Guppedantha Manasu March 7th: రిషిని మరిచి మను గతంపై వసు ఆసక్తి.. రాజీవ్ కుట్రకు ఏం చేయబోతుంది?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో రాజీవ్.. వసుధార, మను ఫొటోలను కాలేజీ మొత్తం అతికిస్తాడు. కొత్త ప్రేమజంట అంటూ వేసిన ఆ ఫొటోలను అతికిస్తూనే.. సారీ వసు తప్పట్లేదు... నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఇదంతా చేశానంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత కాలేజీ మొత్తం అతికించిన ఈ ఫొటోలను తన ఫోన్ లో వీడియోగా తీస్తాడు. దాన్ని శైలేంద్రకు పంపిస్తాడు. రేపటితో నువ్వు నాకు పూర్తిగా సొంతం అవుతావు వసు అంటూ చెప్పుకొస్తాడు.
ఆ తర్వాత శైలేంద్ర నేరుగా శైలేంద్ర ఇంటికి వెళ్తాడు. గదిలోకి దూరి అందులో శైలేంద్ర ఎవరో తెలియక తెగ ఇబ్బంది పడిపోతాడు. ఆ తర్వాత శైలేంద్రను గుర్తించి లేపే ప్రయత్నం చేయగా.. ఆయన కేకలు పెడతాడు. ఇంతలోనే ఆయన భార్య లేవగా.. రాజీవ్ బెడ్ కిందకు దూరుతాడు. ఎవరైనా వచ్చారా అంటూ అడగ్గా. వేతికేందుకు శైలేంద్ర భార్య బెడ్ దిగి మరీ వెతుకుతుంది. ఈక్రమంలోనే రాజీవ్ చేతి తొక్కగా ఆయన కేకలు వేస్తాడు. ఇతంలోనే కిందకు వంగి బెడ్ కింద ఎవరైనా ఉన్నారేమో చూడబోతుంది.

కానీ శైలేంద్ర మాత్రం పైకి లాగి ఇప్పుడెవరు ఉంటారు.. ఆ అనుమానాలు ఏంటి వెళ్లి నీళ్లు తీసుకు రాపో అంటూ పంపిస్తాడు. వెంటనే రాజీవ్ ను పిలచి బయటకు తీసుకు వచ్చేస్తాడు. చూడు బ్రదర్ సిస్టర్ నా చేయి ఎలా తొక్కిందో అంటూ చెప్పుకొస్తాడు. ఇప్పుడెందుకు వచ్చావని అడగ్గా... వసు, మను పోస్టర్లను కాలేజీలో ఎలా అతికించానో చూడు.. ఇది చూపించాలనే వచ్చానంటూ వివరిస్తాడు. వెంటనే శైలేంద్ర రాజీవ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్లిపోతాడు.
ఆ తర్వాత శైలేంద్ర భార్య పాలు, టాబ్లెట్ పట్టుకుని వస్తుంది. ఆ తర్వాత అతడు కనిపించగా.. ఎక్కడికెళ్లారు అనగా ఎక్కడికీ లేదులే అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత నువ్వు కాలేజీకీ రా అంటూ ఆహ్వానిస్తాడు. ఆమె మనసులో ఎందుకు రమ్మంటున్నాడు.. రేపు ఏం చేయబోతున్నాడి ఆలోచిస్తుంది. ఇక ఉదయమే కాలేజీని చూపిస్తారు. విద్యార్థులు, లెక్చరర్లు అంతా కలిసి అక్కడకు వెళ్లి మరీ పోస్టర్లను చూపిస్తారు. అయితే ఆ పోస్టర్లలో ఏం ఉందో మాత్రం వివరించరు. ఇక ఆ తర్వాత శైలేంద్ర తన భార్యను పిలుస్తాడు. కాలేజీకి వెళ్దాం అంటూ వివరిస్తాడు.

అంతలోనే దేవయాని అక్కడకు రావడం.. ఎక్కడికెళ్తున్నారంటూ శైలేంద్రను అడగడం చూపిస్తారు. భార్యను తీసుకుని పార్టీకి వెళ్తున్నావా, సినిమాకు వెళ్తున్నావా అంటూ అడుగుతుంది అనుపమ. లేదు కాలేజీకీ తీసుకు వెళ్తున్నానని.. నా భార్యను నా కాలేజీకి తీసుకు వెళ్లడంలో తప్పు లేదు కదా అంటూ అంటాడు. ఆ తర్వాత దేవయాని వద్ద ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుని మరీ వెళ్తారు. తాను వస్తాను అంటే వద్దు అంటూనే ధరణిని తీసుకు వెళ్తాడు. ధరణి ఇంటికి రాగానే అక్కడ ఏం జరిగిందో పూస గుచ్చినట్లు నీకు చెప్పేస్తుందంటూ వివరిస్తాడు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కాలేజీకి బయలు దేరుతారు.
ఆ తర్వాత అంతా కాలేజీకి వస్తారు. అక్కడకు రాగానే శైలేంద్ర, ధరణి, అనుపమ, మహేంద్రలు సహా.. కాలేజీ విద్యార్థులు అంతూ మను, వసుల పోస్టర్లను చూస్తారు. ఆ తర్వాత అక్కడకు వసు రాగా.. ఆ ఫొటోలు చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత తేలుకుని మామయ్యా.. ఇదంతా ఎవరు చేశారు.. ఇదేంటని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత మహేంద్ర కోపంగా ఆ పోస్టర్లు చింపే ప్రయత్నం చేస్తాడు. కానీ అంతలోనే శైలేంద్ర ఆయనను ఆపి కాలేజీ మొత్తం ఈ పోస్టర్లు ఉన్నాయి.. వాటిని ఎలా చించేస్తారంటూ ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత అక్కడకు మను రావడం.. ఆ పోస్టర్లు చూడడం కనిపిస్తుంది.
వెంటనే అనుపమ.. మను ఈ పోస్టర్లు ఏంటి అని అడుగుతుంది. అతడు నాకేమీ తెలియదు అని చెబుతాడు. మీకు తెలియకుండా ఈ పోస్టర్లు ఎలా వచ్చాయంటూ స్టూడెంట్స్ అంతా ప్రశ్నిస్తారు. ఏం చేయాలో పాలుపోక వసుతో పాటు మను కూడా అలాగే కోపంగా ఉండిపోతాడు.


Click it and Unblock the Notifications











