార అనుకుంటుంది. మీరు వచ్చి ఇన్నాళ్లైంది. ఇద్దరూ మాట్లాడుకోవడం చూడలేదు. మీ ఇద్దరికి ఏదైనా ప్లాబ్లమ్ ఉందా. కొంపతీసి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా. గతంలో కూడా ఓసారి అడిగాను. మళ్లీ అడుగుతున్నాను. మీ తీరు చూస్తుంటే ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తోంది అని ఏంజెల్ అంటుంది. దీంతో వసు, రిషి షాక్ అయి చూస్తారు. రిషి ఏం మాట్లాడడు కానీ, నువ్వైనా చెప్పు వసు. రిషి నీ సీనియర్ లెక్చరర్ అని రిజర్వ్ డ్ గా ఉంటున్నావా అని ఏంజెల్ అంటుంది. దీంతో బిత్తర చూపులు చూస్తుంది వసు. మేడమ్ కి నాకు మధ్య ప్లాబ్లమ్ ఉండేంత పరిచయం లేదు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఏముంటుంది అని రిషి అంటాడు.

Guppedantha Manasu

జూలై 6వ ఎపిసోడ్ లో..: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మహేంద్రతో ఫణీంద్ర చర్చిస్తుంటాడు. అనుకున్న ఐడియాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఫణీంద్ర అంటాడు. ఇంతలో కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకుని జగతి వస్తుంది. దానిపై ఫణీంద్ర సంతకం చేస్తుంటాడు. అప్పుడే మెట్లపై నుంచి దిగుతున్న దేవయాని, శైలేంద్ర అనుమానంగా చూస్తారు. డాడ్ ఏవో డాక్యుమెంట్స్ పై సంతకం చేస్తున్నారేంటి అని మనసులో అనుకుని వాళ్ల దగ్గరికి వెళ్తారు. ఏంటండి ఇవి అని దేవయాని అడుగుతుంది. మీరు కూడా కాలేజీ బోర్డ్ మెంబర్స్ కదా. మిషన్ ఎడ్యుకెషన్ బాధ్యతలన్నీ జగతికిఅప్పగిస్తున్నట్లు డాక్యుమెంట్స్. అందుకే సైన్ చేయండి అని ఫణీంద్ర చెబుతాడు.

Guppedantha Manasu

జూలై 7వ ఎపిసోడ్ లో..: మరోవైపు విష్ కాలేజీలో ఫవర్ ఆఫ్ స్టడీస్ సెమినార్ గురించి రిషితో లెక్చరర్స్ మాట్లాడతారు. క్లాసులన్నీ అయిపోయాక గంట కూర్చుని డిస్కస్ చేద్దాం. వసుధార మేడమ్ కూడా వస్తున్నారు అని లేడీ లెక్చరర్ అంటుంది. ఏంటీ.. వసుధార మేడమ్ వస్తున్నారు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా. అలా ఎలా వస్తుంది. హెల్త్ ఇంపార్టెంట్ కదా అని వాళ్లపై కాస్తా గట్టిగా అరుస్తాడు రిషి. తర్వాత సముదాయించుకుని వసుధార మేడమ్ తో నేను డిస్కస్ చేస్తాను. తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని రిషి అంటాడు. రిషి సార్ అలా అరిచాడేండీ. షార్ట్ టెంపర్ ఉందా ఏంటీ అని మరో లెక్చరర్ అనుకుంటాడు. ఇక ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. ఒక రెండ్రోజులు దూరంగా వెళ్లి వస్తామని జగతి చెబుతుంది. ఇంతకీ ఎక్కడికీ వెళ్తున్నారని దేవయాని అడిగితే.. ఔటాఫ్ స్టేషన్ వదినా. చాలా ముఖ్యమైన పనిపై వెళ్తున్నాం అని మహేంద్ర అంటాడు.

జూలై 8వ ఎపిసోడ్ లో: శైలేంద్ర నుంచి కాల్ రాలేదని ఆలోచిస్తుంటుంది. ఇంతలో ధరణి వచ్చి భోజనానికి అని పిలిచి మళ్లీ సెటైర్లు వేస్తుంది. ఇంతలో శైలేంద్ర కాల్ చేసి నేను వాళ్లను ఫాలో అవుతున్నాను. హోటల్లో ఉన్నారని చెబుతాడు. అక్కడ మనకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే.. వాళ్లను ఆపు అని దేవయాని అంటే.. అదే జరిగితే వాళ్లని రిషిని పంపించినట్లే చంపేస్తానని శైలేంద్ర అంటాడు. ఇలా అనాలోచితంగా చేయకు అని ఫైర్ అవుతుంది దేవయాని. వాళ్లు ఎందుకు వెళ్లారో తెలుసుకో. అప్పుడు ఏం చేయాలో చెబుతాను అని దేవయాని అంటే.. అసలు ఈ తంటాలన్నీ అవసరమా. నా వల్ల కావట్లేదు. ఆ రిషి గాడు లేడు. వీళ్లను మట్టిలో కలిపేస్తే నాకు అడ్డెవరూ ఉండరు అని ఊగిపోతాడు శైలేంద్ర. మహేంద్రకు ఏ హాని తలపెట్టొద్దని దేవయాని చెబుతుంది. శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X