Guppedantha Manasu Weekly Roundup: రిషితో జగతి ఎమోషనల్.. అత్తింట్లో వసు.. అయోమయంగా దేవయాని
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.
ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మార్చి 6వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మార్చి 6వ ఎపిసోడ్ లో..
ఈరోజు చేసింది తప్పు అనను. గతంలో చేసినవి కరెక్ట్ అనుకోలేను. నేను ఒకటి నమ్మితే గట్టిగా నమ్ముతాను మేడమ్. అది మనిషి అయినా.. మాట అయినా సరే మేడమ్. రోజులు మారితే గాయాలు కూడా మారతాయి అంటారు. కానీ మనసుకు అయిన గాయం ఎప్పటికీ మానదు మేడమ్ అని రిషి అంటాడు. వసుని ఎప్పటికీ క్షమించలేవా అని జగతి అడుగుతుంది.
ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం నా దగ్గర లేదు అని రిషి అంటాడు. రిషి రోజులు మారితే గాయాలు మానవని అన్నావ్ కదా.. కొన్నింటిని కొందరు తట్టుకోగలరు. బాధల్ని మనసులో దాచుకోగలరు (తల్లిగా నేను దాచుకుంటున్నాన్న అర్థంలో). కానీ కొందరు కాదుగా.. (వసుధార అలా కాదు అన్న అర్థంలో) వసుకి నా పరిస్థితి రాకూడదు రిషి అని చాలా ఎమోషనల్ గా అంటుంది జగతి.

మార్చి 7వ ఎపిసోడ్ లో..
రిషి, వసుధార ఇద్దరు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటారు. మంచి రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. అప్పుడే తేరుకున్న రిషి రమ్మన్నాను అంటే.. గాల్లో పరుగులు పెట్టమనలేదు. నెమ్మదిగా రావొచ్చుగా అని పదా ఒక చోటుకి వెళ్లాలి అని రిషి అంటాడు. ఎక్కడికి సార్.. నా అవతారం చూశారా రెండు నిమిషాలు టైమ్ ఇవ్వండి. రెడీ అయి వస్తాను అని వసు అంటుంది. సరే అని రిషి అంటాడు.
అప్పుడు ఇద్దరు పక్కపక్కనే నడుచుకుంటూ రావడం చూసి చక్రపాణి సంతోషిస్తాడు. జంట బాగుంది, నా దిష్టే తగిలేలా ఉంది. దేవుడు వీళ్లను చల్లగా చూడాలి అని ఆశీర్వదిస్తూ పొంగిపోతాడు. మరోవైపు ఫణీంద్ర పోన్ చూసుకుంటూ ఉంటే దేవయాని రగిలిపోతుంది. దేవయాని అప్పటి నుంచి చూస్తున్నాను ఏంటీ నీ సమస్య అని ఫణీంద్ర అడుగుతాడు. వెంటనే కోపంగా సమస్య నాది కాదండి. రిషిది అని దేవయాని అంటుంది.

మార్చి 8వ ఎపిసోడ్ లో..
అమ్మా వసుధా నువ్వు చదువులో మంచి స్టూడెంట్ వి. అలాగే జీవితంలో కూడా నువ్వు ఒక మంచి భార్యవి అవుతావ్ అని మినిస్టర్ అంటాడు. అప్పుడు రిషి అన్న మాటలు గుర్తు చేసుకున్న వసుధార.. మంచి భార్య కావడం అంత ఈజీ కాదేమో సార్ అని మనసులో బాధగా అనుకుంటుంది వసుధార. నీకెంటి వసుధార. నిన్ను మించిన బార్య రిషికి ఎక్కడ దొరుకుతుంది చెప్పు అని మినిస్టర్ అంటాడు.
అప్పుడు రిషి, వసుధార ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు ప్రేమగా చూసుకుంటారు. ఏంటీ మీరిద్దరు మాట్లాడుకోవడం లేదు. ఏం తినడం లేదు. తినండి అని మినిస్టర్ అంటాడు. భోజనం తర్వాత వసుధార అదోలా ఉంటుంది. ఏంటీ అలా ఉన్నావ్ అని రిషి అడిగితే.. మీ భార్య కానీ భార్యని కదా సార్ ఇంకెలా ఉంటాను అని వసుధార అంటుంది. వీటికేం తక్కువ లేదు అని కోపంగా అనుకుంటాడు రిషి.

