Guppedantha Manasu: రిషితో సంతకాలు.. తమ్ముడి పతనానికి అన్నయ్య కొత్త ప్లాన్.. ఇరుక్కున్న జగతి
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లోకి శైలేంద్ర భూషణ్ అని రిషి అన్నయ్యగా కొత్త క్యారెక్టర్ వచ్చింది. తమ్ముడు రిషిపై ప్రేమ నటిస్తూ లోపల స్వార్థం ఊగిపోతున్న శైలేంద్ర నుంచి తన కొడుకుని రిషి కాపాడుకుందా అనే అంశంతో అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి , మరోవైపు కొడుకు రిషి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు జగతిని వెంటాడుతున్న సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.
ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మే 8వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మే 8వ ఎపిసోడ్ లో:శైలేంద్ర, దేవయాని అన్నమాటలను తల్చుకుంటూ కుమిలిపోతుంటుంది జగతి. అప్పుడే వచ్చిన మహేంద్ర, వసుధార ఏమైంది అని అడుగుతారు. అయినా జగతి ఏం చెప్పకుండా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటుంది. జగతి నిన్ను ఇలా ఎప్పుడు చూడలేదు.
ఇంతలా నువ్వు ఎప్పుడు ఏడవలేదు అని మహేంద్ర అడుగుతాడు. అప్పుడే రిషి వచ్చి మేడమ్ అని పిలుస్తాడు. అది చూసిన జగతి పరుగెత్తుకెళ్లి రిషిని హగ్ చేసుకుని కన్నీరుమున్నీరు అవుతుంది. జగతి కుమిలికుమిలి ఏడిచే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. చూసే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు పెట్టించేలా ఉంది ఆ సీన్.

మే 9వ ఎపిసోడ్ లో: జగతి టెర్రస్ పై కూర్చుని కుమిలిపోతు ఏడుస్తుంది. ఇంతలో వచ్చిన రిషిని చూసి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. శైలేంద్ర, దేవయాని మాటలు తలుచుకుంటూ మరింత బాధపడిపోతుంది. అలా రిషిని పట్టుకుని జగతి ఏడవం చూసి కంగారు పడిపోతారు మహేంద్ర, వసుధార. రిషి కళ్లల్లో తల్లి మీద ప్రేమ క్లియర్ గా కనిపిస్తుంది.
తల్లిని ఓదార్చేందుకు అన్నట్లుగా జగతి చేతులు పట్టుకోవాలనుకుంటాడు రిషి. కానీ పట్టుకోకుండా చేతులను పైకి కిందకు అంటూ సందేహిస్తుంటాడు. రిషి చుట్టూ అల్లుకున్న చేతులను విడిపించుకునేందుకు రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆగిపోతాడు. అది చూసిన జగతి రిషిని వదిలేస్తుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అంతలా తల్లి ఏడవడం చూసి రిషికి కూడా కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

మే 10వ ఎపిసోడ్ లో: వసుధార వచ్చి మేడమ్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంగేజ్ మెంట్ అంటే సగం పెళ్లి అయినట్లే కదా అంటుంది. నీకో విషయం చెప్పాలి వసు అని జగతి చెప్పబోతుంటే రిషి వస్తాడు. వసుధార షాపింగ్ కు వెళ్లమని పెద్దమ్మా చెప్పింది అని వసును తీసుకెళ్తాడు. జగతి డల్ గా ఉండటం చూసి ఏమైంది, ఎంగేజ్ మెంట్ మీకు ఇష్టమే కదా అని అడుగుతాడు.
ఏం లేదు రిషి. మీకు ఎంగేజ్ మెంట్ అయితే మొదట సంతోషపడేది నేనే అని జగతి లేని నవ్వు తెచ్చుకుని చెబుతుంది. వసుధారను రిషి గదిలోకి తీసుకెళ్తే ఇక్కడికి తీసుకొచ్చారేంటీ అని అడుగుతుంది. అప్పుడు వీఆర్ ఉంగరం తీసుకుని ఇలాంటివి రెండు రింగ్స్ తీసుకోవాలి. ఒకటి వీఆర్ అని ఉండేది.. ఇంకోటి నువ్వు చెప్పు ఏంటో అంటాడు రిషి. వసు ఆలోచనలో పడిపోతుంది.

