Guppedantha Manasu: జగతికి తల్లీకొడుకుల వేధింపులు.. రిషి ప్రాణాలకు 3 రోజుల గడువు

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లోకి శైలేంద్ర భూషణ్ అని రిషి అన్నయ్యగా కొత్త క్యారెక్టర్ వచ్చింది. తమ్ముడు రిషిపై ప్రేమ నటిస్తూ లోపల స్వార్థం ఊగిపోతున్న శైలేంద్ర నుంచి తన కొడుకుని రిషి కాపాడుకుందా అనే అంశంతో అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి , మరోవైపు కొడుకు రిషి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు జగతిని వెంటాడుతున్న సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మే 15వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మే 15వ ఎపిసోడ్ లో..: వసు, రిషి నిశ్చితార్థంలో అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను రమ్మని పంతులు పిలుస్తాడు. జగతి వస్తుంటే పెద్దమ్మా మీరు రండి అని రిషి పిలుస్తాడు. దీంతో జగతి, మహేంద్ర షాక్ అయి అక్కడే ఆగిపోతారు. దేవయాని, ఫణీంద్ర వెళ్లబోతుంటే.. శైలేంద్ర అడ్డుకుంటాడు. నిజంగా నా మీద గౌరవం ఉంటే నా మాట విను. పంతాలకు పోయి సాంప్రదాయబద్ధంగా జరగాల్సింది చేయనివ్వవా. పంతాలు సాంప్రదాయాలను శాసించకూడదు. పిన్నిని అమ్మగా ఒప్పుకోకుంటే.. బాబాయ్ ను డాడ్ గా ఒప్పుకోనట్టే. కొడుకు నిశ్చితార్థం వాళ్ల చేతులమీదుగా జరగాలని ఆశ ఉంటుంది కదా. ఎందుకు వాళ్లను బాధపెట్టడమని శైలేంద్ర అంటాడు. రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. చివరిసారిగా వాడికి అమ్మగా ఉండే అవకాశం ఇస్తున్నాని జగతితో శైలేంద్ర మెల్లిగా అంటాడు. ఇద్దరూ తాంబులాలు మార్చుకుంటారు. వసు, రిషి ఉంగరాలు మార్చుకుని మురిసిపోతారు.

Guppedantha Manasu

మే 16వ ఎపిసోడ్ లో..: మేడమ్ ఏదో పొరబాటు పడి ఉంటారు అని వసు అంటే ఏం పొరబాటు అని శైలేంద్ర అంటాడు. ఏదీ లేకుండా తను అలా మాట్లాడరు కదా అని వసు అంటే.. అదే ఏ ఆధారంతో మాట్లాడారు. నేను చెప్పనా. ఆధారాలతో కాదు. అనుమానంతో మాట్లాడింది. నా మీద మా మమ్మీ మీద అనుమానంతో మాట్లాడింది. జ్యూస్ తీసుకుని రమ్మంది నేను. తీసుకొచ్చింది మమ్మీ. అంటే జ్యూస్ లో విషం కలిపి రిషిని చంపాలని ప్లాన్ చేశామా. రిషిని నా సొంత తమ్ముడిగా చూసుకున్నాను అని శైలేంద్ర అంటాడు. ఎందుకు మేడమ్ అన్నయ్యను అనుమానిస్తున్నారు. నిజంగా పెద్దమ్మా విషం పెడితే నేను సంతోషంగా స్వీకరిస్తాను. పెద్దమ్మే నా ప్రాణాలు కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను. ఈరోజు ఆవిడను అనుమానించారంటే నన్ను అనుమానించినట్లే అని రిషి అంటాడు.

మే 17వ ఎపిసోడ్ లో..: జగతిని మళ్లీ వేధిచండం మొదలు పెడతారు దేవయాని, శైలేంద్ర. రిషి, వసుధార ఇంటికి వస్తారో రారో అని భయపడుతున్నావా పిన్ని. వస్తారులే. గుడికి వెళ్లారుగా. ప్రశాంతంగా వస్తారు. లేకుంటే వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవ్నా అని శైలేంద్ర అంటాడు. శైలేంద్ర తెలుసుకుంటే వాళ్లకు ప్రమాదం అని మనసులో అనుకున్న జగతి వద్దని చెబుతుంది. అరే నేను తెలుసుకుంటా అని ధరణిని పిలిచి ఫోన్ తెమ్మంటాడు. మరోవైపు రిషి, వసుధార ఇద్దరూ వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో కాల్ రావడంతో అసలు ఏ శబ్దం ఉండకూడదు అనుకున్నాం. కానీ ఈ ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయంటూ కాల్ కట్ చేస్తాడు రిషి. కాసేపు ఇక్కడే ఉందాం అని రిషి అంటే వసుధార సరే అంటుంది. శైలేంద్ర మళ్లీ కాల్ చేస్తూనే ఉంటాడు.

