Guppedantha Manasu: ఎన్నో ట్విస్టులు.. శైలేంద్రకు వరుస దెబ్బలు.. ఎండీ సీటు దక్కకుండా జగతి ఏర్పాట్లు

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూన్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

జూన్ 19వ ఎపిసోడ్ లో..: ఇన్విరాన్ మెంట్ క్లాస్ కదా అందుకే ప్రకృతిలో ఉన్నాం. క్లాసులు కూడా ఇలా ప్రకృతిలో చెబితే బాగుంటుంది కదా అని కేడీ బ్యాచ్ అంటుంది. అంటే ఎలక్ట్రికల్ సబ్బెక్ట్ చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఆఫీస్, ట్రాన్స్ ఫార్మర్ల మధ్య చెప్పాలా అని రిషి అనడంతో షాక్ అవుతుంది కేడీ బ్యాచ్. సరే మీరు ప్రకృతి ప్రేమికులు కదా. ఎన్విరాన్ మెంట్ ను ఎంజాయ్ చేస్తారు కదా. దానికంటే ముందు ప్రకృతిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా. ఇక్క ఎంత చెత్త ఉందో ముందు అది శుభ్రం చేయమని ఆర్డర్ వేస్తాడు రిషి. మేం క్లీన్ చేయం, డ్రెస్ పాడవుతుంది అని పాండ్యన్ అంటాడు. అయితే క్లీన్ చేయరా అని రిషి అనడంతో.. అరేయ్ వాడితో ఎందుకు వచ్చిన గొడవ చేద్దామని పాండ్యన్ తో రోహిత్ అంటాడు. దీంతో అంతా క్లీన్ చేస్తారు. మరోవైపు మినిస్టర్ దగ్గరికి వెళ్లిన జగతికి మిషన్ ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టమని చెబుతాడు. రిషిపై అభియోగం మోపడానికి గట్టి కారణం ఉంది. అందుకే సైలెంట్ గా ఉన్నానని మంత్రి అంటాడు.

Guppedantha Manasu:

జూన్ 20వ ఎపిసోడ్ లో..: శైలేంద్ర తెలియక ఒక మాట అంటే కొడతావా అని దేవయాని నిలదీస్తుది. అవును కొడతానని జగతి కోపంగా అంటుంది. నేను అంటే కూడా కొడతావా అని దేవయాని అంటే.. ఏదీ అని చూడండని అన్న జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు నిన్ను మేడమ్ ని ఎంతగానో నమ్మాను. కానీ మీరు నా మీద మచ్చ వేసి పెద్ద తప్పు చేశారని రిషి అనుకుంటే మమ్మల్ని క్షమించమని వసుధార అనుకుంటుంది. ఇక శైలేంద్రతో చూశావా జగతిని రెచ్చగొడితే ఎలా ఉంటుందో. జగతి ఆడపులి. తన కోపాన్ని మనం తట్టుకోలేం. ఎండీ సీటు కావాలంటే కాస్తా ఓపిక పట్టాలి అని దేవయాని అంటే.. శైలేంద్ర మాట వినడు. అందరికీ నిజం చెప్పేస్తాను అని శైలేంద్ర అంటే.. ఏం నిజం అని దేవయాని అంటుంది. రిషి ప్రాణాలతో లేడని శైలేంద్ర అనేసరికి.. దేవయాని షాక్ అవుతుంది.

జూన్ 21వ ఎపిసోడ్ లో..: రిషి అన్న మాటలు తలుచుకుంటూ బాధగా వెళ్తుంటాడు చక్రపాణి. రోడ్డుపై వెళ్తుంటే రాయి తట్టుకుని కిందపడిపోతాడు. అతని కళ్లజోడు కూడా కింద పడితే దానిపైనుంచి బైక్ వెళ్లి పగిలిపోతుంది. నా బిడ్డ భవిష్యత్తు లాగే నా కంటిచూపు కూడా పోయింది. నా బిడ్డ భవిష్యత్తే నా కంటిచూపు కదా. సుమిత్ర నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్ అని కుమిలిపోతాడు చక్రపాణి. మరోవైపు మెట్లమీద కూర్చుని రిషి ఉంటాడు. ఆ పక్కనే వసుధార ఉంటుంది. తండ్రిని రిషి అన్న మాటలు తల్చుకుని వసు బాధపడుతుంటే చక్రపాణిని అన్న మాటలను రిషి తలుచుకుంటాడు. ఇద్దర్ని ఒకరినొకరు చూసుకుని జరిగినదంతా మనసులో మాట్లాడుకుంటారు. అలా ఇద్దరు మాట్లాడుకోవడం అయిపోయాక రిషికి ఏంజెల్ కాల్ చేసి షాపింగ్ వెళ్దామంటుంది. కానీ మూడ్ బాగోలేదని చెప్పి రిషి రానంటాడు.

