For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: రిషికి కోసం వసుధార.. మినిస్టర్ దగ్గరికి వెళ్లనున్న జగతి-మహేంద్ర!

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

   అక్టోబర్ 31వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 31వ ఎపిసోడ్ లో..

  తల్లి ప్రేమ కోసం తండ్రి ప్రేమను దూరం చేసిన దాన్ని అని బాధగా ఉంది. మీరు నన్ను క్షమించాలి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను అని వసుధార అంటుంది. మన మధ్య ఇంకా ఎలాంటి అడ్డంకులు లేనట్టేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రిషి. దీంతో ఉండవు అని ఆశిస్తున్నా సార్. మీ మనసు చెప్పింది మీరు వినండి. మిమ్మల్ని మారమని చెప్పే హక్కు నాకు లేదు. కానీ మీరు మారితే సంతోషపడే క్షణాలను నేను ఆస్వాదిస్తాను అని వసుధార అంటుంది. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్లు పక్కపక్కనే ఉన్నా ఏదో అడ్డుతెర ఉన్నట్లు ఉంది. కానీ ఇప్పుడు అది తొలగిపోయింది. ఇక మనమధ్య ఏ విషయంలోనూ అభిప్రాయబేధాలు రావని ఆశిస్తున్నా అని రిషి అంటే అవును అని మాట ఇస్తుంది వసుధార. ఇద్దరు మళ్లీ అమ్మవారికి మొక్కుతారు. మహేంద్ర సార్ కి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను అలా అని రిషి సార్ ను బాధపెట్టలేను.. ఆ తల్లికొడుకులను నువ్వే కలపాలి అమ్మా అని అమ్మావారికి ప్రార్థిస్తుంది వసుధార. ఇంతలో వసుధారపై పూల వర్షం కురిపిస్తాడు రిషి. చాలా సంతోషంగా ఉంది అంటాడు. తర్వాత రిషిపై కూడా పూలు వేస్తుంది వసుధార.

  నవంబర్ 1వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 1వ ఎపిసోడ్ లో..

  కాలేజీలో వసుధార పరిగెడుతుంటే పట్టుకునేందుకు రిషి ఆమె వెనుకే ఫాలో అవుతాడు. పరిగెత్తుతుండగా.. వసుధార చున్నీ రిషి కాలి కింద పడి దొరికిపోతుంది. నువ్ సాధించావ్.. యూనివర్శిటీ టాపర్ అయ్యావ్.. ఇదిగో గిఫ్ట్ అని ఇస్తాడు రిషి. మీరే నాగు గిఫ్ట్ సార్ అని వసుధార అంటుంది. ముందు ఓపెన్ చేసి చూడు అని రిషి అంటే.. థ్యాంక్స్ సార్ అని వసుధార అంటుంది. దీంతో అంతేనా అని రిషి ముద్దుగా అడగ్గానే.. హగ్ చేసుకుంటుంది వసుధార. (నో అనుకుంటూ ఉలిక్కిపడి లేస్తుంది దేవయాని). ఇదంతా కలగంటుంది దేవయాని. ఇదంతా నా కలా.. ఇలా ఎప్పుడైనా జరగొచ్చు.. వీళ్ల ప్రేమకథకు అందమైన ముగింపు ఇస్తాను అని అనుకుంటుంది దేవయాని.

  నవంబర్ 2వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 2వ ఎపిసోడ్ లో..

  కాలేజ్ లో లంచ్ టైం అయిందని మాట్లాడుకుంటారు రిషిధార. ఈ క్రమంలో ఆకలిగా లేదంటాడు రిషి. ఇంతలో రిషి ఆకలి తెలుసుకునేది పెద్దమ్మ ఒక్కతే అని ఎంట్రీ ఇస్తుంది దేవయాని.
  నేను ఎక్కడా ఉన్నా ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తాను. అందుకే క్యారియర్ తీసుకొచ్చాను. చిన్నప్పటి నుంచి నీ ఆకలేంటో.. నాకు తెలుసు కదా అని అంటుంది దేవయాని. దీంతో చూశావా వసుధార.. పెద్దమ్మ మనసు ఎంత మంచిదో అని రిషి అంటాడు. అంతా నటన సార్.. మీరెప్పుడు తెలుసుకుంటారో ఏంటో.. అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇంతలో ఏంటీ వసుధార అలా చూస్తున్నావ్.. నా ప్రేమలో లోపం ఉందని నీకు అనిపిస్తోందా.. అని దేవయాని అంటే.. రిషి కలుగజేసుకుని ఈ విషయంలో ఎవ్వరూ ఏం చెప్పినా నమ్మను.. మీ ప్రేమలో లేపం లేదని నాకు తెలుసు అని అంటాడు. వసుధారకు నా గురించి తెలియదా ఏంటీ నాన్నా.. కొత్తగా చెబుతావ్.. ఏం వసుధార నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా.. అలా చూస్తావేంటి.. భోజనాలకు సిద్ధం చేయి అని దేవయాని అంటే.. నేను వడ్డిస్తాను మీరు తినండి మేడమ్ అని వసుధార అంటుంది.

