Guppedantha Manasu: శైలేంద్ర మాస్టర్ స్కెచ్.. కాలేజీ గోడలపై రిషిధార ఫొటోలు.. షాక్‌లో జగతి

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది.

మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూలై 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

Guppedantha Manasu

జూలై 24వ ఎపిసోడ్ లో..: డీబీఎస్టీ కాలేజీ నుంచి ఓ లెక్చరర్ శైలేంద్రకు కాల్ చేసి జగతి మేడమ్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేశారని. లిస్టులో తన పేరు లేదని చెబుతాడు. దీంతో శైలేంద్ర రగిలిపోతాడు. ఇది నీ కాలేజ్ నిన్ను ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. వెళ్లి వాళ్ల ప్లాన్లకు అడ్డుకట్ట వేయమని శైలేంద్రను ఉరిగొలుపుతుంది దేవయాని. మరోవైపు వసు కాలేజీకి వెళ్దామనుకుంటే కారు ఏంజెల్ తీసుకెళ్తుంది.

రిషిని తన కారులో వసుధారను డ్రాప్ చేయమని విశ్వనాథం చెప్పి వెళ్లిపోతాడు. నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. మీ దగ్గర పాఠాలు నేర్చుకున్నాను. నేను పాఠాలు ఎలా చెబుతున్నానో మీరు క్లాసులో స్టూడెంట్ లా వినలాని అడుగుతుంది వసుధార. ముందు అది జరగదన్న రిషి తర్వాత ఒప్పుకుంటాడు. పదే పది నిమిషాలు కూర్చుంటాను అని రిషి అనడంతో.. వసుధార సంతోషిస్తుంది.

Guppedantha Manasu

జూలై 25వ ఎపిసోడ్ లో..: మిషన్ ఎడ్యుకేషన్ పూర్తి అథారిటీ జగతికి అప్పగిస్తున్నట్లు సైన్ చేసింది గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర. ఈ విషయంలో పూర్తి బాధ్యత నాది అన్న విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఏం జరిగినా నన్ను అడుగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నాఅది నా ఇష్టం. ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్లకు ఎప్పుడైతే ఇద్దామని నువ్వు చెప్పావో అప్పుడే నీకు దీనిమీద ఇంట్రెస్ట్ లేదని అర్థం అయింది. అందుకే నిన్ను మీటింగ్ కు కూడా పిలవలేదు.

అయినా మీటింగ్ కు వచ్చి ప్రశ్నలు వేస్తున్నావ్. అయినా మేం ఇస్తుంది మానిటరింగ్ చేయడం. వాళ్లకు వర్క్ కల్పిస్తున్నాం అంతే. పూర్తిగా హ్యాండోవర్ చేయట్లేదు. దీనికి దానికి తేడా తెలుసుకోని మాట్లాడు అని శైలేంద్రకు గట్టిగా చురకలు వేస్తుంది జగతి.

Guppedantha Manasu

జూలై 26వ ఎపిసోడ్ లో..: అదంతా విన్న అటెండర్ వసుధార మిషన్ ఎడ్యుకేషన్ గురించి బస్తీ వాళ్లతో మాట్లాడుతుందని శైలేంద్రకు కాల్ చేసి చెబుతాడు. దీంతో వాళ్లకు డబ్బు ఆశ జూపి వసుధారు ఎదురు తిరిగి మాట్లాడి అవమానించి పంపిచేలా చేయమని అటెండర్ కు చెబుతాడు శైలేంద్ర. అటెండర్ ఓ భార్యాభర్తకు డబ్బు ఇచ్చి అలాగే చేస్తాడు. దీంతో ఆ దంపతులు ఇద్దరు వచ్చి వసుధారతో గొడవ పెట్టుకుంటారు. మాలాంటి వాళ్లను ఆశపెట్టి మధ్యలో వదిలేస్తారని డబ్బుతీసుకున్న ఆవిడ అంటుంది.

