Guppedantha Manasu: రిషి ప్రాణాలా, కాలేజీ బాధ్యతలా? జగతికి బెదిరింపులు.. తెగించిన తల్లీకొడుకులు

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మే 1వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మే 1వ ఎపిసోడ్ లో..: మెడికల్ కాలేజీ లోగో తయారు చేశాం. దాన్ని మీరే ఆవిష్కరించాలి అని స్టూడెంట్స్ చెబితే రిషి సంతోషిస్తాడు. సార్ ఇది చేయమని జగతి, వసుధార మేడమ్ చెప్పి హెల్ప్ చేశారని వాళ్లు చెబితే ప్రేమగా చూస్తాడు రిషి. తర్వాత ఫణీంద్ర సార్ వాళ్ల అబ్బాయి, మా అన్నయ్య అని శైలేంద్రను పరిచయం చేస్తాడు రిషి. ఎవరైనా మీ తర్వాతే సార్ అని స్టూడెంట్స్ అంటే శైలేంద్రకు మరో షాక్ తగిలి రగిలిపోతాడు. కాదు కాలేజీనే ఫస్ట్ ప్రయారిటీ అని రిషి చెబుతాడు. లోగో ఆవిష్కరణ చేయాల్సింది నేను కాదు అని రిషి అనగానే తనతోనే చేయిస్తాడని శైలేంద్ర సంబరపడిపోతాడు. జగతీ మేడమ్, వసుధార మేడమ్ చేస్తారు అని రిషి చెప్పడంతో శైలేంద్ర కోపం కట్టలు తెంచుకుంటుంది.

Guppedantha Manasu

మే 2వ ఎపిసోడ్ లో..: రిషిని కళ్లు మూసుకోమ్మని చెప్పి చేతికి బ్రాస్ లెట్ తొడుగుతుంది వసుధార. ఇదే ఎందుకు అని రిషి అడిగితే.. మీరు సంతకాలు చేసే ప్రతిసారి దీన్ని చూస్తారు. మీ లైఫ్ లో చేసే ప్రతి సంతకంలో వసుధార ఉండాలి. అప్పుడు నేను గుర్తుకురావాలి అని వసుధార అంటుంది. ఇది ఉన్న లేకపోయినా నువ్వు ప్రతిక్షణం గుర్తుంటావ్ అని రిషి అంటాడు. తర్వాత శైలేంద్రకు మెడికల్ కాలేజీ బిల్డింగ్ ఏరియా చూపిస్తాడు రిషి. అడ్మిషన్ స్టార్ట్ అయ్యేలోగా బిల్డింగ్ రెడీ అవుతుందా అని శైలేంద్ర అడిగితే.. పూర్తయ్యేలోపు పాత బిల్డింగ్ లో క్లాసులు రన్ చేస్తాను. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను. అడ్మిషన్స్ మాత్రం ఆపను అని రిషి అంటాడు. ఈ బిల్డింగ్ ఎలా పూర్తి చేస్తావో, అడ్మిషన్స్ ఎలా ఓపెన్ చేస్తావో చూస్తాను అని మనసులో అనుకుంటాడు

మే 3వ ఎపిసోడ్ లో..: డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే క్యాప్షన్ అద్భుతంగా ఉందని జగతి అంటుంది. ఫణీంద్ర, మహేంద్ర కూడా మెచ్చుకుంటారు. శైలేంద్ర మాత్రం లోపల రగిలిపోతుంటాడు. సార్ నాదో సలహా. ఫారెన్ లో కూడా సెటిల్ అయిన మన దేశం డాక్టర్స్ ని కూడా సాయం కోరాల్సింది అని వసుధార అంటుంది. ఆ ఆలోచన కూడా చేశాను. వాళ్లను కాంటాక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నా అని రిషి అంటాడు. మీటింగ్ పూర్తయ్యాక ఫణీంద్ర, రిషి మాట్లాడుకుంటారు. అప్పుడే మహేంద్ర వచ్చి ఓ వీడియో చూపిస్తాడు. అందులో మిషన్ ఎడ్యుకేషన్ తర్వాత ఫ్రీ మెడికల్ కాలేజీ ప్లాన్ చేస్తున్న డీబీఎస్టీ కాలేజ్ ఎండీ రిషి అంటూ గొప్పగా చెబుతారు. అది చూసి శైలేంద్ర రగిలిపోతుంటాడు.