మే 11వ ఎపిసోడ్ లో: శైలేంద్ర.. రిషికి ఏమైనా జరిగితే నేను ఏమాత్రం ఊరుకోను అని గట్టిగా అరుస్తూ జగతి అంటుంది. చెప్పాను కదా పిన్నీ. నాకు కావాల్సింది డీబీఎస్టీ కాలేజీ ఛైర్మన్ సీట్. అందులో మీరే కూర్చోబెట్టాలి. లేకుంటే రిషి ప్రాణాలు ఉండవు అని బెదిరిస్తాడు శైలేంద్ర. ఈ మాటలు వసుధార విని షాక్ అవుతుంది. మరోవైపు రిషి, వసుధార కారులో వెళ్తుంటే లారీ చేత యాక్సిడెంట్ ప్లాన్ చేయిస్తాడు శైలేంద్ర. అంతేకాకుండా దాన్ని జగతిని కారులో ఎక్కించుకుని మరి చూపిస్తాడు. అది చూసి రిషి అని జగతి గట్టిగా అరుస్తుంది.

మే 12వ ఎపిసోడ్ లో: జగతిని శైలేంద్ర బెదిరించడం వసుధార వింటుంది. శైలేంద్ర నిజ స్వరూపం తెలుసుకున్న వసుధార రిషితో ఎంగేజ్ మెంట్ వద్దని చెబుతుంది. దీంతో రిషి పెద్ద గొడవ చేస్తాడు. ఎందుకు వద్దంటున్నావ్ అని రిషి అడిగితే.. తన అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాలేదు. ఈ పరిస్థితిలో వద్దని చెబుతుంది. వసుధార. ఇంట్లో అందరి ముందే వసుధార తండ్రి చక్రపాణికి కాల్ చేసి అడుగుతాడు రిషి. నిశ్చితార్థం గురించి రిషి చెప్పడంతో చక్రపాణి సంతోషిస్తాడు.
దీంతో వసుధారను నిలదీస్తాడు రిషి. ఎంగేజ్ మెంట్ కు ఒప్పుకోకుంటే ఇక మళ్లీ కనపడకు అనేసి వెళ్లిపోతాడు రిషి. జగతి దగ్గరికి వెళ్లి వసుధార మాట్లాడుతుంది. తాను విన్నదంతా చెబుతుంది. జీవితంలో ఒక్కసారి జరిగే ఎంగేజ్ మెంట్ ను భయంభయంగా చేసుకోవడం ఇష్టం లేదని వసుధార అంటుంది. రిషి గురించి ఆలోచించు. మళ్లీ గొడవలు వస్తే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. నిశ్చితార్థానికి ఒప్పుకుంటున్నట్లు చెప్పు అని జగతి అంటుంది.

మే 13వ ఎపిసోడ్ లో: నీకు నాపై నమ్మకం ఉంది రిషి. కానీ పిన్నికి నాపై నమ్మకం ఉండాలని లేదు కదా. పర్లేదు చెక్ చేసి సంతకం పెట్టమని శైలేంద్ర అంటాడు. దీంతో ఫైల్ చూసిన రిషి అంతా కరెక్ట్ గానే ఉందంటాడు. దానికి జగతి షాక్ అవుతుంది. మీరు విషయానికి కంగారుపడుతున్నారు. మనవాళ్లపై కూడా డౌట్ పడుతున్నారు. మీరిలా ప్రవర్తించడం బాలేదు మేడమ్ అని సంతకం పెట్టి వెళ్లిపోతాడు రిషి. జగతి కూడా వెళ్లిపోతుంటే పిన్నీ.. కంగారు పడ్డావా. భయపడ్డావా.
పేపర్లపై దొంగతనంగా సంతకాలు పెట్టే చీప్ ట్రిక్స్ ప్లే చేయను అని శైలైంద్ర అంటే.. అన్ని రోజులు నీవే అనుకోవద్దు. ఏదో ఒక రోజు ముగింపు వస్తుంది అని జగతి అంటుంది. నీ కొడుకుతో ఎండీ సీట్ కి ముగింపు పలికేలా చేయాలి. రేపు జరగబోయే నిశ్చితార్థంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నేను చెప్పలేను అని శైలేంద్ర అంటాడు. దీంతో రిషిని ఎలా కాపాడుకోవాలో అని జగతి ఆలోచిస్తూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











