Guppedantha Manasu: ఊహించని ట్విస్టులు.. రిషి ఇంట్లో జగతి-మహేంద్ర.. ఏంజెల్‌కు డౌట్
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..
జూలై 10వ ఎపిసోడ్ లో..:జగతికి శైలేంద్ర కాల్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఒకవేళ ఏదైనా హోటల్ లో స్టే చేస్తే జాగ్రత్తగా ఉండండి. బాబాయ్ కు కూడా జాగ్రత్తలు చెప్పండి. అసలే కారు స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు కదా. డ్రైవ్ చేసేటప్పుడు వెనుక ముందు చూసుకోమ్మను. రేపు నేను కాలేజీకి వెళ్లాలా అని శైలేంద్ర అంటాడు. ఏం వద్దు బావగారికి అన్ని చెప్పాను. ఆయన చూసుకుంటారు అని చెప్పి కాల్ కట్ చేసి జగతికి శైలేంద్ర మీద అనుమానం వస్తుంది. మేం ఇక్కడ దిగినట్లు మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటుంది జగతి. మరోవైపు రిషి అలసిపోయి ల్యాప్ ట్యాప్ పైన పెట్టుకుని పడుకుంటాడు. వసుధార ఎంత పిలిచినా లేవడు. దీంతో దిండు, దుప్పటి తెచ్చి కప్పి వసు వెళ్లిపోతుంటే.. థ్యాంక్యూ ఏంజెల్ అని రిషి అంటాడు. దీంతో కొద్దిగా అప్సెట్ అయిన వసుధార వెళ్లి తన గదిలో వర్క్ చేసుకుంటూ ఉంటుంది.
జూలై 11వ ఎపిసోడ్ లో..:కారు ఆపి పిన్నీ బాబాయ్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు. బాబాయ్ కి పిన్ని నిజం చెప్పేసిందా. వీళ్లిద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అనుకుంటాడు. ఇంతలో కాల్ వస్తుంది. వాళ్లిద్దరు అదే కాలేజీకి వస్తున్నారని కన్ఫర్మ్ గా చెబుతాడు. దీంతో మాస్క్ పెట్టుకుని కాలేజీలోకి వెళ్తాడు. ఆడిటోరియంలో వసుధారను చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. అంటే బాబాయ్ పిన్నీ తనను కలిసేందుకు వస్తున్నారా. వసుధారను కలుస్తున్నారంటే ముగ్గురు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో. వాళ్లు వచ్చేవరకు వెయిట్ చేసి వీళ్ల ప్లానేంటో తెలుసుకోవాలి అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు కారులో కాలేజీకి వస్తుంటారు జగతి, మహేంద్ర. రిషి ఎలా రియాక్ట్ అవుతాడో అని జగతి టెన్షన్ పడుతుంటే.. మనం రిషి కోసం వచ్చినట్లు తెలియకూడదు. ఏదో క్యాజువల్ గా కలిసినట్లు ఉండాలి అని మహేంద్ర అంటాడు.