Guppedantha Manasu

మే 4వ ఎపిసోడ్ లో..: రేయ్ రిషి.. ఇక్కడే దొరికిపోయావ్ రా. పేద విద్యార్థులకు సాయం చెయ్యాలనుకుంటున్నావ.. అదే అవకాశంగా మార్చుకుని ఈ ఇంట్లోంచి.. కాలేజీ నుంచి బయటకు పంపిచేస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు. తర్వాత జగతితో ఒక ఫైల్ తీసుకురమ్మని చెబితే తీసుకొస్తుంది. ఫైల్ గురించి రిషి చెప్పబోతుంటే.. రిషి ఎప్పుడే ఎందుకు అన్ని ప్లాన్స్ చెప్పడం. ప్రాసెస్ లో ఉంది కదా కంప్లీట్ అయ్యాక చెప్పు అని జగతి అంటుంది. దీనికి ఏంటీ పిన్ని అడ్డు పడుతుంది అనుకున్న శైలేంద్ర.. పిన్నిని నువ్వు మేడమ్ అని పిలవడం నాకు నచ్చట్లేదు అని ఓ పుల్ల వేస్తాడు. దాని గురించే అది ఇదీ మాట్లాడుతుంటే.. శైలేంద్ర.. రిషిని ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు అని చెప్పి వెళ్లిపోతుంది.

మే 5వ ఎపిసోడ్ లో..: నేను నీ తల్లిని శైలేంద్ర.. నీ బుద్ధులు నాకు రాలేదు. నా బుద్ధులే నీకు వచ్చాయి. నువ్వు నా గురించి మరిచోపోయి, నువ్వు చేస్తున్న పనులు కొంచెం ఎవరి కంట పడకుండా చూసుకో అని దేవయాని అంటుంది. ఇంతలో అక్కడ కాఫీ పట్టుకుని నిల్చుని ఉన్న ధరణిని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. తర్వాత దేవయాని కూడా షాక్ అవుతుంది. ఎంతసేపు అయింది వచ్చి అని శైలేంద్ర అడిగితే ఇప్పుడే అని ధరణి చెబుతుంది. ఇలా వచ్చి మాటలు వినడమేనా. విన్నా సరే ఎవరికీ చెప్పకు అని ధరణిని బెదిరిస్తాడు శైలేంద్ర. ఇద్దరు మాటలు అనడంతో ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది ధరణి. ఇంతలో కారు వెళ్లిన శబ్దం వినిపిస్తుంది. ప్రేమ పక్షులు విహరించడానికి వెళ్లినట్లు ఉన్నాయి అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu

మే 6వ ఎపిసోడ్ లో..: శైలేంద్ర అన్న మాటలను విన్న జగతి ఆవేశంగా అరుస్తుంది. అప్పుడే డోర్ తెరుచుంటుంది. అసలు మీరు మనుషులేనా. తల్లి కొడుకులు నా కొడుకుని చంపడానికి కుట్రలు చేస్తున్నారా. నేనుండగా రిషికి ఏం జరగనివ్వను అని జగతి అంటుంది. అందుకే ఇంత ఓపెన్ గా మాట్లాడుకోవద్దని నేనంటాను. మన ప్లాన్స్ అన్ని తెలిసిపోయింది. జరిగింది మొత్తం పిన్ని వినేసింది అని దేవయానితో శైలేంద్ర అంటాడు. వినడం కాదు. చూశాను కూడా. నువ్వు ఆ వెధవకి డబ్బులు ఇవ్వడం చూశాను. నీపై మొదటి నుంచి సందేహంగానే ఉంది. ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చింది. ఇప్పుడే మీ నిజ స్వరూపం రిషికి అర్థమయ్యేలా చేస్తాను అని జగతి వెళ్లబోతుంది. ఏంటీ బెదిరిస్తున్నావా అని దేవయాని అనడంతో జగతి ఆగిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X