Guppedantha Manasu: జైళ్లో రిషి.. శైలేంద్రకు దేవయాని వార్నింగ్.. మహేంద్రను చంపేందుకు ప్లాన్
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లోకి శైలేంద్ర భూషణ్ అని రిషి అన్నయ్యగా కొత్త క్యారెక్టర్ వచ్చింది. తమ్ముడు రిషిపై ప్రేమ నటిస్తూ లోపల స్వార్థం ఊగిపోతున్న శైలేంద్ర నుంచి తన కొడుకుని రిషి కాపాడుకుందా అనే అంశంతో అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవి , మరోవైపు కొడుకు రిషి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు జగతిని వెంటాడుతున్న సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.
ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే మే 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

మే 29వ ఎపిసోడ్ లో: మీ ప్రేమ చాలా గొప్పది. ఏ రోజుకైనా రిషి తిరిగి వస్తాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు అని జగతి అంటుంది. అది కల మేడమ్, కల. సార్ ఇక తిరిగి రారు. మనం తన మనసుని ముక్కలు చేశాం. అందుకే మన బంధానికి ముగింపు చెప్పి వెళ్లిపోయారు. దానికి సాక్ష్యం ఇదే మేడమ్ అని రిషి ఇచ్చిన ఎంగేజ్ మెంట్ రింగ్ జగతికి చూపిస్తుంది వసు. మీరు చెప్పినట్లు చేస్తే రిషి సార్ దక్కుతారనుకున్నాను. కానీ ఇలా ఎవరికీ కాకుండా ఒంటరివాడై వెళ్లిపోతాడనుకోలేదు.
మీరు నన్ను గురుదక్షిణ కోరి నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు అని వసుధార అంటుంది. వసు అని జగతి అంటుంటే. మేడమ్ ప్లీజ్ అంటూ దండం పెట్టిన వసు.. శిష్యులకు ఇచ్చే ప్రతిఫలం ఏదైనా ఉంటే మీరు నన్ను మళ్లీ కలవాలని చూడకండి మేడమ్. నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. రిషి సార్ లాగే నేను కూడా అందరికీ దూరంగా వెళ్లిపోతున్నాను అని చెప్పేసి వెళ్లిపోతుంది వసుధార.

మే 30వ ఎపిసోడ్ లో: నిజం తెలిసిన వెంటనే బాబాయ్ ను మట్టిలో కలిపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. దీంతో జగతి అల్లాడిపోతుంది. అనంతరం ఛా.. ఎంత పెద్ద ప్లాన్ చేశాను. అంతా పాడైంది. చివరికీ ఎండీ సీటు పిన్ని చేతుల్లోకి వెళ్లింది. రిషిని అడ్డం పెట్టుకుని పిన్నిని బెదిరించాను. పిన్నీకి ధైర్యం చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు పిన్ని మాట వినదు. ఈలోపు రిషిగాడు తిరిగి వస్తే ఎలా.. నేను అనుకుంది జరగాలంటే.. రిషిగాడిని భూమ్మీద ఉండకూడదు అనుకుంటాడు శైలేంద్ర.
ఇంతలో కాల్ వస్తే.. మేము ఇప్పుడే రిషిని చూశాం సార్. ఏం చేయమంటారు అని ఓ రౌడీ అడుగుతాడు. చంపేయండి. వాడు తప్పించుకోకూడదు. పని పూర్తి చేసి రండి. జీవితంలో చూడని డబ్బు ఇస్తాను. ఏ ఎంక్వైరీలో కూడా దొరకొద్దు. ఎవరు చూడకూడదు అని శైలేంద్ర తమ్ముడిని చంపమని చెబుతాడు. దీంతో సరే సార్ అని రౌడీలు అంటారు.

మే 31వ ఎపిసోడ్ లో: వీధిలో ఒంటరిగా రిషి నడుచుకుంటూ వస్తాడు. రిషికి ఎదురుగా ఓ వ్యక్తిని తరుముకుంటూ ముగ్గురు రౌడీలు (శైలేంద్ర మనుషులు) వస్తుంటారు. సార్ కాపాడండి సార్ ప్లీజ్ అని రిషి వెనుక దాక్కుంటాడు పరిగెత్తుకొచ్చిన మనిషి. ఏరా వీడు నిన్ను కాపాడతాడు అది మేము చూడాల. వీడి ముందే నిన్ను చంపేస్తాం. వాడు ఆపుతాడో లేద్దో చూద్దాం అని రౌడీ అంటాడు.
దీంతో ఆ ముగ్గురితో రిషి ఫైట్ చేస్తుంటే ఉంటాడు. ఇంతలో రిషి వెనుక ఉన్న మనిషి కత్తితో రిషిని పొడుస్తాడు. రేయ్ ఏంట్రా అలా పొడిచావ్ అని కింద పడిన వ్యక్తి లేచి అంటాడు. రిషి వెనుకే ఉన్న మరో రౌడీ కత్తి తీసుకుని మళ్లీ పొడుస్తాడు. దీంతో రిషి బలహీనం అయిపోతాడు. ముందు ఉన్న రౌడీ కూడా కత్తితో పొడుస్తాడు. దీంతో స్పృహ తప్పి కిందపడతాడు రిషి. చనిపోయాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని వెళ్లిపోతారు రౌడీలు.