ఆమె భర్త వసుధార వచ్చిన కార్ టైర్లో గాలి తీస్తాడు. కోపంతో వసుధార నువ్వు మనిషివా పశువ్వా అంటుంది. నా భర్తను పశువా అని అంటావా అని వసుధారపై చేయి ఎత్తుతుంది డబ్బు తీసుకున్న ఆవిడ. ఆమె చేతిని అడ్డుకుంటుంది వసుధార. నేను చెప్పేది అర్థం చేసుకోండి అని వసుధార అంటే.. నా చేయి వదులూ అని ఆవడి గద్దిస్తుంది. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంటే.. ఆపండి అని రిషి మాట వినిపిస్తుంది. చూస్తే పాండ్యన్ బ్యాచ్ తో కలిసి రిషి దర్శనం ఇస్తాడు.

Guppedantha Manasu
జూలై 27వ ఎపిసోడ్ లో..: నేనేమి కాలేజీ పేరు బయటకు చెప్పలేదు. పర్సనల్ విషయాలను ప్రొఫెషనల్ గా కలపకూడదు అంటూ వసుధార కూడా గట్టిగానే చెబుతుంది. మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాండ్యన్ వాళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు ఫస్ట్ కాలేజీ పేరే బయటకు వచ్చింది. వాళ్ల పేరు కాదు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ముందుగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాకే చదువు గురిచి చెప్పాలి.

అంతేగానీ ఏం తెలియకుండా వాళ్లతో మాట్లాడితే ఇలాగే ఉంటంది అని ఆవేశగా అంటాడు రిషి. తెలియనప్పుడే కదా చెప్పాల్సింది. అంతా తెలిసాక మనం చెప్పేదేంటి సార్. అయినా నేను ఛైర్మన్ గారి కూతురితో వెళ్లాను. కావాలంటే సాక్ష్యానికి ఆమెను అడగండి అని వసుధార అంటుంది. దీంతో షటప్ వసుధార అని గట్టిగా అరుస్తూ లేచి నిల్చుంటాడు రిషి.

జూలై 28వ ఎపిసోడ్ లో..: సార్.. మేడమ్ గారి అమ్మ గారు ఇంట్లో లేనట్లున్నారు. మేడమ్ ను జాగ్రత్తగా చూసుకోండి అని రిషి, ఏంజెల్ వెళ్లిపోతారు. చక్రపాణి బాధగా లోపలికి వెళ్లిపోతాడు. రిషి ఎంగిలి చేసిన మజ్జిగను వసుధార తాగుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి గ్లాస్ లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఏంటీ సార్ గ్లాస్ లాక్కుంటున్నారు అని వసుధార అంటుంది.

Guppedantha Manasu

అది ఎందుకు తాగుతున్నారు అంటే.. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఎంతో కష్టపడితే కానీ మజ్జిగ రాదు అని క్లాస్ తీసుకుంటుంది వసుధార. కావాలని కల్పించి చెబుతున్నట్లు లేదు అని రిషి అంటే.. లేదు, నిజమే చెబుతున్నా అని వసు అంటుంది. రిషి కార్ కీస్ తీసుకుని వెళ్లిపోతాడు. ఇది నా ఇష్టం సార్. మీరే నా ఇష్టం అని వసుధార అనుకుంటుంది.

జూలై 29వ ఎపిసోడ్ లో: పిన్ని బాబాయ్ ఇద్దరికి భయం లేకుండా పోతుంది. వాళ్లు ఏం చేస్తున్నారో తెలిసినా ఏం చేయలేకపోతున్నాను అని కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. ఇంతలో విష్ కాలేజీ నుంచి అటెండర్ కాల్ చేసి వసుధార ఇంటికి రిషి సార్, ఛైర్మన్ కూతురు వెళ్లారట. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం వసుధార వెళ్లినందుకు రిషి సార్ చాలా సీరియస్ అయ్యారు.

వసుధార కూడా తగ్గలేదు. నేను వాళ్లిద్దరికి గతం ఉందని లెక్చరర్స్ కు చెప్పాను. వాళ్లు కూడా నమ్మారు అని అటెండర్ చెబుతాడు. వాళ్ల విషయం బయటపెట్టే సమయం వచ్చిందని చెప్పిన శైలేంద్ర రిషి, వసుధార ఎంగేజ్ మెంట్ ఫొటో పంపిస్తాడు. అది కాలేజీలో ప్రతి చోట కనిపించాలని చెబుతాడు. అప్పుడే గది దగ్గరకి వచ్చిన జగతి రిషి ఎంగేజ్ మెంట్ ఆల్బమ్ చూసి షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X