Guppedantha Manasu Weekly Roundup: రిషి వసుధారకు ఫస్ట్ నైట్.. దేవయాని కొత్త స్కెచ్.. ముహుర్తం ఫిక్స్

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.

ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మార్చి 13వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మార్చి 13వ ఎపిసోడ్ లో..

మార్చి 13వ ఎపిసోడ్ లో..

దేవయానికి తెలియకుండా హోలీ సంబురాలు చేసుకుంటారు మహేంద్ర, జగతి, వసుధార, రిషి, ధరణి. హోలి సెలబ్రేషన్స్ లో రంగులు చల్లుకుని ఇద్దరు కలిసిపోతారు రిషి, వసుధార. మొత్తానికి జగతి వేసిన రంగుల స్కెచ్ బాగా వర్కౌట్ అవుతుంది. మరోవైపు వీళ్లంతా ఎక్కడకు వెళ్లారు. కనీసం చెప్పను కూడా చెప్పలేదు అని ఫణీంద్రతో ఫైర్ అవుతుంది.

సింపుల్ గా చెప్పాలంటే పెద్దరికం, పెత్తనం ఐస్ క్రీమ్ లాంటివి. ఫ్రిజ్ లో ఉన్నంతసేపు బాగుంటాయి. బయటకు తీస్తే కరిగిపోతాయి అని చెబుతాడు ఫణీంద్ర. ఇంతలో అంతా ఎంట్రీ ఇస్తారు. ఎక్కడికి వెళ్లారు. ఏంటిది అని దేవయాని విరుచుకుపడుతుంది.

ఇంతలో హ్యాపీ హోలి అని దగ్గరకు వెళ్తుంది వసుధార. ఆగు ఆగు అని దేవయాని అంటుంది. ఇంతలో రిషి కూడా హ్యాపీ హోలి అని హగ్ చేసుకుంటాడు. ఏంటీ వసుధారను తిడదాం అనుకుంటే రిషి ఇలా బుక్ చేశాడని అనుకుంటుంది దేవయాని.

మార్చి 14వ ఎపిసోడ్ లో..

మార్చి 14వ ఎపిసోడ్ లో..

పెద్దమ్మా సైలేంద్ర అన్నయ్యా అని రిషి అంటుంటే.. రిషి సైలేంద్ర రాడు. ఇప్పట్లో రాకపోవచ్చు. తనకు ఏదో అగ్రిమెంట్ ఉన్నట్లుంది అని దేవయాని చెబుతుంది. నాకు తెలిసి అత్తయ్యగారు తను రాకుండా ఆపుతున్నారు అని ధరణి మనసులో అనుకుంటుంది. అన్నయ్యకు రావడం లేటు అవుతుంది అంటే.. వదిననే అక్కడికి పంపించొచ్చు కదా అని రిషి అంటాడు.

గుడ్ ఐడియా అని మహేంద్ర అంటే.. అన్నంత ఈజీ కాదు మహేంద్ర. అక్కడికి వెళ్లడానికి చాలా తతంగం ఉంటుంది కదా అని దేవయాని చిరాకుగా అంటుంది. మేడమ్ అదంతా ఒకప్పుడు ఇప్పుడు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది అని వసుధార అంటుంది. దీంతో మరింతగా రగిలిపోయిన దేవయాని.. ధరణీ కూరల్లో కొంచెం ఉప్పు కారాలు తగ్గించు.

ఆరోగ్యాలకు మంచిది కాదు. చేసే పనుల మీద వంటల మీద శ్రద్ధ పెట్టు అని అరుస్తుంది. పైకి వస్తున్న బాధను ఆపుకుంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది ధరణి. వంట గదిలోకి వెళ్లి ఒక్కతే ఏడుస్తూ ఉంటుంది.

మార్చి 15వ ఎపిసోడ్ లో..

మార్చి 15వ ఎపిసోడ్ లో..

వ్రతానికి కావాల్సినవి నేను తెప్పించాను. నువ్వు కంగారు పడకు జగతి అని దేవయాని చెబుతుంది. వసుధార, రిషి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇదే కదా నాకు కావాల్సింది అని దేవయాని అనుకుంటుంది. వదిన ప్రవర్తన తేడాగా ఉంది అని మహేంద్ర అంటే.. అవును మహేంద్ర అక్కయ్య ఏం చేసినా అందులో ఏదో ఉంటుంది అని జగతి అంటుంది.

అయినా అన్నయ్యా వదిన వ్రతం చేస్తారేమో అని సర్దిచెప్పుకుంటారు. కానీ ఏదో ఉందని అనుకుంటారు. మరోవైపు వ్రతానికి అన్నీ సిద్ధం చేస్తారు దేవయాని, జగతి. ఇల్లంతా కళగా కనిపిస్తోంది కదా. ఇంట్లో ఏదైనా పూజ జరిగితే ఆ కళే వేరు. మనసుకి ఆనందంగా ఉంటుంది. మీరు నన్ను గయ్యాళిలా చూస్తారు. కానీ మీరు అనుకున్నంత గయ్యాళిని కాదు.

నేను ఈ వ్రతాన్ని మనం ఇద్దరం కలిసి ఎలాంటి ఆటంకం లేకుండా జరిపిద్దాం సరేనా అని జగతితో అంటుంది దేవయాని. ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు అని జగతి అంటే.. చెప్పాలి కదా అని తనవెంట తీసుకెళ్తుంది దేవయాని.