జూన్ 1వ ఎపిసోడ్ లో: ఎన్నిసార్లు ప్రయత్నించినా జగతిని కలవడానికి వసుధార ఒప్పుకోలేదు. వసుధార తన ప్రేమను తిరిగి పొందుతుందా. ప్రశ్నలు చాలానే ఉన్నాయి. పదండి ఏం జరుగుతుందో చూద్దాం అని అసలు కథలోకి తీసుకెళ్తారు. మహేంద్ర పేపర్ చదువుతుంటే జగతి వచ్చి కాఫీ తీసుకోమంటుంది. శైలేంద్ర చూడనట్లుగా ఉంటే తనతో మాట్లాడమని మహేంద్రను బతిమిలాడుకుంటుంది జగతి.
విసుగు చెందిన మహేంద్ర కోపంగా పేపర్ కింద పడేసి.. అమ్మా ధరణి నాకు కాఫీ పంపించమ్మా అని వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన దేవయాని, శైలేంద్ర మూడేళ్లు గడిచిన పిన్నితో బాబాయ్ మాట్లాడలేదు. మనకు కాలేజీ ఎండీ సీటు దక్కలేదు అని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు జగతితో జాగ్రత్తగా ఉండాలి. ఎదురు తిరిగితే మనకు డేంజర్ అని దేవాయని అంటుంది. రిషి, వసులనే తప్పించిన వాన్ని పిన్నిని పంపించలేనా. ఆల్రెడీ ఓ ప్లాన్ ఉందని శైలేంద్ర అంటాడు.
జూన్ 2వ ఎపిసోడ్ లో: స్టూడెంట్స్ క్రమశిక్షణగానే ఉన్నారు. ఆమె ఏంటీ అలా చెప్పింది అనుకుని క్లాస్ స్టార్ట్ చేస్తుంది వసుధార. ఇంతలో అక్కడికి మరో లెక్చరర్ వచ్చి తన పేరు కొదండ పాణి అని చెప్పి, మీరేంటీ ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నారు అని అడుగుతాడు. ఇది నా క్లాస్ మీరు బయటకు వెళ్లండి అని చెబుతాడు. కొత్తగా జాయిన్ అయినా రోజే ఇలా చేస్తారా.. టైమ్ టేబులు తెలియదా.. ఫాలో అవ్వరా.. టైమ్ టేబులే ఫాలో అవ్వడం రాదు వీళ్లు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో.
అయినా మిమ్మల్ని కాదు లెక్చరర్స్ లేరని ఎవరినీ పడితే వాళ్లను తీసుకురావడం కాలేజీ దురదృష్టం అంటూ వసుధారను నానా మాటలు అంటాడు ఆ లెక్చరర్. అది విన్న స్టూడెంట్స్ ఎగతాళిగా నవ్వుతుంటారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిన వసుధార ప్రిన్సిపాల్ ను కలిస్తుంది. వేరే వాళ్ల క్లాస్ కి నన్నెందుకు పంపించారని అడిగితే.. నేను మీ క్లాసుకే పంపించాను అని ప్రిన్సిపాల్ అంటాడు. ఇక్కడ స్టఫ్ లోనే సమస్య ఉందని అర్థమైంది అని వసుధార అంటుంది. అదేం అర్థం కాకా చూస్తాడు ప్రిన్సిపాల్.

జూన్ 3వ ఎపిసోడ్ లో: రిషిని ఇంటి నుంచి పంపించడం వల్ల ఒరిగింది ఏం లేదని, జగతిని తక్కువగా అంచనా వేశానని, ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అవుతాడు శైలేంద్ర. రిషి తిరిగి వస్తే అందరూ కలిసిపోతారు. జన్మలో డీబీఎస్టీ కాలేజీ ఎండీ సీటు నీకు దక్కదు అని దేవయాని అంటుంది. రిషిని చంపించిన విషయం దేవయాని దగ్గర దాచిపెట్టిన శైలేంద్ర.. ఎండీ సీటు దక్కించుకోవాలంటే మహేంద్రను చంపేయడం ఒక్కటే పరిష్కారం అని తల్లితో అంటాడు.
దీంతో దేవయాని షాక్ అవుతుంది. ఎన్ని ఘోరాలు చేసిన జగతి ఎదురుతిరగకపోవడానికి కారణం మహేంద్ర. అతడి అడ్డు తొలగిపోతే జగతి పులిగా మారిపోతుంది. అప్పుడు ఆపడం మన తరం కాదు. మహేంద్రకు ఏదైనా జరిగితే తండ్రి కూడా గుండె ఆగి చచ్చిపోతాడు. మనకు కావాల్సింది దక్కే వరకు ఎదురుచూద్దాం. తొందరపడి పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. అయినా రిషి వస్తాడంటావా అని దేవయాని అంటే.. వాడు ఉంటే కదా రావడానికి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర.


Click it and Unblock the Notifications











