Guppedantha Manasu: వసు కాలేజీలోకే లెక్చరర్‌గా రిషి.. భయపడిన మురుగన్.. శైలేంద్రకు చురకలు

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లోకి శైలేంద్ర భూషణ్ అని రిషి అన్నయ్యగా కొత్త క్యారెక్టర్ వచ్చింది. తమ్ముడు రిషిపై ప్రేమ నటిస్తూ లోపల స్వార్థం ఊగిపోతున్న శైలేంద్ర నుంచి తన కొడుకుని రిషి కాపాడుకుందా అనే అంశంతో అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి , మరోవైపు కొడుకు రిషి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు జగతిని వెంటాడుతున్న సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూన్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

జూన్ 5వ ఎపిసోడ్ లో..: ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం అని జరిగింది గుర్తు చేసుకుంటారు. రిషిని హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు అతని పాకెట్ లో ఉన్న ఏంజెల్ విజిటింగ్ కార్డ్ చూసి ఆమెకు ఫోన్ చేస్తాడు డాక్టర్. ఏంజెల్ హాస్పిటల్ కు వచ్చి రేర్ బ్లడ్ గ్రూప్ అయిన రిషికి ఏంజెల్ రక్తం ఇస్తుంది. తర్వాత డాక్టర్స్ ప్రయత్నించి రిషిని కాపాడుతారు. ఏంజెల్ ది నాది సేమ్ బ్లడ్ గ్రూప్ కావడం, మీరు చేసిన సాయం లైఫ్ లో మర్చిపోలేను. నన్ను కాపాడటమే కాదు మీ ఇంట్లో మనిషిగా చూసుకుంటున్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని రిషి చెబుతాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ మన మధ్య అలాంటివి ఎందుకని ఏంజెల్ అంటుంది. ఇక మహేంద్ర ఇంట్లో దిగాలుగా కూర్చుని ఉంటాడు. ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది. అప్పుడే జగతి కూడా వస్తుంది. చిన్నత్తయ్యకి అంత పెద్ద శిక్ష వేశారు కదా. ప్లీజ్ చిన్న మామయ్య తనతో మాట్లాడొచ్చు కదా అని ధరణి బతిమిలాడుతుంది.

Guppedantha Manasu:

జూన్ 6వ ఎపిసోడ్ లో..: ఎగ్జామ్ కి పేపర్స్ ఇస్తుంది వసుధార. ఒకడు సరిగా ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఎందుకు రాయట్లేదని వసు అడుగుతుంది. పేపర్ చెట్ల నుంచి వస్తుంది. దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదని సోది చెబుతాడు. మరో నలుగురు కూడా అలాగే వంకర సమాధానాలు చెప్పి వసుధారకు చిరాకు తెప్పిస్తారు. దీంతో చెప్తా మీ సంగతి అని ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తుంది వసుధార. పరీక్ష సరిగా రాయట్లేదని, అడిగితే వెటకారంగా ఆన్సర్స్ ఇస్తున్నారని ప్రిన్సిపాల్ కు చెబుతుంది వసుధార. మీరు కొత్తగా చేరారు కాబట్టి అలా అనిపిస్తుంది. అసలు వాళ్లను మీరు పట్టించుకోవద్దు. అర్థం చేసుకుని, మీ పని మీరు చేసుకోండని ప్రిన్సిపాల్ సలహా ఇస్తాడు. లేదు సార్. వాళ్ల మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను ఛైర్మన్ కు కంప్లైంట్ ఇస్తాను. వాళ్లను సస్పెండ్ చేయిస్తాను అని వసుధార అంటుంది.

జూన్ 7వ ఎపిసోడ్ లో..: కాలేజీలో కేడీ గ్యాంగ్ అరాచకాలు, పాండ్యన్ తండ్రి రౌడీ మురుగన్ ఇంటికి వచ్చి బెదిరించడం వంటి విషయాలన్ని ప్రిన్సిపాల్ తో క లిసి ఛైర్మన్ విశ్వనాథ్ కు వసుధార చెబుతుంది. అది విన్న ఛైర్మన్ యాక్షన్ తీసుకుంటానని అంటాడు. ఛైర్మన్ యాక్షన్ తీసుకుంటాడని పాండ్యన్ గ్యాంగ్ కు తెలుస్తుంది. దీంతో మురుగున్ నేరుగా ఛైర్మన్ విశ్వనాథ్ ఇంటికి వస్తాడు. ఛైర్మన్ అయుండి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. చిన్న పిల్లలు తప్పులు చేసినప్పుడు చూసి చూడనట్లు వదిలేయాలి. నా కొడుకు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తే నాకు నచ్చదు అని మురుగున్ అంటాడు. ఏంటీ బెదిరిస్తున్నావా అని విశ్వనాథ్ అంటాడు.