Guppedantha Manasu

మే 18వ ఎపిసోడ్ లో..: రిషి, వసుధార ఇంటికి ఆలస్యంగా రావడంతో రిషిని ఏమనలేక వసుధారపై కోప్పడుతుంది జగతి. దీంతో జగతిపై కోప్పడతాడు రిషి. వసుధారల లాన్ లో కూర్చుని ఆలోచిస్తుంటే వెళ్లి రిషి మాట్లాడతాడు. మీ కోపం తగ్గిందా అని వసు అడిగితే.. అది కోపం కాదు మేడమ్ నిన్ను అలా అనేసరికి కోపం వచ్చింది. మేడమ్ నీకు హద్దులు పెట్టడం నాకు నచ్చలేదు అని రిషి అంటాడు. అమ్మ ప్రేమకి.. అంటూ ఏదో చెప్పబోయి.. ఏం లేదు సార్ మనకు ప్రమాదం జరుగుతుందేమోనని మేడమ్ భయం అని వసుధార అంటుంది. నేను అన్నమాటలకు మేడమ్ ఏమైనా బాధపడ్డారా అని రిషి అడుగుతాడు. వెంటనే జగతి అన్న మాటలు తలుచుకుంటుంది వసుధార. మేడమ్ మీద కోప్పడాలంటే నాకు మనసు రావడం లేదు. కానీ తను చేసే పనులు మాట్లాడే మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి అని రిషి అంటాడు. మేడమ్ బాధపడలేదు సార్ అని వసుధార చెబుతుంది.

మే 19వ ఎపిసోడ్ లో..: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలి. అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అదే కోరుకుంటున్నారు. అందుకే నువ్వు, వసుధార వెళ్లి ఇతర స్టేట్స్ లో కూడా మిషన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి అని శైలేంద్ర అంటాడు. లేదు అన్నయ్యా నేను అక్కడికి వెళ్లను. నేను అక్కడికి వెళితే ఇక్కడ కాలేజీని ఎవరూ చూసుకుంటారు అని రిషి అంటాడు. నేను లేనా రిషి. అందుకు నాకు అర్హత లేదా. కాలేజీని చాలా అభివృద్ధి చేశావ్. ఇతర రాష్ట్రాల్లో కూడా మిషన్ ఎడ్యుకేషన్ తో మంచి పేరు తీసుకొస్తావ్. దేశం నలుమూలలా నీ పేరు తెలియాలి అదే నా కోరిక అని శైలేంద్ర అంటాడు. సారీ అన్నయ్యా మీ మాటని నేను కాదంటున్నాను అని రిషి కాస్తా కోపం ఆపుకుంటూ అంటాడు. నీకు కాలేజీ అంటే ప్రాణమని తెలుసు రిషి. నీ ప్రాణాన్ని నా ప్రాణంగా చూసుకుంటాను అని శైలేంద్ర అంటే.. ఇది రిషికే కాదు నాకు కూడా ఇష్టం లేదు. రిషి వెళ్లిపోతే కాలేజీ రూపురేఖలే మారిపోతాయి అని ఫణీంద్ర అనడంతో శైలేంద్ర, దేవయాని షాక్ అవుతారు.

Guppedantha Manasu

మే 20వ ఎపిసోడ్ లో..: డైరెక్ట్ గా చంపేద్దామని డిసైడ్ అయి పూల కుండీ పడేలా చేయించా అని శైలేంద్ర అంటాడు. నేను ఇంత దుర్మార్గుడిని అని మా డాడీకి చెబితే ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందోనని మీ భయం. ఒకవేళా బాగున్నా.. ఈ విషయంలో బాబాయ్ కు డాడీకి ఏం గొడవలు అవుతాయోనని భయం పిన్నీ మీకు అని శైలేంద్ర అంటాడు. అందుకే రిషిని పంపించేయ్.. లేట్ చేయొద్దు. పిన్నీ తుది నిర్ణయం మీదే. వాడు ప్రాణాలతో ఉండాలా.. భూమీ మీదే లేకుండా పోవాలా.. ఎండీ సీటులో కూర్చోవాలా.. ఎక్కడొ ఓ చోట బతికింటే చాలా అని శైలేంద్ర అంటాడు. నా కొడుకుని వదిలేయ్.. ఎందుకు అలా పగబట్టావ్. అని జగతి అంటుంది. నాకంటే గొప్పగా ఎదిగాడు. ఎదుటివారి మీద ఈర్ష్య, పగ, కోపం పెంచుకోడానికి ఇవి చాలదా.. వాడిని 3 రోజుల్లో పంపిచేయ్ లేకుంటే తెలుసుకదా. ఆ సీటులో నేను కూర్చోవడం మా అమ్మ కోరిక అని శైలేంద్ర అంటాడు. దీంతో జగతి షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X