గుప్పెడంత మనసు రిషి ఫ్యాన్స్ కు షాక్.. మను ప్రేమలో వసూ..
ఈమధ్య సినిమాల కన్నా సీరియల్స్ యే ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి. హీరోహీరోయిన్ల కన్నా సీరియల్ హీరోలు హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి వాటి మీదనే ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ప్రస్తుతం టాప్ సీరియల్స్ ఒకటిగా గుప్పెడంత మనసు సీరియల్ కొనసాగుతుంది. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్ టాప్ ట్రెండింగ్ లో నడుస్తుంది. రిషి, వసుధర, జగతి, మహేంద్ర పాత్రలు అభిమానులకు అలవాటుగా మారిపోయాయి. ఈ సీరియల్ ద్వారా ముకేష్, రక్ష మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

రిషి వసుగా వారి నటన అద్భుతమని చెప్పాలి. వీరిద్దరి బయట కెమిస్ట్రీ కూడా అలాగే ఉండేది. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లా ఎప్పుడు కొట్టుకుంటూ కనిపించేవారు. వారిని చూసి అభిమానులు సుపర్ జంట అంటూ కామెంట్స్ పెట్టేవారు
ఇక ఈ సీరియల్ మధ్యలో ఉన్నప్పుడే ముకేష్ కు హీరోగా ఛాన్స్ వచ్చింది. అందువల్లే అతను సీరియల్ నుంచి దూరమయ్యాడు. ఇక రిషి వెళ్ళిపోయాక .. కొత్త హీరోగా మను వచ్చాడు. మను పాత్రలో నటిస్తున్న హీరో రవి శంకర్ రాథోడ్. అతడు కూడా అంతకు ముందు కొన్ని సీరియల్స్ చేశాడు.

ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రవిశంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్ లో రిషి చనిపోయాడు.. సెకండ్ హీరోగా మను వచ్చాడు. కథ ప్రకారం అయితే మను.. రిషికి తమ్ముడు అవుతాడు. వసు వదిన అవుతుంది. వీరిద్దరికీ లవ్ ట్రాక్ పెట్టడం కష్టం..అందుకే మను కోసం ఏంజెల్ ను పెట్టారు.
ఇదంతా సీరియల్ లో.. కానీ, బయట మాత్రం రక్ష, రవి శంకర్ మంచి స్నేహితులు. ఒకప్పుడు ముకేష్ తో రక్ష చేసే అల్లరి.. ఇప్పుడు రవిశంకర్ తో చేస్తుంది. సెట్ లో వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీ లా ఉంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రవిశంకర్.. రక్ష తనను ఏడిపిస్తుందని తెలుపుతూ సెట్ లో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

తాజాగా వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. " రక్ష నన్ను టీజ్ చేయడం ఎందుకు ఆపడం లేదు" అంటూ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలో రక్ష.. రవిశంకర్ ను ఒక చేత్తో పట్టుకొని ఇంకోచేత్తో కెమెరాకు ముద్దు ఇస్తుండగా.. ఇంకోపక్క రవిశంకర్.. రక్షను తలపై కొడుతూ కనిపించాడు. దీంతో రిషి ఫ్యాన్స్.. రక్ష పై మండిపడుతున్నారు. రిషి లేకపోయేసరికి మను తో ప్రేమ మొదలుపెట్టావా వసు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











