Guppedantha Manasu: అన్నదమ్ముల ఉగ్రరూపం.. వణికిపోయిన శైలేంద్ర.. రిషి ఏమో అలా!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూలై 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..
జూలై 17వ ఎపిసోడ్ లో..:కొన ఊపిరితో ఉన్న రిషికి ట్రీట్ మెంట్ చేయించింది నేనే కదా అని ఏంజెల్ చెప్పడంతో.. జగతి, వసు ఇద్దరూ షాక్ అవుతారు. షాక్ అయి సోఫాలో నుంచి లేచి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంజెల్ దగ్గరికి వెళ్లి ఏంటీ నువ్వు అనేది. అసలు ఏమైంది అని జగతి అడుగతుంది. వసు, జగతి ఇద్దరి లేవడం చూసి షాక్ అయిన ఏంజెల్ కాస్తా కంగారుగా చూస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం రిషిని ఎవరో కత్తితో పొడిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిషిని నేను, విశ్వం వెళ్లి కాపాడుకున్నాం అని ఏంజెల్ చెబుతుంది. దీంతో జగతి, వసు అలాగే షాక్ లో ఉండిపోతారు. వసుధార గతంలో తాను ఎన్వోసీపై సంతకం పెట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. అప్పుడు బ్రేస్ లెట్ చూసి రిషినే అనుకుంటుంది. అది గుర్తు చేసుకున్న వసుధార వెళ్లి ఎంజెల్ ను కౌగిలించుకుంటుంది.

జూలై 18వ ఎపిసోడ్ లో..:రిషి గురించి గౌతమ్ కి అన్నీ తెలుసు. కానీ, ఇప్పుడు కాంటాక్ట్ లో లేడు. మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్. రిషి గతం గురించి ఏం తెలియదు. ఇప్పుడు మహేంద్ర సార్, జగతి మేడమ్ రిషికి బాగా దగ్గరివాళ్లు కదా. వాళ్లను అడిగితే రిషి గురించి తెలుస్తుంది కదా అని ఏంజెల్ అంటుంది. మహేంద్ర సార్ ఏమైనా పొరపాటు పడితే ఏంజెల్ కనిపెట్టేస్తుందని అనుకున్న వసుధార.. నువ్ అలా ఎంక్వైరీ చేశావని రిషికి తెలిస్తే బాధపడతాడు కదా అని వసు అంటుంది. అవును కదా అని ఏంజెల్ అంటుంది. సరే నీ పాస్ట్, ఫ్యూచర్ గురించి చెప్పమంటే అంతా రిషి సారే అని మనసులో అనుకుని.. ఏదో జీవితం సాగిపోతుంది అని బయటకు చెబుతుంది వసుధార. ఇంతలో రిషి రావడంతో నీకు గౌతమ్ కాంటాక్ట్ లో ఉన్నాడా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. వాడి నెంబర్ ఉంటే ఇస్తావా అని అడుగుతుంది ఏంజెల్.
జూలై 19వ ఎపిసోడ్ లో..:రిషి ఉన్నంతకాలం ఎండీ సీటు దక్కదనే భయం గుండెల్లో ఉంటుంది. ఒక్కసారి శత్రువైతే జీవితాంతం శత్రువే. శత్రుశేషం ఉండకూడదు అంటే రిషిని ఏదో ఒకటి చేయాలి. పిన్ని, బాబాయ్ కూడా కలిసారంటే నిజం తెలిసిపోయినట్లేనా. నిజం తెలిస్తే ఇక యుద్దమే. యుద్ధంలో అడుగు ముందుగా వేసినవాడిదే పైచేయి. కాబట్టి నేనే ఒక అడుగు ముందుకు వేస్తా. రిషి ఊపిరి ఆగిపోతే కానీ, నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేను. వాడి చనిపోయే దాకా అటాక్ లు ఎన్ని సార్లయినా చేస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు రిషిని వదిలిపెట్టి వెళ్లేందుకు జగతి మనసు ఒప్పుకోదు. ఇప్పుడున్న పరిస్థితి చూశావ్ గా.. వెళ్లక తప్పదు అని మహేంద్ర అంటాడు. ఈ పరిస్థితులకు భయపడే కదా రిషిన దూరం చేసుకున్నాను అని జగతి అంటుంది.