Guppedantha Manasu:

జూన్ 8వ ఎపిసోడ్ లో..: ప్రాబ్లమ్ ఏంటీ అని ప్రిన్సిపాల్ ను రిషి అడుగుతాడు. ఇక్కడ లెక్చరర్స్ నే స్టూడెంట్స్ ఏడిపిస్తున్నారు. కేడీ బ్యాచ్ అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. రోజురోజుకు దిగజారుతున్నారు అని ప్రిన్సిపాల్ అంటాడు. హా వాళ్ల వెకిలి చేష్టలు నేను కూడా చూశాను. వాళ్లకు మొదట్లోనే వార్నింగ్ ఇస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని రిషి అంటాడు. వార్నింగ్ ఇచ్చాను. దాంతో నాపై కక్ష కట్టి నా కారులో చక్కెర పోశారు. కొత్తగా వచ్చిన మ్యాథ్స్ లెక్చరర్ ను క్లాస్ రూమ్ లోనే అవమానించారు అని చెబుతాడు ప్రిన్సిపాల్. కేడీ బ్యాచ్ ను సస్పెండ్ చేయాలని చెబితే.. వసుధారతోపాటు ఛైర్మన్ సర్ కే వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఏం చేయమంటారు అని ప్రిన్సిపాల్ అంటాడు.

జూన్ 9వ ఎపిసోడ్ లో..: మురుగన్ ఇంకోసారి లెక్చరర్స్ ఇంటికి వెళ్లి భయపెట్టడాలు, విశ్వనాథం గారి ఇంటికి వెళ్లి బెదిరించాలని చూస్తే అస్సలు ఊరుకోను. నువ్వు తప్పు చేసినా పిల్లలు తప్పు చేసినా ఆ శిక్ష నీ పిల్లలకే వేస్తాను. నువ్వు ఎలా చెబుతావో. ఏం చెబుతావో నాకు తెలియదు. వాళ్లని అందరితో మర్యాదగా ఉండమని చెప్పు. ముందు నీ బెండు తీస్తేనే వాళ్లు సెట్ అవుతారు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నా మాట వింటే నీకే మంచిది. కాదు కూడదు.. లెక్చరరే కదా అనుకుని.. అంటూ ముందుకు వెళ్తుంటే పక్కన ఉన్న రౌడీ వాన్ని కొడతాడేమో అని భయపడిపోతాడు. అరేయ్ నిన్ను ఏం అనన్రా అని అన్న రిషి.. నీలాంటి రౌడీలను చూడటం నాకేమి కొత్త కాదు. కానీ నీలాంటి వాడిని చూడటం నీకే కొత్త జాగ్రత్త. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. అప్పుడే వచ్చిన మరో రౌడీ అన్నా ఏంటన్నా ఇది. చెప్పు వాన్ని వేసేయనా అంటాడు.

Guppedantha Manasu:

జూన్ 10వ ఎపిసోడ్ లో..: ఇప్పటివరకు నువ్ చేసింది చాలు ఇకనైనా నా కొడుకును ఎండీ సీటులో కూర్చోబెడితే బాగుంటుంది అని దేవయాని అంటుంది. ఏం బాగుంటుంది. అవసరం లేదు అని జగతి అంటుండగా.. ఫణీంద్ర వస్తాడు. వాళ్లు అన్నారు అని కాదు. నువ్వు ఎండీ సీటు నుంచి తప్పుకోవడమే మంచిదమ్మా. రిషి దూరమైన బాధ, మహేంద్ర మాట్లడటం లేదన్న వెలితి వీటి మధ్య నలిగిపోతున్నావ్. అది మానేసి ప్రశాంతంగా ఉండమ్మా అని ఫణీంద్ర అంటాడు. నేను అదే చెబుతున్నా డాడ్. దేని గురించో బాగా సంకోచిస్తుందనుకుంటా అని శైలేంద్ర అంటాడు. రాజు లేని సింహాసనం నీడలో కుట్రలు, కుతంత్రాలు పురుడు పోసుకున్నట్లు డీబీఎస్టీ సీట్ గురించి నక్కలు, తోడేళ్లు కుట్ర పన్నుతున్నాయని శైలేంద్ర సంకోచిస్తున్నాడు బావగారు. ఎవరో కష్టపడి స్థాపించిన సామ్రాజ్యాన్ని అప్పనంగా అనుభవించాలని అనుకునేవారు ప్రతిచోట ఉంటారు అని శైలేంద్రకు చురకలు వేస్తుంది జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X