For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu weekly: రిషికి దిమ్మతిరిగే షాకిచ్చిన సాక్షి.. అందరి ముందూ అడకత్తెరలో పోకచెక్కను చేసేసిందిగా

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్ లోవసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టుతో సీరియల్ మంచి లవ్ స్టోరీగా ముందుకెళ్తున్నది. గత వారం రోజులుగా అంటే జూలై 25 నుంచి జూలై 30వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందనే వివరాల్లోకి వెళితే..

   జూలై 25 వ తేదీ ఎపిసోడ్

  జూలై 25 వ తేదీ ఎపిసోడ్

  స్టోర్ రూమ్ లో వసు-రిషి ఒకరినొకరు చూసుకుని నువ్వెందుకు వచ్చావ్ అంటే నువ్వెందుకు వచ్చావ్ అనుకుంటారు. అక్కడ కత్తెర ఉంటుంది తీసుకొస్తావా అని రిషి అనగానే చూసుకోకుండా కుర్చీ తన్నుకుని వసు పడిపోతోబోతుంటుంది. అదే సమయంలో వసు కిందపడకుండా రిషి పట్టుకుంటాడు. నెట్ చుట్టూ చుట్టేసుకోవడంతో దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదంతా చాటునుంచి వీడియో తీసిన సాక్షి మీ ఇద్దరి మధ్యా చిచ్చు నేను పెడతాను అనుకుంటే బయటకు వెళుతుంది. స్టోర్ రూమ్ లో స్టోరీ అనే టైటిల్ బాగుంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఆట నాదే..గెలుపూ నాదే అంటూ కామెంట్ చేస్తుండగా ఎపిసోడ్ ముగించారు.

  జూలై 26 వ తేదీ ఎపిసోడ్

  జూలై 26 వ తేదీ ఎపిసోడ్


  అందరూ మీటింగ్ రూమ్ లో చదువుల పండుగ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండగా రిషి వసుని పెన్ డ్రైవ్ అడుగుతాడు. లేదు సార్ అంటే భయమో, భక్తో కాలేజీ అంటే గౌరవమో ఉంటే ఇలా పెన్ డ్రైవ్ పోగుడుతుందా అంటూ రెచ్చిపోతుంది. వసుధారా ఏమైందని రిషి అడిగితే కనిపించడం లేదంటున్న క్రమంలో సాక్షి అది కనిపించదు వసుధారా పోయింది.. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నది ఎక్కడా కాపీ చేయలేదా అని అడిగితే రిషి లేదని అంటాడు. వసు ఇలాంటి రెస్పాన్స్ బిలిటీ లేనివారిని పెట్టుకుని చదువుల పండుగ ఎలా చేస్తావని రెచ్చగొడుతుంది. ఇలాంటి తప్పు ఇంకోసారి చేయకుండా ఉండాలంటే ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటే రిషి తప్పకుండా ఇస్తానని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగించారు.

  జూలై 27 వ తేదీ ఎపిసోడ్

  జూలై 27 వ తేదీ ఎపిసోడ్


  రాత్రి పూట వసు రిషి ఇంటికి వెళుతుంది. ఇప్పుడెందుకు వచ్చావు రిషి అని అడిగితే వసు చదువుల పండుగ వర్క్ ని వాయిదా వేయడం ఇష్టం లేదని అంటుంది. వసు దింపడానికి వెళుతున్న సమయంలో కారెక్కుతూ...తూలి పడబోయిన వసుని పట్టుకుంటాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చి చూస్తుంది దేవయాని...ఈ వసుకి ఉన్న తెలివిలో ఆ సాక్షికి సగం ఉన్నా బావుండేది అనుకుంటూ రిషి అని గట్టిగా అరుస్తుంది దేవయాని. ఈ టైమ్ లో ఎక్కడికి వెళుతున్నారని అడిగితే కాలేజీ పనిపై వచ్చింది రూమ్ దగ్గర దింపేసి వస్తానంటాడు. ఈ టైమ్ లో ఇంటికి రాకపోతే ఏంటి చెప్పు అనగానే కాలేజీ పనేకదా అంటూ ఉండగా ఇక్కడితో ఎపిసోడ్ ముగించారు.

