Guppedantha Manasu: గుండెను పిండేసేలా ఎపిసోడ్స్.. దోషిగా రిషి.. శైలేంద్రకు ఝలక్.. జగతికి వరం
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లోకి శైలేంద్ర భూషణ్ అని రిషి అన్నయ్యగా కొత్త క్యారెక్టర్ వచ్చింది. తమ్ముడు రిషిపై ప్రేమ నటిస్తూ లోపల స్వార్థం ఊగిపోతున్న శైలేంద్ర నుంచి తన కొడుకుని రిషి కాపాడుకుందా అనే అంశంతో అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి , మరోవైపు కొడుకు రిషి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు జగతిని వెంటాడుతున్న సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.
ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మే 22వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..
మే 22వ ఎపిసోడ్ లో..: సారథి వెళ్లి మంత్రిని కలుస్తాడు. సార్ నేను డీబీఎస్టీ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ బిల్డర్ ను సార్. రిషి సార్ తప్పు చేశారు. మీరు నమ్మరని తెలిసే ఆధారాలతో వచ్చాను అని చెప్పిన సారథి చెక్ ఇస్తాడు. ఇది మిషన్ ఎడ్యుకేషన్ చెక్ కదా అని మంత్రి అంటే.. అవును సార్.. దీన్ని నాకు అడ్వాన్స్ గా రిషి ఇచ్చారు అని సారథి చెబుతాడు. నేను నమ్మను. రిషి మీద కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పిన మంత్రి వసుధారకు కాల్ చేసి ఒక అభియోగం వచ్చింది అని చెబుతాడు.
ఏంటీ సార్ అది అని వసుధార కంగారు పడితే.. కంగారు పడకమ్మా. నేనేం నమ్మలేదు. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ను దారి మళ్లించి వేరే వాటికి ఉపయోగిస్తూ రిషి ఒక చెక్ ఇచ్చాడనదే అభియోగం. దీనిమీద క్లారిటీ కావాలి అని మంత్రి అంటాడు. సార్ అలా ఎప్పుడు జరగదు అని వసుధార అంటే.. సరే.. నువ్వు జగతి మేడమ్ ఇద్దరు కలిసి ఆఫీస్ కు రండి అని మంత్రి చెబుతాడు. జరిగింది జగతికి వసు చెబుతుంటే.. శైలేంద్ర వచ్చి వసుధార అని గట్టిగా అరుస్తాడు.

మే 23వ ఎపిసోడ్ లో..: శైలేంద్ర ఇచ్చిన వార్నింగ్ తో రిషికి ఏం జరుగుతుందో అనే భయంతో ఉంటుంది జగతి. రాత్రి కొడుకు గదిలోకి వెళ్లి పడుకుని ఉన్న రిషిని ప్రేమగా చూస్తుంది. అప్పుడే మెళకువ వచ్చిన రిషి.. ఏంటీ మేడమ్ ఈ టైమ్ లో వచ్చారు అని అడుగుతాడు. ఓసారి చూడాలనిపించింది రిషి అని వెనక్కి తిరుగుతుంది జగతి. మేడమ్ మీరు నాకు ఏదైనా చెప్పడానికి వచ్చారా. మేడమ్ మీరు ఏదో దాస్తున్నారని నాకు ఎందుకో అనిపిస్తుంది.
అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారా. చెప్పండి మేడమ్. నాకైమైనా సమస్య ఉందా అని రిషి అడుగుతాడు. రిషి అన్న మాటలు నిజం కావడంతో దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి. వాటిని తుడుచుకుంటూ ఏం లేదు రిషి అని జగతి అంటుంది. మీరు నా గురించి భయపడొద్దు మేడమ్. రేపే నేను మెడికల్ కాలేజీ ఎండీగా రాబోతున్నాను. నా కల నెరవేరే రోజు. సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నాను. మీరు ఉండగా నాకు ఏం కాదు. మీరు నాకు ఎలాంటి హానీ జరగనివ్వరు అని రిషి అంటాడు.

మే 24వ ఎపిసోడ్ లో..: ఇవాళ ప్రెస్ మీట్ లేదు మీడియా వాళ్లకు మెసేజ్ చేస్తుంది. ఆఫీస్ బాయ్ ను పిలిచి రిషి సార్ ను కాన్ఫరెన్స్ హాల్ కి రమ్మని చెప్పు అని పంపిస్తుంది. వెంటనే వసుధార దగ్గరకు వెళ్తుంది జగతి. వసు.. నాకు నిన్న మాట ఇచ్చావ్ గుర్తుందా. ఇప్పుడు అది అడగడానికే వచ్చాను అని జగతి అంటుంది. కాన్ఫరెన్స్ హాల్లో వసుధార అందరి ముందు చెప్పాల్సిన దాని గురించి, శైలేంద్ర బెదిరించిన దాని గురించి వివరంగా చెబుతుంది జగతి.
దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. రిషి సార్ కు అబద్ధం చెప్పడమా. సార్ ను మోసం చేయడం నా వల్ల కాదు. రిషి సార్ మీద నింద వేయడం. అవినీతికి పాల్పడినిట్లు నింద వేసుకుని, ఆయన ఎండీగా తప్పుకోవడం. అమ్మో ఇదంతా సరి కాదు మేడమ్. శైలేంద్ర గారికి మీరు భయపడుతున్నారు అని వసుధార అంటుంది. అలా చేయకుంటే రిషి ప్రాణాలకే ప్రమాదం వసు అని జగతి ప్రాధేయపడుతుంది.