Guppedantha Manasu:

జూన్ 22వ ఎపిసోడ్ లో..: రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కంగారుగా విశ్వనాథం వస్తాడు. ఏమైంది సార్ కంగారుగా ఉన్నారు. ఏంజెల్ కు ఏమైనా అయిందా అని అడుగుతాడు రిషి. కాదు. కేడీ బ్యాచ్ వల్ల సమస్య వచ్చింది. వాళ్లను రేవ్ పార్టీలో పోలీసులు అరెస్ట్ చేశారట. వాళ్లపై కేసు నమోదు చేస్తే.. వాళ్లు మన కాలేజీ పిల్లలను రేపు పేపర్లో వస్తే మన కాలేజీ పరువు పోతుంది అని టెన్షన్ అవుతుంటాడు విశ్వనాథం. మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని రిషి అంటాడు. నేను ఇప్పటికే ఎస్సైతో మాట్లాడించాను. కానీ అతను వినడం లేదు అని విశ్వనాథం అంటాడు. పర్లేదు నేను చూసుకుంటాను అని రిషి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ కారు దిగ్గానే వసుధార కూడా కనిపిస్తుంది.

జూన్ 23వ ఎపిసోడ్ లో..:అందరికీ 24 గంటలే. కానీ వీళ్లంతా డే టైమ్ లో కుదరక నైట్ చదువుకుంటున్నారు. మీలా వీళ్లు రిచ్ కాదు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు. మీ పార్టీల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తారు. స్టూడెంట్స్, లెక్చరర్స్ ను ఆటపట్టించేందుకు కూడా ఖర్చు చేస్తారు. కానీ వీళ్లు ప్రతిరోజు పరిస్థితులతో యుద్ధం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. జీవితంలో ఒక్కో అడుగు కష్టంగా ముందుకు వేస్తున్నారు అంటూ ఒక్కొకరి జీవితం, వాళ్ల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, చదువు ప్రాముఖ్యత గురించి చెబుతాడు రిషి. మీరు గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. కాబట్టి మీకు కష్టం తెలియదు. మీరు కష్టపడాలి అని చెప్పట్లేదు. అది తెలుసుకోండి చాలు. మీరు ఒకర్ని ఏడిపిస్తే ఎంజాయ్ మెంట్ అనుకుంటున్నారు. కానీ ఆకలిగా ఉన్న వారికి ఒక్క రూపాయి, ఓ ముద్ద అన్నం పెట్టి చూడండి అసలైన సంతోషం, ఎంజాయ్ మెంట్ ఏంటో తెలుస్తుంది అని రిషి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu:

జూన్ 24వ ఎపిసోడ్ లో..:అసలు వాడు బతికి ఉంటే కదా. ఏదో ఒక రోజు వాడు చచ్చాడని విషయం చెబితే ఏమైపోతావో అని మనసులో అనుకున్న శైలేంద్ర ఏంటీ మమ్మీ పిన్నీ ఇలా మాట్లాడుతుంది అని శైలేంద్ర అంటాడు. వాళ్లకు జగతిపై ఉన్న నమ్మకం అలాంటిది. అది ఇప్పటిది కాదు. నువ్వు వాళ్ల నమ్మకాన్ని చెడగొట్టలేవు అని జగతికి సపోర్ట్ గా మాట్లాడి శైలేంద్రను సైలెంట్ అవ్వమని కనుసైగ ద్వారా చెబుతుంది. మీరంతా ఒక్కటయ్యారు. నేను ఒంటరి అనుకుంటూ వెళ్లిపోతాడు శైలేంద్ర. నేను ఆలోచించి అడుగులు వేస్తాను. మేము అనుకున్నది జరుగుతుంది. ఇది మా టైమ్ అని జగతితో దేవయాని అంటుంది. అవును, కానీ ఇప్పుడు నా టైమ్. నేను ఏది చెబితే అదే జరుగుతుంది. కాలేజీ మీ చేతుల్లోకి రాదు. ఒకవేళ నన్ను చంపి చేజిక్కుంచుకుందామన్న కుదరదు. దానికి అన్ని ఏర్పాట్లు చేశాని అని జగతి వెళ్లిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X