జూలై 12వ ఎపిసోడ్ లో..:కాలేజీలో పవర్ ఆఫ్ స్టడీస్ ఏర్పాట్లు జరుగుతుంటాయి. గెస్టులు వస్తున్నారు అని రిషికి ప్రిన్సిపాల్ చెబుతాడు. అలాగే విశ్వనాథంకు చెబుతాడు. అది విని వసుధార లేస్తుంటే.. మేడమ్ మీరెక్కడికి.. గెస్టుల దగ్గరికి వచ్చి.. మళ్లి ఇక్కడికి రావాలి. అంత అవసరం లేదు. వెల్ కమ్ చెప్పడమే కదా. మేము చెబుతాం మీరు ఇక్కడే ఉండండి అని రిషి అంటాడు. మళ్లీ వసుధార నడిస్తే ఎక్కడా కాలికి పెయిన్ వస్తుందో అని బాస్ చెబుతున్నారు అని ఏంజెల్ అంటుంది. వసుధార మేడమ్ మీరు ఇక్కడే ఉండండి.. ఏంజెల్ మేడమ్ మీరు రండి అని ప్రిన్సిపాల్ అంటాడు.
జూలై 13వ ఎపిసోడ్ లో..:శైలేంద్రకు కాల్ చేసిన రౌడీ అవును సార్ వాడు బతికే ఉన్నాడట అని చెప్పగానే శైలేంద్ర ఇంకా ఫైర్ అవుతాడు. వాడు ఎలా బతికి ఉన్నాడో అర్థం కావట్లేదు అని రౌడీ అంటే.. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నేను వేరే వాళ్లతో పక్కాగా ప్లాన్ చేసుకుంటా అని శైలేంద్ర అంటాడు. వేరేవాళ్లు ఎందుకు సార్. మేమే వాడిని ఫినిష్ చేస్తాం అని రౌడీ కాల్ కట్ చేస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడే వాన్ని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వాడి వాళ్లంతా వాడి చుట్టూ చేరి రక్షణ కవచంలా ఉన్నారు. ఇప్పుడు వాన్ని మీరేం చంపగలరు. ఇప్పుడు వాన్ని ఏం చేయలేరు అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు.

జూలై 14వ ఎపిసోడ్ లో..:రిషి నేను తండ్రిని అని మహేంద్ర అంటాడు. ఇక్కడ మనం తండ్రీకొడుకులం కాదు. కేవలం పరిచయస్తులం మాత్రమే. సెమినార్ కు వచ్చిన ఇద్దరి మధ్య ముఖ పరిచయం మాత్రమే ఉందని రిషి అంటే మహేంద్ర బాధపడతాడు. అదే మాట నా కళ్లలోకి సూటిగా చూసి చెప్పు అని మహేంద్ర అంటాడు. అది పట్టించుకోకుండా రిషి వెళ్లిపోతుంటే.. నువ్ అలా వెళ్లిపోతుంటే నా ప్రాణాలు పోతున్నాట్టున్నాయని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఆగిన రిషిని వచ్చి వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. ఇన్నేళ్లు నీకోసం ఎంతో వెతికాను. ఎంతో తపించాను. కన్నీళ్లతో సావాసం చేశాను. నేను ఏ తప్పు చేశాను. నేను చేయని తప్పుకు నాకేందుకు గుండెకోత. ఇంకా నా మీద జాలి కలగడం లేదా అని చేతులెత్తి రిషిని ప్రాధేయపడతాడు మహేంద్ర.

జూలై 15వ ఎపిసోడ్ లో:కారులో నుంచి మహేంద్ర, జగతి దిగుతారు. వారిని చూసి రిషి షాక్ అవుతాడు. రిషి ఏమైనా అనుకుంటాడని మనసులో బాధపడకు, కంగారు పడకు అని జగతికి ధైర్యం చెబుతాడు మహేంద్ర. వీళ్లు రెండు మూడు రోజులు సిటీలో ఉంటామన్నారు. వీళ్లు నీకు గురువులతో సమానం అని చెప్పావ్ కదా. అందుకే ఎక్కడో ఎందుకు మన ఇంట్లోనే ఉండమని చెప్పి రమ్మన్నాను అని విశ్వనాథం అంటాడు. మీ ఇష్టం సార్ అని రిషి అంటే.. అంతా లోపలకు వెళ్తారు. గెస్టులు వచ్చారు అని ఏంజెల్ ను పిలిస్తే.. తనతోపాటు వసు వస్తుంది. వసుధారను చూసి జగతి, మహేంద్ర షాక్ అవుతారు. వసు ఇక్కడ ఉందేంటి అని మహేంద్రతో అంటుంది జగతి. నీ ఆత్మీయులను చాలా రోజుల తర్వాత కలిశావ్ కదా. ఎలా ఉంది. నీ ఆత్మీయులతో కూడా కలుపుగోలుగా ఉండవా. లేదా ఏదానా దాస్తున్నావా అని ఏంజెల్ అడుగుతుంది.


Click it and Unblock the Notifications











