Guppedantha Manasu March 4th: మనోతో కలిసి రిషి వద్దకు వెళ్లిన వసు.. చంపేస్తానంటూ రాజీవ్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజురూ అద్భుతంగా సాగుతోంది. రిషి లేకపోయినా వసుధార ఆయననే తలుచుకుంటూ జీవితం గడిపేస్తోంది. ముఖ్యంగా మనో ఎంట్రీ ఇవ్వడంతో.. సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసుధార కారు పాడవుతుంది. అంతోలనే అక్కడకు మనో వచ్చి.. వసును చూసి ఆగుతాడు. ఆ తర్వాత ఏమైందని అడగ్గా.. కారు పాడైందని వసు చెబుతుంది. మీరు లోపల కూర్చోండి నేను చూస్తానంటూ వసును కారు లోపలికి పంపిస్తాడు.
Photo Credits: Disney+Hotstar
ఆ తర్వాత కారులో ఏం పాడైందో చూసి ఏవేవో చేస్తాడు. కానీ ఏం చేసినా కారు మాత్రం స్టార్ట్ కాదు. దీంతో వసుధార మెకానిక్ కు ఫోన్ చేస్తాను వాళ్లు వచ్చి చూస్తారు మీరు వెళ్లండి అని అంటుంది. మెకానిక్ కారు తీసుకెళ్తాడు కానీ మీరు అప్పటి వరకు ఇక్కడే ఉండడం ఎందుకు నేను డ్రాప్ చేస్తాను రండి అంటాడు. నేను వెళ్లే చోటుకి మీరు రాలేరు వద్ద వెళ్లండి అంటున్నా వినకుండా.. ఎక్కడికైనా సరే నేను వస్తానంటూ చెబుతాడు. నరకానికి తీసుకెళ్లినా వచ్చేస్తానంటూ వివరిస్తాడు. దీంతో సరే పదండి అంటూ వసు అతడి కారు ఎక్కుతుంది.

అయితే వాళ్లు వెళ్తుండగా మధ్యలో రాజీవ్, శైలేంద్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈక్రమంలోనే వసు, మనోలను చూస్తారు. నా మరదలు వాడితో వెళ్తుందేంటి అంటూ రాజీవ్ ఫైర్ అవుతాడు. వాడిని చంపేస్తాను.. వాడు నా మరదలితో కలిసి తిరగడం ఏంటంటూ చెలరేగిపోతాడు. శైలేంద్ర మాత్రం ఆవేశం తగ్గించుకో బ్రదర్ అంత అవసరం లేదంటూ చెప్పుకొస్తాడు. ఇప్పుడే నాకో ఆలోచన తట్టిందనగా.. రాజీవ్ ఏంటో అది చెప్పు అంటాడు. ఈ సిట్యువేషన్ ఉపయోగించుకుని నాకు ఆ మనోగాడి బాధ, నీకు వసుధార పీడ పోయేలా చేస్తానని చెప్పుకొస్తాడు.
ఏం చేయబోతున్నావో చెప్పు బ్రదర్ అంటూ రాజీవ్ తెగ ఎగ్జైటింగ్ గా అడుగుతాడు. కానీ శైలేంద్ర మాత్రం వెట్ అండ్ సీ బ్రదర్ ఎందుకు ఆవేశం అంటూ అతడిని ఆపుతాడు. ఇక ఆ తర్వాత వసు, మనోలను చూపించగా... మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం అంటూ అడగ్గానే.. రిషి సార్ దగ్గరకు అంటుంది. దీంతో మనో షాక్ అయి మరీ కారును ఆపేస్తాడు. ఏంటీ అనగానే రిషి సార్ తో నాకున్న జ్ఞాపకాలు ఉన్న చోటుకు వెళ్తున్నానంటూ చెబుతుంది. బస్తీకి వెళ్తున్నాం.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి అంటూ వివరిస్తుంది. అక్కడకు వెళ్తే తనకు రిషి సార్ తో ఉన్నట్లే అనిపిస్తుందంటూ చెబుతుంది.

ఆ తర్వాత రోడ్డు బాగా లేకపోవడంతో ఓ చోట కారు ఆపుతాడు. దీంతో వసు దిగి మీకు ఇబ్బందిగా ఉంటుంది మీరు వెళ్లిపోండి నేను క్యాబ్ లో వెళ్తానంటూ చెబుతుంది. కానీ అతడు మాత్రం నేను మీ వెంటే వస్తానంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గట్ల వెంబడి నడుచుకుంటూ వెళ్తారు. అలా నడుచుకుంటూ వెళ్లగా.. పిల్లలు కనిపిస్తారు. ఏంటి స్కూల్ కు వెళ్లలేదా అని వసు అడగ్గానే పిల్లలు ఇక్కడ స్కూల్ లేదని అంటారు. మీకు చదువుకోవాలని ఉందా అంటే అవునంటారు. అయితే మీ తల్లిదండ్రులను తీసుకురండి అని అంటుంది.
వెంటనే వెళ్లి పిల్లలు వారి పేరెంట్స్ ను తీసుకు వస్తారు. వాళ్లు రాగానే వసు మీ పిల్లలను చదువుకోవాలనుకుంటున్నారా.. వారిని చదివిస్తారా అనగానే బడి లేదు కదమ్మా అంటారు. బస్సు ఏర్పాటు చేయడమో లేక స్కూల్ కట్టించడమో మేము చేస్తామంటే.. బాగా డబ్బులు ఖర్చు అవుతాయి కదా అని అంటారు. ఆ తర్వాత కూడా వాళ్లు సందేహం వ్యక్తం చేస్తుంటే.. మనోనే అదంతా నేను చూస్కుంటానని చెబుతాడు. మీ పిల్లలకు చదువుకోవాలని ఉంది కదా చదివించండి అంటూ అంటాడు. పిల్లలు కూడా మారాం చేయడంతో వాళ్లు ఒప్పుకుంటారు. ఆ తర్వాత వసును మనో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు.
ఇంట్లోకి ఇద్దరూ వెళ్లగానే.. మహేంద్ర కనిపిస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లామని అనగానే అనుపమకు చెప్పలేదా అంటాడు. అయితే జరిగిందంతా చెప్పి బస్తీ పిల్లలు చదువుకోడానికి మనోను ఒప్పించినట్లు కూడా వివరిస్తుంది. రిషి సార్ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఏకాకిలా ఉన్న నాకు మనో సపోర్ట్ చాలా ధైర్యాన్ని ఇస్తుందని అంటుంది. ఇదంతా విన్న మహేంద్ర కూడా రేపటి నుంచి నువ్ కూడా ఈ మిషన్ ఎడ్యుకేషన్ లో భాగం అవ్వు అంటాడు. ఆ తర్వాత అనుపమ స్నాక్స్ తెచ్చి ఇస్తుంది. అవి తిన్న తర్వాత.. ఇంటికి వెళ్తానంటాడు. అనుపమ మాత్రం అతడిని ప్రేమగా చూస్తూనే ఉంటుంది. ఆయన వెళ్లిపోవడంతో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











