Guppedantha Manasu Weekly Roundup: రోజుకొక షాక్ ఇచ్చిన రిషి.. కన్నీళ్లతో వసుధార.. దేవయాని కొత్త ప్లాన్!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.
ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 27వ ఎపిసోడ్ లో..
జగతి వచ్చే సరికి రిషి కోపంగా ఉంటాడు. లెక్చరర్స్ భయపడుతూ ఉంటారు. వీళ్లు చేసిన తప్పుల లిస్ట్, వీళ్ల ప్రవర్తనకు సంబంధించిన రిపోర్ట్ అని ఒక ఫైల్ జగతికి ఇస్తాడు రిషి. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వీళ్ల మాటలు నేను స్వయంగా విన్నాను. వీళ్లకు అవసరం లేని వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. పర్సనల్ మాటర్ లోకి వెళ్లారు. వసుధారతో కలిపి నన్ను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
మీకు నచ్చినట్లు మాట్లాడితే మేము తీసుకునే నిర్ణయాలు మేం తీసుకుంటాం. వసుధార గురించి ఇంతకుముందు మాట్లాడినప్పుడు సర్ది చెప్పాను. పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్లి చెప్పించాను. అయినా మీరు మారలేదు. మీరు మారరని అర్థం అయింది. డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పేస్తాడు రిషి. వీళ్లను డిస్మిస్ చేశాను. నోటీస్ బోర్డ్ పై ఉంచండి. మూడు నెలల సాలరీ అడ్వాన్స్ గా ఇచ్చేయండి. ఇంకేదైనా ఉంటే అది కూడా సెటిల్ చేయండి అని రిషి చెప్పేసి వెళ్లిపోతాడు.

ఫిబ్రవరి 28వ ఎపిసోడ్ లో..
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి ముఖ్య కారకురాలు వసుధార. డీబీఎస్ డీ కాలేజీకి దొరికిన ఒక అపురూపమైన వెల కట్టలేని డైమండ్. వసుధార లాంటి తెగువు, అందం, తెలివి ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారు అంటూ పొగుడుతూ ఒక్కసారిగా ఇలాంటి అమ్మాయిని కూతురుగా కోరుకుంటారు. కానీ నేను మాత్రం మా ఇంటికి కోడలిగా రావాలని ఆశపడ్డాను అని షాక్ ఇస్తుంది.
వసుధార లాంటి అమ్మాయి రిషిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను అని దేవయాని అంటే.. ఏం మాట్లాడుతున్నావ్ అని ఫణీంద్ర కోపంగా లేస్తాడు. ముగిస్తున్నాను అంటూ మనం ఆశపడింది నిజమే కదా.. కానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటీ అని ఇలా మాట్లాడుతూ వసుధారను చూసి వెకిలిగా నవ్వుతుంది.

మార్చి 1వ ఎపిసోడ్ లో..
మీడియా వాళ్లు గోల చేసేసరికి.. వెంటనే లేచిన జగతి.. రిషి వల్ల అని అరుస్తుంది. దీంతో దేవయాని బిత్తరపోగా.. అంతా షాక్ అయి పైకి లేస్తారు. జగతీ కోపంగా దేవయాని వైపు చూస్తే.. ఏం మాట్లాడుతున్నావ్ జగతీ అని కోపంగా అంటుంది దేవయాని. దీంతో మైక్ దగ్గరికి వెళ్లిన జగతి.. దేవయానిని తోసినట్లుగా చేసి.. వసుధార మెడలో తాళి పడటానికి కారణం రిషి అని చెబుతుంది జగతి.
రిషీంద్ర భూషణ్ నా కొడుకే వసుధార మెడలో తాళికి కారణం. వసుధార నా కోడలు అని అంటుంది జగతి. దీంతో నీ శిష్యురాలిని కాపాడుకోవడానికి అబద్ధాలు చెబుతున్నావా అని దేవయాని అంటుంది. ఇది అబద్ధం కాదు అక్కయ్య గారు. ఇది నిజం అని ఆవేశంగా అంటుంది జగతి.