మే 25వ ఎపిసోడ్ లో..: మా రిషి తప్పు చేయని మనిషి. ఆ నమ్మకం నాకు ఉంది అని ఫణీంద్ర అంటాడు. ఇక్కడ నమ్మకాలతో పని లేదు. సాక్ష్యాలే ముఖ్యం అన్న జగతి చెక్ తీసి చూపిస్తుంది. ఈ చెక్ మీద రిషి నీ సంతకాలు ఉన్నాయి. పైగా అవి మీ అసలు సంతకాలతో మ్యాచ్ అయ్యాయి కూడా. ఇప్పుడు చెప్పండి అని జగతి కఠినంగా అంటుంది. చెక్ మీద ఉన్న సంతకాలు చూసి షాక్ అవుతాడు రిషి. చెక్ జారీ చేసే పవర్స్ మీ ఇద్దరికే ఉంది అని మంత్రి అంటాడు. దీంతో వసుధార మనం ఈ చెక్ ఇష్యూ చేశామా. లేదు కదా అని రిషి అంటాడు.
జగతికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటుంది వసుధార. ఇది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. మనల్ని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదు. ఈ చెక్ మననం ఇవ్వలేదు అని చెప్పు వసుధార అని ఆవేశంగా పైకి లేస్తాడు రిషి. దీంతో బిత్తరచూపులు చూస్తుంది వసుధార. ఇక చూస్తుంటే తర్వాతి ఎపిసోడ్ లో రిషినే చెక్ ఇచ్చినట్లు వసుధారు చెప్పేలా ఉంది. అదే జరిగితే జగతి, వసుధార పరోక్షంగా, దేవయాని, శైలేంద్ర కుట్ర పన్ని రిషిని పూర్తిగా ముంచేసిన వాళ్లు అవుతారు.

మే 26వ ఎపిసోడ్ లో..: వసుధార కూడా చెప్పింది దీనిపై ఏమైనా చెప్పాలనుకుంటున్నావా రిషి అని మంత్రి అంటాడు. నిస్సహాయంగా, బల్లకు చేతులు ఆనించి నిలబడిన రిషి.. జగతి మేడమ్, వసుధారలు కలిసి నేను తప్పు చేశానని నిరూపించాకా చెప్పడానికి ఇక ఏముంది. తప్పు చేశాను.. మనుషుల్ని నమ్మి కచ్చితంగా తప్పు చేశాను. మోసం చేశాను.. నా మనసాక్షిని మోసం చేశాను. అడ్డంగా దొరికిపోయాను. దొరికిపోయి దోషిలా నిలబడ్డాను. మనుషుల విషయంలో నా అంచనాలు తప్పాయి. అంతకు మించిన తప్పు ఇంకేముంటుంది.
దోషిగా నేను మీ ముందున్నా. నాకు శిక్ష పడాలి. ఈ రిషీంద్ర భూషణ్ కు మీరు వేసే శిక్ష ఏంటో చెప్పండి అని రిషి అంటాడు. ఇక నుంచి నువ్వు కాలేజీ ఎండీ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. కాలేజీ బోర్డ్ తో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఏ విద్యాసంస్థల్లో కూడా ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి వీల్లేదు. ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ పదవులు చేపట్టడానికి వీల్లేదు అని జగతి కన్నీళ్లతో చెబుతుంటే రిషి గుండె మరింత బరువెక్కుతుంది.
మే 27వ ఎపిసోడ్ లో..: మిమ్మల్ని క్షమించడానికి నేను ఎవరిని. తల్లిని క్షమించే కొడుకు ఇంకా పుట్టలేదనుకుంటా. కానీ కొడుకుగా కాపాడుకుంటున్నానని కారణం చెప్పి.. వ్యక్తిగా నన్ను చంపేశావ్ కదమ్మా అని తొలి సారిగా జగతిని అమ్మా అని పిలుస్తాడు. ఒక్కసారిగా అక్కడ నిశబ్దం ఏర్పడి స్థంభించిపోయినట్లుగా ఉంటుంది. అమ్మా అని పిలిచినందుకు జగతి ఆశ్చర్యంగా సంతోషిస్తూ నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా రిషి అని అంటుంది.
జీవితంలో ఈ పిలుపు మీరు వినలేదనే బెంగ మీకు ఉండకూడదని పిలిచాను. ఇక నేను మీ జీవితాల్లోకి రాను అని తెగేసి చెబుతాడు రిషి. శిక్షించమంటే వరం ఇచ్చి వెళ్తున్నావా రిషి అని జగతి అంటుంది. డాడ్ ని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్లిపోతాడు రిషి. దీంతో జగతి రోడ్డుపైన కూలబడి కుమిలి కుమిలి ఏడుస్తుంది. రిషి వెంటే వెళ్లిన వసుధార హగ్ చేసుకుంటుంది. ఇది ధృతరాష్ట కౌగిలి వదులు వసుధార అని రిషి విడిపించుకుంటాడు. వసు అలాగే పట్టుకోవడంతో బలవంతంగా విడిపించుకుని అటు తోసేస్తాడు. నన్ను ముట్టుకోకు, తాకకు, నీకు ఆ అర్హత లేదు అని రిషి అంటాడు.


Click it and Unblock the Notifications