  నవంబర్ 3వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 3వ ఎపిసోడ్ లో..

  రిషి, వసుధార కారులో ప్రయాణిస్తుంటారు. థ్యాంక్స్ సార్ అని వసుధార అంటే.. థ్యాంక్స్ చెప్పుకునేంత దూరం మనమధ్య లేదంటాడు రిషి. మన మధ్య థ్యాంక్స్.. సారీ అనే విషయాలకు ఛాన్స్ లేదంటాడు. మనసు తెలుసుకున్న వాళ్లు మనతో జీవితాంతం ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో తెలుస్తోంది ఇప్పుడు. ప్రతి ఆడపిల్లకు ఇలాంటి అదృష్టం దొరికితే బాగుంటుంది అనిపిస్తోందని వసుధార అంటే.. సడెన్ గా కారు ఆపిన రిషి.. వసుధార చేతిని చేతిలోకి తీసుకుని నన్నేదో మునగ చెట్టు ఎక్కిస్తున్నావ్ అని అంటాడు. అదేం లేదు సార్.. మీలాంటి జెంటిల్ మెన్ ఒక్కరే ఉంటారు. అందరికీ అదృష్టం ఉండదు కదా అని వసుధార అంటుంది. వసుధార అలా అనడంతో కొంపదీసి ఈ జెంటిల్ మెన్ ను అందరికీ పంచుతావా ఏంటీ అని సెటైర్ వేస్తాడు రిషి. అందరికీ ఎందుకు పంచుతాను. అదృష్టాన్ని ఆస్వాదిస్తానని వసుధార అంటుంది.

   నవంబర్ 4వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 4వ ఎపిసోడ్ లో..

  వసుధార వాళ్ల ఇంటికి వెళ్లి వసు అమ్మానాన్నలని కలిసి పెళ్లి నిశ్చయం చేసుకుందామని చెబుతుంది దేవయాని. వసుధారతో పెళ్లి గురించి దేవయాని అడగడంతో డాడ్ లేకుండా ఈ విషయం వద్దు అని రిషి చెబుతాడు. పెళ్లి పనులు మొదలయితే అయన వాళ్లు వస్తారేమో అని దేవయాని అంటుంది. లేదు పెద్దమ్మా.. డాడ్ లేకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. ఇక్కడ కట్ చేస్తే వసుధార, రిషి కలిసి సంతోషంగా దీపాలు వెలిగిస్తారు. ఈ చిన్న దీపాలు, ఆకాశం, మెరిసే నీ కళ్లు, నీ ఆనందం ఇంతకన్నా సంతోషం ఏముంటుందని రిషి అంటాడు. ఏంటీ సర్.. కవిత్వం చెబుతున్నారా అని వసుధార అంటే సావాసదోషం అని రిషి కౌంటర్ ఇస్తాడు. నా జీవితంలో చిన్న కొరత ఉన్నప్పుడు నువ్ వచ్చావ్. నువ్ లేకపోయి ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమైపోయేవాడినో అని బాధపడతాడు రిషి. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లను అని వసుధార అంటుంది.

   నవంబర్ 5వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 5వ ఎపిసోడ్ లో..

  నీకు సిగ్గు అనిపించడం లేదా అని దేవయాని వసుధారతో అంటుంది. దీంతో మీ భాష మార్చుకుంటే బాగుంటుందని వసుధార బదులిస్తుంది. రిషి సార్ కు మీ గురించి చెప్పడం ఒక్క క్షణం పట్టదు. కానీ చాడీలు చెప్పడం నా మనస్తత్వం కాదు. రిషి సర్ తో ఉండే హక్కు నాకు ఉంది. ఆయన నా జీవితం. తనతో కలిసి జీవితాంతం ప్రయాణిస్తాను. మీరు లేనిపోనివి ఆలోచించి.. మా మీద గూఢచారి పెట్టడం మంచిది కాదు జాగ్రత్త అని వసుధార స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మినిస్టర్ తో మాట్లాడేందుకు నిర్ణయించుకుంటారు మహేంద్ర జగతి. మనం అక్కడ రిషి వాళ్లకి కనిపిస్తే ఎలా అని మహేంద్ర అంటాడు. వాళ్లకు కనిపించకుండా జాగ్రత్త పడదాములే అని జగతి సర్ది చెబుతుంది. మరోవైపు వసుధార తలస్నానం చేసి జుట్టు తుడుచుకుంటుంటే రిషి వచ్చి హెయిల్ డ్రయర్ పెడతాడు. మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారని వసుధార లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, రిషి ఇవ్వకపోయేసరికి.. ఇద్దరూ ఒకరికొకరు లాక్కుంటూ ఉంటారు. దీంతో ఒక్కసారిగా ఒకరిపై మరొకరు పడిపోతారు. మళ్లీ చూపు చూపు కలిసి రొమాన్స్ నడుస్తుంది.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup ,Guppedantha Manasu November 1st Week Roundup Story October 31 To November 5 2022 Episodes Highlights
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X