Guppedantha Manasu: వసుకు యాక్సిడెంట్.. ఫణీంద్ర ఉగ్రరూపం.. అన్నదమ్ములకు గొడవలు?
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిపై మిషన్ ఎడ్యుకేషన్ లో అవినీతి చేశాడన్న అభియోగంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి నుంచి తొలగిస్తారు. అది జరిగిన మూడేళ్ల తర్వాత విష్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన రిషి అక్కడి కేడీ బ్యాచ్ ను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే కాలేజీలో మరో లెక్చరర్ గా పనిచేస్తున్న వసుధార రిషి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటుంది.
మరోవైపు జగతి, మహేంద్ర రిషి రాక కోసం ఎదురుచూస్తుంటే.. ఎండీ సీటు కోసం శైలేంద్ర దేవయాని ప్లాన్స్ వేస్తుంటారు. ఇలా ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జూన్ 26వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

జూన్ 26వ ఎపిసోడ్ లో: కేడీ బ్యాచ్ మోకాళ్లపై నిలబడి రిషితోపాటు అందరికీ సారీ చెబుతారు. ఎంజాయ్ మెంట్ పేరుతో అందరినీ టార్చర్ చేశాం. రిషి సార్ చెప్పడంతో రియలైజ్ అయ్యామని అంటారు. రిషి సార్ కాళ్లు పట్టుకోబోతుంటే ఆపుతాడు. మీలో మార్పు వచ్చింది చాలు. సారీ అవసరం లేదు. స్టూడెంట్స్ గా లెక్చరర్స్ కి రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఇకనైనా సంతోషంగా ఉండండి అని రిషి అనడంతో అంతా చప్పట్లు కొడతారు.
అంతా వెళ్లిపోతే.. కాలేజీ స్టాఫ్ రిషిని పొగుడుతారు. ఈ సందర్భంగా సెల్ఫీ తీసుకుందామని అంటాడు లెక్చరర్. సెల్ఫీ తీసుకునేప్పుడు రిషి పక్కకు వచ్చన వసుధార తాకుతుంది. దీంతో థ్యాంక్యూ అంటూ వెళ్లిపోతాడు రిషి. మరోవైపు మహేంద్ర కారు ఆగిపోతే.. మెకానిక్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో అక్కడ రోడ్డుపై చక్రపాణి కనిపించడంతో.. పిలుస్తాడు. మహేంద్రను చూసి చక్రపాణి షాక్ అవుతాడు.
జూన్ 27వ ఎపిసోడ్ లో: తను నా కంటికి కనిపించనంత దూరం వెళ్లాక నేను వెళ్లాలి అనుకుంటాడు రిషి. ఇంతలో వసుధారకు యాక్సిడెంట్ అయిందని తెలిసి పరుగెత్తుకెళ్తాడు రిషి. వెళ్లి చూసే సరికి రక్తపు మడుగులో వసుధార ఉంటుంది. బ్లడ్ చాలా పోయింది, అంబులెన్స్ కు కాల్ చేయమని లేడీ లెక్చరర్ అంటుంది. వసుధారను చూసి వెనక్కి వెళ్లి ఆగిపోతాడు. అక్కడ ఏదో ఆలోచించుకుని వసుధారను కారులో హాస్పిటల్ కు తీసుకెళ్తాడు రిషి.
వసుధార కోసం రిషి ఆగిపోయి ఆలోచించే తీరు ఎమోషనల్ గా బాగుంది. రిషి కారు బయటకు వెళ్లగానే మహేంద్ర కారు కాలేజీలో ఎంట్రీ ఇస్తుంది. అక్కడ ఆడుకుంటున్న పాండ్యన్ ను పిలిచి రిషి సార్ ఉన్నారా అని అడుగుతాడు మహేంద్ర. ఇప్పుడే వెళ్లిపోయారు. మీరు తనకు ఏం అవుతారు అని పాండ్యన్ అడుగుతాడు. నాకు బాగా కావాల్సిన వ్యక్తి అని చెప్పి రిషి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు మహేంద్ర.
జూన్ 28వ ఎపిసోడ్ లో: వసుధారకు యాక్సిడెంట్, ట్రీట్ మెంట్ తర్వాత ఏంజెల్ డిశ్చార్చ్ చేయిస్తుంది. వసుధార ఇల్లు చాలా దూరంలో ఉంది కదా అని తన ఇంటికి తీసుకెళ్తుంది. హాల్లో నిలబడిన వసుధార లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటుంది. మన ఇంట్లో ఉండేందుకు వసుధారా చాలా ఇబ్బంది పడుతుందని, జరిగినదంతా విశ్వనాథంకి చెబుతుంది ఏంజెల్. ఇది కూడా మీ ఇల్లే అనుకోమ్మా. ఫీల్ ఫ్రీ అని లోపలకి వెళ్లమని వసుధారతో అంటాడు విశ్వనాథం.