జూలై 20వ ఎపిసోడ్ లో..:వీఆర్ లెటర్ రాసి ఉన్న పేపర్ ను రిషి చింపేయబోతుంటే వసుధార ఆపుతుంది. అన్ని చోట్ల అధికారాలు చెల్లవు. మీ అధికారం చూపించి రిజైన్ లెటర్ చించినట్లు దీన్ని ముక్కలు చేయలేరు. అది మంచి కోసం కాబట్టి ఉండేందుకు ఒప్పుకున్నా. కానీ ఇది నా ప్రేమ, నా ప్రాణం. నా మనసుకు గాయం అయితే నేను ఒప్పుకోను సార్ అని వసు అంటుంది. మనసుకి గాయాలు చేసే మీరు మనసుకు గాయం అయితే ఒప్పుకోకపోవడమా ఎంత స్వార్థం అని రిషి అంటాడు. అది స్వార్థం అని మీరునుకుంటున్నారు. ప్రేమ అని నేననుకుంటున్నాను. మీకు కొన్ని విషయాలు అర్థం అయ్యేసరికి ఆలస్యం కావొచ్చు. కానీ నిజం తెలిసిన రోజు మొదట ఈ వసుధార గురించే ఆలోచిస్తారు అని వసు అంటుంది. అంత నమ్మకం ఏంటీ అని రిషి అంటే.. అది కూడా ప్రేమే. మీ మనసుకు ద్వేషం కమ్ముకుంది. కానీ ఆ ద్వేషం ప్రేమగా మారుతుంది. నా వల్ల తప్పు జరిగింది కాబట్టే మౌనంగా ఉన్నాను. ఆ తప్పును అజ్ఞానంతో చేసే మూర్ఖులం కాదు మేము. తప్పనిపరిస్థితుల్లో చేసే తప్పులు కొన్ని ఉంటాయి. అది మీరే తెలుసుకోండి అని వసు వెళ్లిపోతుంది.

జూలై 21వ ఎపిసోడ్ లో..:శైలేంద్రకు ఏమైనా తెలిసిందా అని మహేంద్ర అంటాడు. ఆ మాటలు విన్న శైలేంద్ర బాబాయ్ అని పిలిచి అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఏంటీ బాబాయ్ ఇక్కడ మాట్లాకుంటున్నారు. నాకు తెలికుండా ఏదైనా విషయం దాస్తున్నారా. ఎక్కడికో వెళ్లొచ్చారు. నేను వస్తానంటే వద్దన్నారు. రిషి గురించి ఏమైనా తెలిసిందా. తెలిస్తే నాకు చెప్పండి బాబాయ్. నేను వెళ్లి రిషిని తీసుకొస్తా. ఎందుకు ఇక్కడ ఇంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అని శైలేంద్ర అంటాడు. దానికి కోపంతో శైలేంద్ర.. అని మహేంద్ర అంటే జగతి ఆపుతుంది. హా చెప్పండి బాబాయ్ అని శైలేంద్ర.. అంటే.. మాపై నీకు చాలా అనుమానాలు ఉన్నాయి కదా. అందుకే కదా మమ్మల్ని దొంగచాటుగా వెంబడిస్తున్నావ్. నీ ప్రశ్నలకు అన్నీ సమాధానాలు ఇవాళే దొరుకుతాయి. నాతో రా అని చేయి పట్టుకుని ఈడ్చుకెళ్తాడు మహేంద్ర.

జూలై 22వ ఎపిసోడ్ లో:శైలేంద్రను అదుపులో పెట్టాలంటే ఇదే దారి. అంతా కోల్పోయాం. ఇప్పుడు తొందరపడినా ఏం చేయాలేం. నీకున్న ఓర్పు నాకు లేదు. ముల్లును ముల్లుతోనే తీయాలు కుట్రలు చేసేవాడిని ఇలాగే ఎదుర్కొవాలి అని మహేంద్ర అంటాడు. వాళ్లు అన్నయ్యకు మాత్రమే భయపడి ఉంటారు. వాళ్లను హద్దుల్లో పెడితే కానీ, మనం అనుకున్నది జరగదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్యను బాధపెట్టకుండా నెమ్మదిగా ఈ విషపురుగులా కోరలు తీద్దాం అని మహేంద్ర చిటికెలు వేసుకుంటాడు చెబుతాడు. నేను వీళ్లను చూసుకుంటాను. నువ్వు మన కొడుకుని ఎలా ఇంటికి తీసుకురావాలో ఆలోచించు అని జగతికి చెబుతాడు మహేంద్ర. మరోవైపు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇంతలో ఏంజెల్ వచ్చి భోజనం ఇక్కడికి తీసుకురానా అంటే.. లేదు తానే వస్తానని వసు అంటుంది. సరే రా.. వెళ్లి రిషిని పిలుచుకొద్దాం అని బయలుదేరుతారు.


Click it and Unblock the Notifications