మార్చి 16వ ఎపిసోడ్ లో..

మార్చి 16వ ఎపిసోడ్ లో..

బట్టలు మార్చుకోకముందు ఏం జరిగిందే రిషి గుర్తు చేసుకుంటాడు. వసుధార ప్రేమకు ఎవరు అవసరం లేదు. రెండు మనసులు ఉంటే చాలు. కానీ పెళ్లికి రెండు కుటుంబాలు ఉండాలి. ప్రేమకు సాంప్రదాయం అవసరం లేదు. కానీ పెళ్లికి కావాలి. నువ్వు ఒకటి అనుకున్నావ్. ఒక పరిస్థితులో తాళి వేసుకున్నావ్. నువ్ ఒకటి నమ్మావ్.

ఆ నమ్మకాన్ని నేను గౌరవించాను. అది నీ మీద మన ప్రేమ మీదున్న గౌరవంతోనే. నమ్మకం నిలబెట్టడం ఇంత కష్టమా అనిపిస్తోంది. నమ్మకాన్ని గౌరవించడం బాధపెడుతుంది కదా వసుధార అని రిషి అంటాడు. సార్ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు కదా అని వసుధార అంటుంది.

అనుకోవాలి వసుధార. అదే కదా జీవితం. సమస్య నీది నాది అనే పరిధిని దాటి ఎక్కడికో వెళ్తోంది. ఎంత మందిని నమ్మిద్దాం. ఎంత మందికి అబద్ధాన్ని నిజంగా చూపిద్దాం. ఆఖరికి దేవుడి పూజలో కూడా అయితే ఎలా అని ఆవేదనగా అంటాడు రిషి.

మార్చి 17వ ఎపిసోడ్ లో..

మార్చి 17వ ఎపిసోడ్ లో..

దేవయాని మేడమ్ నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది కదా అని వసు అంటే.. ఆవిడ అంతే.. నాకు అలవాటు అయిందని ధరణి చెబుతుంది. అయినా ఏంటీ మేడమ్ అని పెద్ద అత్తయ్య, అక్కయ్య, చిన్న అత్తయ్య అని వరుసలు పెట్టి పిలిస్తే కదా బంధం దగ్గర అవుతుంది అని ధరణి అంటుంది.

నేను నీకు భర్తనే.. నువ్వు నాకు భార్యవి కాదు అన్న రిషి మాటలు తల్చుకున్న వసుధార.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాను అని వసు అంటుంది. ఎదురుచూడటం ఏంటీ రిషి నీ భర్తే కదా. కోడలిగా ఈ ఇంట్లో అన్ని హక్కులు నీకు ఉన్నాయి కదా అని ధరణి అంటుంది. హక్కుల దాకా ఎందుకులే ఇలా పిలిచే రోజు త్వరలోనే వస్తుందనుకుంటున్నా అని వసుధార అంటుంది.

మిమ్మల్ని అలా పిలవాలంటే రిషి సార్ అనుమతి కావాలి. ఆయన నాకు భర్తే కానీ నేను ఆయనకు భార్యని కాదు. మరి ఎలా అవుతానో తెలియాలి అనుకుని వెళ్లిపోతుంది వసుధార. తర్వాత రిషి కాలేజీకి రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ మాట్లాడుకుంటాడు. వసుధార కూడా తాళిని చేతుల్లోకి తీసుకుని మాట్లాడుకుంటుంది.

మార్చి 18వ ఎపిసోడ్ లో..

మార్చి 18వ ఎపిసోడ్ లో..

వసుధార వెళ్లేటప్పుడు జగతి కనిపిస్తుంది. రిషి ఏమైనా అన్నాడా అని జగతి అడిగితే.. రిషి సార్ అనబోతున్నారు అని వసు అంటుంది. మీ అబ్బాయో.. మా ఎమ్డీ గారో.. ఏ అవతారంలో ఉన్నారో తెలియాల్సి ఉంది అను వసుధార అంటుంది. ఇలా రిషి గురించి మాట్లాడుకుంటారు జగతి, వసుధార.

మరోవైపు ఇంట్లో దేవయాని అటు ఇటు తిరిగితే ధరణి వచ్చి ఎవరైనా వస్తున్నారా అని అడుగుతుంది. ఇది నీకు అవసరమా. నేను పిలిస్తేనే రావాలి. ఎవరు వచ్చిన నువ్వు రావొద్దు అని చెప్పి ధరణిని పంపించివేస్తుంది దేవయాని. ఇంతలో అక్కడికి పంతులు వస్తాడు. పంతులు రాగానే ఏదో ఒక విషయం చెబుతుంది దేవయాని. దీనికి రేపు, ఎల్లుండి మంచి ముహుర్తం ఉంది. ఏం నిర్ణయించుకుంటారో చెప్పండి అని పంతులు అని వెళ్లిపోతాడు.

దీనితో వసుధార నీ సంగతి ఏంటో తేలిపోతుంది అని దేవయాని అనుకుంటుంది. అయితే ఈ ముహుర్తం రిషి, వసులకు శోభనానికి అని తెలుస్తోంది. దీంతో వసుధారకు మరోసారి ఉచ్చు బిగించే ప్రయత్నం దేవయాని చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X