తటపటాయిస్తూనే వసుధార లోపలకు వెళ్తుంది. రిషి కాల్ రావడంతో పక్కకు వెళ్లి అటెండ్ చేస్తాడు. అటునుంచి విష్ కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడతాడు. సార్ మీ కారణంగానే కేడీ బ్యాచ్ లో మార్పు వచ్చింది. వాళ్లు చాలా బుద్ధిగా ఉంటున్నారని లెక్చరర్స్ చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది అని ప్రిన్సిపాల్ అంటాడు.
జూన్ 29వ ఎపిసోడ్ లో: నిజం విని ఆవేశ పడొద్దు. ఈ నిజం విని తట్టుకోవాలి అని జగతి అంటుంది. ఏంటా నిజం అని మహేంద్ర అడుగుతాడు. రిషిపై నేను అభియోగం మోపడానికి కారణం నీ అన్న కొడుకు శైలేంద్ర, దేవయాని అక్కయ్య అని జగతి చెబుతుంది. ఏం అంటున్నావ్ జగతి అని గంభీరంగా అంటాడు మహేంద్ర. రిషిపై జరిగిన ప్రతి దాడి శైలేంద్ర చేయించిందే అని కత్తితో పొడిపించింది, కారు యాక్సిడెంట్, పూల కుండీ పడేయటం, చెక్ మిస్ యూజ్ వంటి అన్ని విషయాలు చెబుతుంది జగతి.
ఇంత కుట్ర పన్నారు. ఎండీ సీటు కావాలని ఒక్క మాట చెబితే రిషి ఇచ్చేవాడు కదా. ఇప్పుడే వాళ్ల అంతు చూస్తా అని మహేంద్ర ఆవేశపడుతాడు. ఇప్పుడు కాదండి, ఆలోచించి నిర్ణయ తీసుకోవాలి. మీ ప్రాణాలే కాదు నాకు బావగారి ప్రాణాలు కూడా ముఖ్యమే అని జగతి అంటుంది. దీంతో ఆలోచనలో పడిపోతాడు మహేంద్ర.
జూన్ 30వ ఎపిసోడ్ లో: శైలేంద్ర, దేవయాని చేసిన దారుణాల గురించి మహేంద్రకు చెబుతుంది జగతి. వాళ్ల అంతు చూస్తానని మహేంద్ర అంటాడు. రిషి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కారణం కొడుకు, భార్య అని తెలిస్తే బావగారు తట్టుకోలేరు. ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని జగతి అంటే.. ఏంటీ జగతి అని మహేంద్ర అంటాడు. నాకు మీ ప్రాణాలే కాదు బావగారి ప్రాణాలు కూడా ముఖ్యమే. మీ అంతటా మీరు ఈ విషయం బయట పెడితే రిషి మీద ఒట్టే.
వసుధార ఎక్కడుందో చెప్పు మహేంద్ర. రిషి ఎక్కడున్నాడో వసుధారకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను బతిమాలైన రిషి ఎక్కడున్నాడో తెలుసుకుంటాను అని జగతి అంటుంది. రిషి ఎక్కడున్నాడో నాకు తెలిసింది అని మహేంద్ర అంటాడు. అవునా, ఎక్కడున్నాడు. ఎలా ఉన్నాడు. కలిశావా.. మాట్లాడవా.. తనకు కోపం తగ్గిందా.. నా గురించి అడిగాడా చెప్పు మహేంద్ర ప్లీజ్ అని కంగారుగా అడుగుతుంది జగతి.
జూలై 1వ ఎపిసోడ్ లో: ఫణీంద్ర వెళ్లగానే ధరణిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు అని వారిస్తాడు శైలేంద్ర. దీంతో నాది మట్టి బుర్ర కదా అండి. ఎప్పుడెలా ఉండాలో తెలియదు. నిజం చెప్పడం మాత్రమే తెలుసు అని ధరణి కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇప్పుడు మీ నాన్న మహేంద్ర దగ్గరకు కోపంగా వెళ్లారు కదా. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ పడొచ్చు. ఇద్దరూ విడిపోవచ్చు. అప్పుడు కాలేజీ మన సొంతం అవుతుంది. ఒకవేళ కలిస్తే.. జగతి, మహేంద్ర ఇంటికి వస్తారు. అప్పుడు అనుక్షణం గమనిస్తూ వాళ్ల పనికి అడ్డుతగలొచ్చు. మన కల నెరవేరుతుంది అని దేవయాని అంటుంది.


Click it and Unblock the Notifications