మార్చి 9వ ఎపిసోడ్ లో..
మినిస్టర్ గారి దగ్గర నటించాం అని రిషి అంటాడు. పాపం ఆయనకు నిజం తెలియదు. నాకు తాళి కట్టే అవకాశాన్ని లేకుండా చేశావ్ కదా. నీ విషయంలో నేను చాలా క్షమించాను. చాలా ఓర్చుకున్నాను అని రిషి అంటాడు. అవును సార్.. ఈ ఒక్క విషయంలో ఇంతలా ఎందుకు బాధ పెడుతున్నారు అని వసు అంటుంది. నీ పరిస్థితులు ఆరాటం అన్నీ నేను అర్థం చేసుకుంటాను. ఒక్కసారి నా పరిస్థితి కూడా నువ్వు ఆలోచించి ఉండాల్సింది.
ఈ గుండెకు అయిన గాయం ఎప్పుడు మానుతుందో కదా అని రిషి అంటాడు. ఇంతలో పూలు అమ్మే ఆమె అటుగా వస్తుంది. ఆమె వైపు చూసిన వసుధార ఇప్పుడు సార్ నా కోసం పూలు కొంటారా. అయినా ఈ పరిస్థితిలో అలా ఆలోచించడమే నా పొరపాటు అవుతుంది అని వసు అనుకుంటుంది.

మార్చి 10వ ఎపిసోడ్ లో..
అత్తింట్లోకి వచ్చిన వసుధార.. ధరణితో మేడమ్ రిషి సార్ లేచారా, కాఫీ ఇచ్చారా అని అడుగుతుంది. పాలు రాలేదని ధరణి సమాధానం ఇస్తుంది. ఇంతలో పాలు రావడంతో.. మీరు వెళ్లి పాలు కాచండి. నేను దేవుడి గుడిలోకి వెళ్లి దండం పెట్టుకుంటాను అని అక్కడికి వెళ్లిపోతుంది వసుధార. ఆ తర్వాత వసుధార దగ్గరికి జగతి, మహేంద్ర వాళ్లు వచ్చి ఏంటిది వసుధార అని జగతి అడుగుతుంది.
ఈ భూషణ్ ఫ్యామిలీలోకి స్వాగతం అని మహేంద్ర అంటాడు. నాన్న తీసుకొచ్చారు మేడమ్.. ఇది తప్పో ఒప్పో తెలియట్లేదు అని వసుధార అంటుంది. చాలా మంచి పని చేశావ్. ముందుకు అడుగు అయితే వేశావ్ కదా అని జగతి అంటుంది. మహేంద్ర కూడా సపోర్ట్ చేస్తూ మహా అయితే రిషి అలుగుతాడు. అంతకుమించి ఏం అనడులే అని అంటారు. నువ్వు ఇంటికి రావడాన్ని రిషి ఒప్పుకోకపోయినా మనసులో సంతోషిస్తాడు. ఒక్క అడుగు వేశావ్. వెనక్కు తిరిగి చూడకు అని జగతి అంటుంది. మరోవైపు ఇది కల నిజమా అని అయోమయంలో ఉంటుంది దేవయాని.

మార్చి 11వ ఎపిసోడ్ లో..
మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలని జగతిని రమ్మంటుంది వసుధార. వసుధార, జగతి, మహేంద్ర, ఫణీంద్ర అందరూ కలిసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి నన్ను ఎందుకు పిలవలేదు అని అడుగుతాడు. ఫణీంద్ర కూడా అదే అడగడంతో.. ప్రతి చిన్న విషయానికి ఎండీగారిని పిలవలేం కదా. ప్రాజెక్ట్ గురించి ముందు అన్ని మనం చర్చించుకున్నాకా ఎండీగారికి ప్రపోజల్ పెడతాం. పైపర్ పై రాసి ఎండీగారికి పంపించాలి కదా మేడమ్ అని జగతితో అంటుంది వసుధార.
ఈ వసు ఏంటీ నన్ను ఇరికిస్తోంది అని అనుకున్న జగతి అవును అంటుంది. మరి కాలేజీలో మీటింగ్స్ ఎందుకు పిలుస్తున్నారు. అప్పుడు కూడా ఇలాగే చేయాలి కదా అని రిషి అడుగుతు ఏం డాడ్ అని అంటాడు. అవును కదా అని మహేంద్ర అంటాడు. కాలేజీలో ప్రతి విషయం ఎండీగారి పర్యవేక్షణలో జరగాలి. బోర్డ్ మెంబర్స్ ఇలా అందరి సమయం మళ్లీ దొరకదు కదా. ఇది ఇల్లు. ప్రతి విషయంలో ఎండీగారిని ఇబ్బంది పెట్టలేం కదా అని వసుధార అంటుంది.


Click it and Unblock the Notifications











