Guppedantha Manasu Weekly Roundup: కొత్త విలన్ ఎంట్రీ.. దొరికిపోయిన వసు, రిషి కాలేజీ పరువు గోవిందా!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మార్చి 20వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మార్చి 20వ ఎపిసోడ్ లో..
నీ ప్రేమలో ఒకసారి భవిష్యత్ బాధ్యతను మరిచిపోతావ్ అంటాడు రిషి. ఏది మరిచిపోయినా ప్రేమను మాత్రం మరిచిపోలేం సార్ అది మీరు గుర్తించాలి అని వసుధార అంటుంది. ఒక్కసారి ప్రమాదం జరిగిందని.. ప్రతిసారి అలానే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావ్. అప్పుడు నన్ను బాధపెట్టావ్ (లవ్ రెజెక్ట్ చేసి), ఇప్పుడు బాధపెడుతున్నావ్ (తాళి మెడలో వేసుకుని). నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి వసుధార అని రిషి అంటాడు. సార్ నా ప్రేమని అర్థం చేసుకోండి. నా మనసుని అర్థం చేసుకోండి. ఇప్పటికైన మన ప్రేమను అంగీకరించండి. ఇలా మౌనంగా ఎన్నాళ్లు. నాకు సమాధానం కావాలని వసు అంటుంది. నా మనసుకి సమాధానం దొరికినప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది అని రిషి వెళ్లిపోతాడు.

మార్చి 21వ ఎపిసోడ్ లో..
మీ పెళ్లి విషయం ప్రెస్ మీట్ ద్వారా తెలిసింది. అయిందేదో అయింది. పెళ్లి తర్వాత రావడాలు.. పోవడాలు, అత్తిళ్లు, పుట్టిళ్లు చీర సారే. ఇంకా చాలా సాంప్రదాయాలు ఉంటాయి కదా అని దేవయాని అంటుంది. దేవయాని అన్నమాటలకు జగతి, మహేంద్ర షాక్ అవుతారు. వెంటనే వసుధార వైపు చూస్తూ మీ అమ్మనాన్నలను రమ్మని కబురు పెట్టు అని దేవయాని అంటుంది. దీనికి ఎందుకు అక్కయ్య అని జగతి కంగారుగా అంటే.. ఇది పెళ్లయిన ఇల్లులా ఉందా.. పెళ్లి తర్వాత తంతులు, సాంప్రదాయాలు అన్నీ పూర్తి చేయాలి కదా అని దేవయాని అంటుంది. అవన్నీ ఇప్పుడు వద్దు మేడమ్ అని వసు అంటే.. చూశావా నువ్వు నన్ను ఇంకా మేడమ్ అనే అంటున్నావంటే.. దూరం ఎంతుందో అని దేవయాని అంటుంది.

మార్చి 22వ ఎపిసోడ్ లో..
రిషి కోసం వసుధార వంట చేసి కాలేజీలో వడ్డిస్తుంది. వంటలు బాగున్నాయి పెద్దమ్మ చేసిందా అని రిషి అంటే వసుధార ఫీల్ అవుతుంది. పొద్దున్నే లేచి కష్టపడి మీకు నచ్చిన వంటలన్నీ చేస్తే నా కష్టాన్ని గుర్తించలేదంటుంది వసుధార. వంటలు బాగున్నాయి థ్యాంక్స్ అని రిషి చెబుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటారు. స్పాట్ వాల్యుషన్ కి మన కాలేజీ ఎంపిక కావడం సంతోషం అని చెబుతూ ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తాడు రిషి. ఈ వర్క్ మొత్తానికి జగతి మేడమ్, మహేంద్ర సార్ ఇంఛార్జ్ గా ఉంటారని రిషి చెబుతాడు. సాయంత్రానికి జగతి, మహేంద్రలు ఇంటికి వచ్చేస్తారు. అక్కడే హాల్లో ఉన్న దేవయాని.. ఏం జగతి రిషి ఎక్కడా.. వెనుక వస్తున్నారా.. లేక షికార్లు చేసి వస్తున్నారా అని అంటుంది. అక్కయ్యా వాళ్లు ఎప్పుడు రావాలో.. ఎప్పుడు వెళ్లాలో డిసైడ్ చేయడానికి మేము ఎవరం చెప్పండి అని కోపంగా అంటుంది జగతి.

మార్చి 23వ ఎపిసోడ్ లో..
ఈ టైమ్ లో కాఫీ ఉంటే బాగుండేది అని వసుధార మనసులో అనుకుంటే.. రిషి కాఫీ కప్పుతో వస్తాడు. సగం సాసర్ లో వేసుకుని సగం కాఫీ కప్పు వసధారకు ఇస్తాడు రిషి. సార్ ఇలా మనసులో అనుకున్నాను మీరు తెచ్చారు అని వసుధార అంటుంది. వసుధార కాఫీ తాగుతూ సార్ బయట చందమామ ఉన్నాడా అని అడుగుతుంది. ఏ ఇప్పుడు అక్కడికి వెళ్లి కాఫీ తాగుదాం అంటావా. అయితే నువ్వు చందమామతో చాటింగ్ చేసుకో నేను వెళ్తాను అని రిషి పైకి లేస్తాడు. అయ్యే లేదు సార్ కూర్చోండి అని వసుధార అంటుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. ఇంతలో ఇంకో మెయిల్ ఉంది సార్. మరిచిపోయాను. మీరు వెళ్లి పడుకోండి. నేను చేస్తా అని వసుధార అంటుంది. పర్లేదు నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాలే. నువ్వు కానీ అంటూ వసుధార బెడ్ మీదకు వెళ్లి కూర్చుంటాడు రిషి.

మార్చి 24వ ఎపిసోడ్ లో..
వాల్యుషన్ బండిల్స్ గురించి మహేంద్ర, జగతిలకు జాగ్రత్తలు చెప్పి.. రిషి అందరూ ఆ సీక్రెట్ రూమ్ కు వెళ్తారు. వసుధార కూడా ఉంటుంది. కాసేపటికి ధర్మరాజు కళ్లముందే అన్ని బండిల్స్ ఆ రూమ్ లో పెట్టి తాళం వేసి సీల్ వేస్తారు మహేంద్ర వాళ్లు. తర్వాత కొద్దిసేపటికీ డూప్లికేట్ కీ తీసుకొచ్చి ఆ సీక్రెట్ రూమ్ లాక్ ఓపెన్ చేసి అందులోని పేపర్ బండిల్స్ లో మూడు తీసుకుని బ్యాగ్ లో పెట్టేసుకుంటాడు ధర్మరాజు. మరోవైపు వసుధారను వెతుక్కుంటూ జగతి వస్తూ ఉంటుంది. అయితే ధర్మరాజు ఆ సీక్రెట్ రూమ్ కు తాళం వేయకుండా రేపు పొద్దున వరకు ఎవరు చూడరు.. ఉయాన్నే వచ్చి బండిల్స్ ఎక్కడ ఆని రచ్చ చేయొచ్చు అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు. ఇంతలో సీక్రెట్ రూమ్ ఎదురుగా వసుధార కనిపించడంతో ఇక్కడే ఉన్నావా అని ఆగిపోతుంది జగతి.

మార్చి 25వ ఎపిసోడ్ లో..
ధర్మరాజు పేపర్ బండిల్స్ ను సోఫాలోనే ఉంచి.. పైకి లేస్తాడు. దీంతో రిషి, వసు పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు. ఇక ధర్మరాజు వాష్ రూమ్ కి వెళ్తూ బెడ్ రూమ్ డోర్ తీసి ఉండటంతో.. వచ్చి ఆ డోర్ లాక్ చేస్తాడు. దీంతో వసుధార, రిషి ఆ గదిలోనే ఉండిపోతారు. ఇద్దరు ఏం చేద్దాం అని వెటకారంగా వాదించుకుంటారు. ఇక ధర్మరాజు వాష్ రూమ్ కి వెళ్లి బెడ్ రూమ్ వైపుకు వస్తాడు. అప్పుడే రెండోసారి డోర్ వస్తుందో లేదో చూడటానికి అని వెళ్తుంది వసుధార. ఇంతలో బెడ్ రూమ్ డోర్ తీసిన ధర్మరాజు వసుధారను చూసి షాక్ అవుతాడు. వసుధార కూడా షాక్ అయి అలాగే నిల్చుంటుంది. రిషి మాత్రం కర్టెన్స్ వెనుక దాగి ఉండి చూస్తాడు. వసుధారను చూసిన ధర్మరాజు షాక్ తో వసుధార అని అంటాడు.


Click it and Unblock the Notifications