  జూలై 28 వ తేదీ ఎపిసోడ్

  జూలై 28 వ తేదీ ఎపిసోడ్


  చదువుల పండుగ కోసం కాలేజీ మొత్తం కూడా అట్టహాసంగా సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో సాక్షి తన ఎద భాగంలో పెట్టుకున్న బ్యాడ్జిని కొంచెం చిందరవందరగా పెట్టి దీనిని సరిజేయమనిషిని అడుగుతాను అని రిషి దగ్గరికి వెళ్లి అడిగితే చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతారు. వెంటనే రిషి తేరుకుని పుష్ప అది ఏదో కాస్త ఇబ్బందికరంగా ఉందట దాని సంగతి చూడమని అంటాడు. దీంతో ఆమెకు షాక్ తగులుతుంది. ఆ తర్వాత వసుధార రిషి భుజానికి ఉన్న బ్యాడ్జిని సరిచేస్తుంది ఆ తర్వాత మీటింగ్ జరుగుతున్న సమయంలోనే వసుధార రిషి క్యాబిన్ కి వెళ్లి రిషితో ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. రిషి కూడా ఆమె వెంట వెళతాడు. ఆమె మాట్లాడుతున్న విషయాలు అర్థం కాకపోవడంతో నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగించారు.

   జూలై 29వ తేదీ ఎపిసోడ్

  జూలై 29వ తేదీ ఎపిసోడ్


  రిషి క్యాబిన్ కి వెళ్లి వసుధార ఆయన కుర్చీతో మాట్లాడుతుంటుంది. తన ప్రేమను కుర్చీకి చెప్పే ప్రయత్నం చేస్తో ఉంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి లోపలకు రావొచ్చా అంటాడు. మీరేంటిసార్ నన్ను అడుగుతారని వసు అంటే..నీలోనువ్వే మాట్లాడుకుంటున్నావ్ కదా అందుకే అని రిప్లై ఇస్తాడు రిషి: అక్కడ మీటింగ్ జరుగుతుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావ్ వసు అంటే ఏదో చెప్పి పంపేయడానికి చూస్తుంది. కానీ చేయి పట్టుకుని ఆమెను బయటకు తీసుకు వెళుతూ ఉండగా సాక్షి చూస్తి గట్టి ప్లాన్ వేస్తుంది.

  జూలై 30వ తేదీ ఎపిసోడ్

  జూలై 30వ తేదీ ఎపిసోడ్


  సాక్షి కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదుకానీ ఈ కాలేజీ నాది.. ఈ కాలేజీ ఎండీ రిషికి కాబోయే భార్యని నేనే అయినప్పుడు అని ఈ కాలేజీ నాది కదా అంటూ బాంబు పేలుస్తుంది. స్టేజ్ పైకి వెళ్లిన రిషి ఏం చేస్తున్నావ్ అని క్వశ్చన్ చేస్తే నీ ఫోన్ కి చాలా ఫొటోస్ పంపించాను ఇప్పుడైనా చూడమని రిషి వసు కలిసి ఉన్న ఫోటోలు పంపుతుంది. నువ్వేమైనా మాట్లాడితే ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ మీడియాకు చూపిస్తాను..ఈ ఫొటోలకు అందమైన ప్రేమకథను జోడిస్తాను అని బెదిరిస్తుంది. రిషి ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా అయిపోతాడు. ఈ దెబ్బకు జగతి, మహేంద్ర సహా వసుధార అందరూ షాకవుతారు.

  English summary
  Guppedantha Manasu is a telugu soap telecasting on star maa. here are the written updates of July July 25th to 30th Episodes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X