మార్చి 2వ ఎపిసోడ్ లో..
మరోవైపు రిషి క్యాబిన్ కు వెళ్లిన వసుధార సంతోషంలో మునిగిపోతుంది. రిషి తన భర్తగా చెప్పినందుకు తెగ సంబరపడిపోతుంది. అక్కడున్న హార్ట్ తీసుకుని గిర్రున తిరుగుతుంటే ఇంతలో రిషి వస్తాడు. హార్ట్ చేజారడంతో మళ్లీ గట్టిగా పట్టుకుంటుంది వసుధార. ఏంటీ హడావిడి.. ఏంటా గెంతులు అని రిషి అంటే.. ఆనందం అని వసుధార అంటుంది. ఎందుకు అని రిషి అడిగితే.. ఏదేంటీ సార్.. ఎందుకు అంటారేంటీ.. మన మధ్య ఉన్న సంఘర్షణకు ఈరోజు ముగింపు ఇచ్చారు కదా.
ఇప్పుడు మనకు ఎలాంటి బాధలు కూడా లేవు అని వసుధార అంటుంది. ఈ ఆనందంలో ఒక్క విషయం మర్చిపోతున్నావ్ అని రిషి అంటే.. ఏంటీ సార్ అని వసుధార అంటుంది. నేను నీ భర్తను అని మాత్రమే చెప్పాను. కానీ నువ్వు నా భార్యవని అనలేదుగా అంటాడు రిషి. అవును వసుధార. బాగా ఆలోచించూ అని రిషి అంటే.. జగతి మేడమ్ చెప్పినదాన్ని అందరి ముందు ఒప్పుకున్నారు కదా.. మళ్లీ ఇలా మట్లాడతారేంటీ అని అయోమయంగా అంటుంది వసు.

మార్చి 3వ ఎపిసోడ్ లో..
ఏదైమైనా అందరి నోర్లు మూయించావ్. అవును వసుధార ఏంటీ ఇందాకా ఏడుస్తూ వెళ్లింది. ఏమైంది అని అడుగుతాడు మహేంద్ర. తనకు వాస్తవం చెప్పాన్ డాడ్ అంటాడు రిషి. వాస్తవం ఏంటీ అని మహేంద్ర అడిగితే.. డాడ్ వసుధారకి నేను భర్తనని అందరిముందు తన గౌరవం కాపాడటం కోసం చెప్పాను. కానీ వసుధార నా భార్య కాదన్న వాస్తవం కూడా తనకు చెప్పాను అని అంటాడు రిషి.
దీంతో బిత్తరపోయిన మహేంద్ర ఏంటీ రిషి.. నాకు అర్థం కాలేదు. మళ్లీ చెప్పు.. నువ్వు తన భర్తవి అయినప్పుడు.. తను నీకు భార్య కాకుండా ఎలా ఉంటుంది అని మహేంద్ర అడుగుతాడు. డాడ్ కాస్తా జాగ్రత్తగా ఆలోచించండి.. తనకు తానుగా మెడలో వేసుకున్న తాళికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను చెప్పండి.. అని రిషి అంటాడు. మై గాడ్ రిషి నువ్వు ఇలా ఆలోచించావా.. అని మహేంద్ర అంటే.. ఇందులో తప్పేముంది అని రిషి అంటాడు. వసుధారకు కూడా ఇలానే చెప్పావా ఏంటీ అని మహేంద్ర అంటే.. ఇంతకన్నా స్పష్టంగా చెప్పాను అని రిషి అంటాడు.

మార్చి 4వ ఎపిసోడ్ లో..
ఇంకేంటీ జగతి.. కొత్త కోడలు గృహ ప్రవేశం ఎప్పుడు చేస్తుంది అని దేవయాని అంటే.. ఆ గడియలు వస్తే.. తప్పక వస్తుంది కదా అక్కయ్యా అని జగతి అంటుంది. ఆ గడియలు ఎప్పుడు వస్తాయి.. ఏంటీ ప్లానింగ్స్ అని అడుగుతున్నా దేవయాని అంటుంది. ప్లానింగ్స్ అంటూ ఏం ఉండవు అక్కయ్యా.. జరిగే వాటిని జరగనివ్వాలి అంతే.. అని జగతి అంటే.. ఇంకా ఏం జరుగుతుందని ఊహిస్తున్నావో అని దేవయాని అంటుంది.
మీరు ఏం జరగొద్దని ఊహిస్తున్నారో అదే జరుగుతుందని ఊహిస్తున్నాను అని జగతి అంటుంది. మాటలు బాగానే మాట్లాడతావులే.. ఎంతైనా పంతులమ్మవు కదా అన్న దేవయాని మనసులో.. అందరి ముందు వసుధార నా భార్య అన్నంత ఈజీ కాగు ఇక్కడికి రావడం.. ఇక్కడున్నది దేవయాని.. వసుధార ఈ ఇంట్లో ఎలా అడుగుపెడుతుందో.. నేను చూస్తాను అని ఆలోచిస్తుంది దేవయాని. అది చూసి ఏం ఆలోచిస్తున్నారు అక్కయ్య అని జగతి అడుగుతుంది.


Click it and Unblock the Notifications











