Guppedantha Manasu Weekly Roundup: కథలోకి కొత్త క్యారెక్టర్.. రిషి, వసుధారను కలుపుతాడా?

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మార్చి 27వ ఎపిసోడ్ లో..

మార్చి 27వ ఎపిసోడ్ లో..

ధర్మరాజు గారే బండిల్స్ కొట్టేసారని ఎలా తెలిసింది అని రిషిని వసుధార అడుగుతుంది. డాడ్ వాళ్ల రూమ్ లో నుంచి ధర్మరాజు వస్తూ రిషికి షేక్ హ్యాండ్ ఇచ్చి దొరికిపోయాడని రిషి చెబుతాడు. ధర్మరాజు చేతికి ఉన్న సబ్బు నా చేతికి అంటుకుంది అని చెప్పిన రిషి అతన్ని ఈజీగా వదలను అంటాడు. తర్వాత ధర్మరాజును పిలిచి ఆ మూడు బండిల్స్ ఎలా వచ్చాయా అని తెగ ఆలోచిస్తున్నారు కదా అని రిషి అంటాడు. అవి దొంగతనం చేసింది మీరే అని, ఆ స్క్వాడ్ ను పిలిపించింది మీరే అని కూడా తెలుసు. మీరు ఎలా దొంగతనం చేశారో.. మేము కూడా మీలాగే మీ ఇంటికి వచ్చి దొంగతనం చేశామని రిషి చెబుతాడు. డీబీఎస్టీ కాలేజీని బ్లేమ్ చేయించడం కోసం మీతో ఎవరో ఈ పని చేయించారు. మిమ్మల్ని పోలీసులకు పట్టించొచ్చు. కానీ నేను ఆ పని చేయను. ఎందుకంటే మీరు ఒక గౌరవప్రదమైన లెక్చరర్ వృత్తిలో ఉన్నారు. అలాంటిది మీరు అరెస్టయితే మీ వృత్తికే చెడ్డపేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు చాలా కూల్ గా ధర్మరాజుకు వార్నింగ్ ఇస్తాడు రిషి.

మార్చి 28వ ఎపిసోడ్ లో..

మార్చి 28వ ఎపిసోడ్ లో..


నేను మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు మీరు నాతో ఎలా ఉండేవారు. ఇప్పుడు అలాగే ఉండండి. ఇద్దరం కొత్తగా ఉందాం. ఫ్రెష్ రిలేషన్ స్టార్ట్ చేద్దాం అని వసుధార అంటుంది. ఇప్పటివరకు జరిగినవన్నీ మర్చిపోమంటావా అని రిషి అంటే గుర్తు పెట్టుకోవద్దు సార్. ఒకవేళ గుర్తుకు వచ్చినా మైండ్ లో నుంచి వాటిని తీసేయండి అని వసుధార అంటుంది. నువ్వు చెప్పేది సాధ్యపడుతుందా అని రిషి అడిగితే.. ఎస్ సార్ మనం సాధ్యం చేద్దాం అని వసుధార అంటుంది. మరి మనం అలా ఉంటే చూసేవారికి ఎలా ఉంటుంది అని రిషి అడిగితే.. వాళ్లను ఒప్పిద్దాం. లేదా వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన కోసం తీసుకున్న నిర్ణయం. ఇందులో వారి పాత్ర ఎలా ఉంటుందో వారినే తేల్చుకోనిద్దాం అని వసుధార అంటుంది.

మార్చి 29వ ఎపిసోడ్ లో..

మార్చి 29వ ఎపిసోడ్ లో..

నన్ను నేను కాపాడుకోవడం కోసం, నా ప్రేమను గెలిపించుకోవడం కోసం మీ అనుమతి లేకుండా మిమ్మల్ని భర్తగా స్వీకరించాను అనుకుంటూ అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది వసుధార. గుండెలపై తాళితోపాటు గుండెల్లో నిజం దాచానన్న ఫీలింగ్ మిమ్మల్ని వేధిస్తోంది. ఆ భారం తొలగించేందుకే గతానికి వెళ్తున్నాను. ఈ ప్రయాణం మనకు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి అని వసుధార అనుకుంటుంది. ఈ సమయం గడిస్తే గతంలోకి వెళ్తాం. అంతకంటే ముందు నేను వసుధారను కలవాలి అంటూ పరుగున వసు గదివైపు రిషి వస్తుంటే రిషి కోసం వసుధార వస్తుంది. ఇద్దరు నీకోసమే అంటారు. మాట్లాడాలని కూడా ఇద్దరు ఒకేసారి అంటారు.

