For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: అనుకుంది సాధించిన వసుధార.. భర్త రాకతో టెన్షన్ లో దేవయాని!

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే నవంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

  నవంబర్ 7వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 7వ ఎపిసోడ్ లో..

  కొత్త ప్రాజెక్టు కు సంబంధించిన ఫైల్స్ పై మంత్రి సంతకాలు తీసుకుంటారు రిషిధార. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కోసం మహేంద్ర-జగతి వాళ్లు సర్వేకు వెళ్లారని, దానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ చూసుకోవాల్సిందిగా వసుధారకు ఒక లెటర్ ఇచ్చారని మినిస్టర్ రిషికి చెబుతారు. లెటర్ ