Guppedantha Manasu: గుండుతో షాక్ ఇచ్చిన రిషి.. ఆరా తీస్తున్న ఫణీంద్ర.. జగతి ఎదురుచూపులు
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లోకి శైలేంద్ర భూషణ్ అని రిషి అన్నయ్యగా కొత్త క్యారెక్టర్ వచ్చింది. తమ్ముడు రిషిపై ప్రేమ నటిస్తూ లోపల స్వార్థం ఊగిపోతున్న శైలేంద్ర నుంచి తన కొడుకుని రిషి కాపాడుకుందా అనే అంశంతో అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి , మరోవైపు కొడుకు రిషి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు జగతిని వెంటాడుతున్న సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూన్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..
జూన్ 12వ ఎపిసోడ్ లో..:మహేంద్రకు వసుధార ఫోన్ చేయడం తెలుసుకున్న చక్రపాణి మొబైల్ లాక్కుని కాల్ కట్ చేస్తాడు. మహేంద్ర గురించి ఆలోచించావ్ కానీ రిషి గురించి ఆలోచించలేదు. నీ మీద కోపంగా ఉన్న రిషికి మహేంద్ర సార్ కనిపిస్తే ఏం జరుగుతుందో ఊహించావా. అందరి వద్దనుకునే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మహేంద్ర సార్ కి తెలిసిందని తెలిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతారు అని నచ్చజెప్పుతాడు చక్రపాణి. తర్వాత మిస్డ్ కాల్ చూసిన మహేంద్ర రిటర్న్ కాల్ చేస్తాడు. దాన్ని లిఫ్ట్ చేసి తన పేరు చక్రపాణి అని చెబుతాడు. చక్రపాణి అని మహేంద్ర షాక్ కాగా అది విని జగతి కూడా ఆశ్చర్యపోతుంది. ఏం కావాలి అని చక్రపాణి అడిగితే.. అంటే ఈయన నాకు కాల్ చేయలేదా. వసుధార కాల్ చేసిందా అని మహేంద్ర అనుకుంటాడు.

జూన్ 13వ ఎపిసోడ్ లో..:కారులో వెళ్తూ వసుధార గురించి ఆలోచిస్తంటాడు రిషి. నమ్మించి ప్రాణాలు పోయేలా చేసినా వసుధార గురించి కాకుండా నా ప్రాణాలు కాపాడిన ఏంజెల్, విశ్వనాథం కోసం, స్టూడెంట్స్ భవిష్యత్ కోసం చక్కదిద్దాలి. నా జీవితంలో నుంచే వసుధార వెళ్లిపోయింది. అలాంటిది పక్కన ఉంటే ఏంటీ. ఇక నా దృష్టి కాలేజీపైనే అని అనుకుంటాడు రిషి. ప్రిన్సిపాల్ కు రిజైన్ లెటర్ ఇస్తుంది వసుధార. షాక్ అయినా ప్రిన్సిపాల్ మీరు వచ్చిన తర్వాతే కాలేజీ మెరుగుపడింది. మీరు ధైర్యం చేయడం వల్లే రిషి సార్ వచ్చారు. మీ ఇద్దరి రాకతో కాలేజీ రూపురేఖలు మారిపోయాయి అని బతిమిలాడుతాడు ప్రిన్సిపాల్. అయినా వసుధార వినదు. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఆ రిజైన్ లెటర్ తీసుకుని ముక్కలుగా చించేస్తాడు. ఇప్పుడు ఉద్యోగం మానేయదు అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.
జూన్ 14వ ఎపిసోడ్ లో..: కాలేజీలో లెక్చరర్ గా చేరిన రిషిని అవమానించేందుకు పాండ్యన్ బ్యాచ్ పేడ నీళ్లు చల్లాలని ప్లాన్ చేస్తారు. కానీ అది కనిపెట్టిన రిషి ఆ పేడ నీళ్లను కేడీ బ్యాచ్ తోనే క్లీన్ చేయిస్తాడు. రిషి గురించి తండ్రి మురుగన్ కు పాండ్యన్ ఫోన్ చేసి చెబుతాడు. లెక్చరర్ చెప్పినట్లు విని బుద్ధిగా వినమని మురుగన్ అంటాడు. దీంతో వేరే స్టూడెంట్స్ తో క్లీన్ చేయమని బెదిరిస్తాడు పాండ్యన్. అది చూసిన రిషి ఎవరు తప్పు చేశారో వాళ్లే క్లీన్ చేయాలి అని చెప్పి.. పాండ్యన్ బ్యాచ్ తోనే క్లీన్ చేపిస్తాడు. ఇక నుంచి పద్ధతిగా మార్చుకుని బుద్ధిగా ఉండాలి. ఇంట్లో ఉన్నట్లే కాలేజీలో ఉంటానంటే కుదరదు. చదువుపై శ్రద్ధా ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి, లెక్చరర్స్ కు గౌరవం ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రిషి. తర్వాత లెక్చరర్స్ అంతా ఇప్పుడు సంతోషంగా, ధైర్యంగా ఉందని రిషితో అంటారు.
జూన్ 15వ ఎపిసోడ్ లో..: తప్పు మీరు చేస్తే శిక్ష మాత్రం నాకు, డాడ్ కు పడింది. తప్పులు చేయడం. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం. అది బయటపడితే క్షమాపణ కోరడం. ఇదే కదా నీ వ్యక్తిత్వం. ఇలాగే కదా నువ్వు బతికేది. అసలు ప్రేమంటే, నమ్మకం అంటే ఏంటో తెలుసాత. తెలిస్తే ఇలా నన్ను ఇబ్బంది పెట్టవు. పక్కవాళ్లకు డౌట్ వస్తుందని నాతో మాట్లాడటానికి ట్రై చేయొద్దు. నా దగ్గరకు రావాలని ప్రయత్నించకు. నా మనసును చంపేశావ్. నన్ను చంపేయకు అని చెప్పి రిషి వెళ్లిపోతాడు. ఇదంతా చాటు నుంచి పాండ్యన్ వింటాడు. ఇక పోలీస్ ఫ్రెండ్ ద్వారా వసుధార అడ్రెస్ తెలుసుకున్న మహేంద్ర విష్ కాలేజీకి వస్తాడు. ఓవైపు మహేంద్ర.. మరోవైపు రిషి వస్తారు. ఇంతలో మహేంద్రను రిషి చూస్తాడు. డాడ్ అని ప్రేమగా పిలుస్తాడు రిషి. అది విన్న మహేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతాడు.

జూన్ 16వ ఎపిసోడ్ లో..:నేను ఇక్కడున్నట్లు ఎవరికీ ముఖ్యంగా నా ఫ్యామిలీకి చెప్పొద్దు అని రిషి అంటాడు. సరే అని వసుధార అంటుంది. ఇంతలో అటునుంచి వసుధార వైపు మహేంద్ర వస్తాడు. అది చూసిన వసుధార సార్ మహేంద్ర సార్ వస్తున్నారని చెప్పండంతో రిషి పక్కకు పరుగెత్తుకు వెళ్లి దాక్కుంటాడు. మహేంద్ర రాగానే బాగున్నారా సర్ అని అడుగుతుంది వసుధార. బాధలో ఉన్నామని తెలిసి బాగున్నారా అని అడగడం మూర్ఖత్వం వసుధార అని మహేంద్ర అంటాడు. నా కొడుకు రిషి గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. ఎక్కడున్నాడు అని మహేంద్ర అడిగితే తనకు తెలియదని వసుధార అంటుంది. నీ కళ్లు, నీ మాటల్లో బెరుకు చూస్తేనే తెలుస్తోంది నువ్ అబద్దం చెబుతున్నావని అన్న మహేంద్ర.. రిషి ఎక్కడున్నాడని కన్నీళ్లతో అడుగుతాడు. నాకు తెలియనప్పుడు ఎలా చెబుతాను సార్ అని వసుధార అంటుంది.
జూన్ 17వ ఎపిసోడ్ లో..: డీబీఎస్టీ కాలేజీలో జగతితో మాట్లాడుతుంటాడు ఫణీంద్ర. మన కాలేజీకి ప్రపంచం నలుమూలల నుంచి పేరు వచ్చిందంటే రిషినే కారణం. రిషి వెళ్లడంతో కాలేజీ అంతా బోసి పోయింది. కళ తప్పింది. నువ్వు రిషిపై నింద వేయడానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఇప్పటివరకు నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. కనీసం నాకు అయినా చెప్పమ్మా. దాని వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతాడు ఫణీంద్ర. దీనంతటికి కారణం మీ కొడుకు, మీ భార్య అని ఎలా చెప్పను బావగారు. అది విని తట్టుకునే శక్తి మీకు ఉందా అని మనసులో అనుకుంటుంది జగతి. రిషి వస్తే నిజాలు తెలుస్తాయి అని జగతి అంటుంటే మినిస్టర్ కాల్ చేస్తాడు. బిజీగా ఉన్నారా అని తెలుసుకుని వీలైతే ఆఫీస్ కు అర్జంట్ గా రమ్మని చెబుతాడు. దీంతో అక్కడి నుంచి మినిస్టర్ దగ్గరికి బయలు దేరుతుంది జగతి.


Click it and Unblock the Notifications