 మార్చి 30వ ఎపిసోడ్ లో..

మార్చి 30వ ఎపిసోడ్ లో..


వసుధారను రౌడీలు ఏడిపించడం చూసిన రిషి వాళ్లను చితక్కొట్టి తను నా భార్య అని చెప్పి తీసుకెళ్తాడు. కారులో వెళ్తుండగా.. తను నా భార్య అన్న రిషి మాటలు గుర్తు చేసుకుని వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు జగతి పని చేసుకుంటూ ఉండగా వచ్చిన మహేంద్ర.. ఏంటీ ఇంకా బయలుదేరలేదు. అవతల ఫంక్షన్ కు టైమ్ అవుతుంది. వదిన, అన్నయ్య అప్పుడే వెళ్లిపోయారు. మనమే లేట్ తొందరగా వెళ్దాం పద అని అంటాడు. నేను రాను. నువ్వు వెళ్లు అని అంటుంది జగతి. ఇంతలో అక్కడికి ధరణి రావడంతో మీ మావయ్య కూడా రెడీగా ఉన్నారు. మీరు కలిసి వెళ్లండి అని చెప్పి జగతి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత వసు, రిషి ఇంటికి చేరుకుంటారు.

మార్చి 31వ ఎపిసోడ్ లో..

మార్చి 31వ ఎపిసోడ్ లో..

వసు వెళ్లిన తర్వాత హార్ట్ ను గమనించిన రిషి ఈ పొగరు అన్నీ సగం సగం పనులే చేస్తుంది అనుకుంటూ పెన్ వెతుకుతాడు. వసుధార ఆపేసిన హెచ్ లెటర్ ను రిషి పూర్తి చేస్తాడు. ఇప్పుడు బాగుంది అనుకుంటాడు. ఇంతలో గుమ్మం దగ్గరకు వచ్చిన వసుధార.. థ్యాంక్యూ సార్.. నేను ఏది వదిలిపెట్టినా దాన్ని మీరు పూర్తి చేస్తారు. నాకు తెలుసు సార్. థ్యాంక్యూ సార్ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కాలేజీలో ఆధ్యాత్మిక ఆధునిక సంగమం మేధోమూర్తి జయచంద్ర గారికి ఆహ్వానం అంటూ బ్యానర్స్ వేలాడదీస్తూ ఉంటుంది వసుధార. అనుకోకుండా కాలు జారి పడబోతుంటే రిషి వచ్చి పట్టుకుంటాడు. అక్కడ ఇద్దరు పెనవేసుకోవడంతో రొమాంటిక్ గా సాగుతుంది ఆ సీన్.

 ఏప్రిల్ 1వ ఎపిసోడ్ లో..

ఏప్రిల్ 1వ ఎపిసోడ్ లో..

గురువు గారు మీ రాక మాకు ఎంతో సంతోషం. మీలాంటి వాళ్లు మా ఇంట్లో ఉండటం మా అదృష్టం అంటూ చాలా గౌరవంగా మాట్లాడుతుంది దేవయాని. అది విన్న జగతి, వసుధార ఒకరి మొఖాలు మరొకరు చూసుకుంటూ బిక్కం మొహం పెడతారు. అమ్మో మేడమ్.. ఈ దేవయాని మేడమ్ ఇలాంటి వాటిలో చాలా గ్రేడ్ కదా. అద్భుతంగా నటిస్తారు. అంటూ నసుగుతుంది వసుధార. నవ్వుకుంటూ మరింత చిన్నగా జాగ్రత్త వసు.. అక్కయ్యవి అసలే పాము చెవులు అని జగతి అంటుంది. తర్వాత జయచంద్రకు ఏర్పాటు చేసిన అతిథి గదిలోకి రిషి, వసుధారలు ఆయన్ని తీసుకుని వెళ్తారు. అప్పుడే వసుధార మంచం పక్కనే పడి ఉన్న చున్నీని చూస్తుంది వసుధార. వసుధార చున్నీ రిషి కాళ్ల దగ్గర్లోనే ఉంటుంది. అది తీసెయ్యమని రిషికి వసుధార సైగ చేస్తుంటే జయచంద్ర చూసేస్తాడు. ఇంతకుముందు ఈ గదిలో ఆడవాళ్లు ఎవరైనా ఉండేవారా అని సూటిగా అడుగుతాడు జయచంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X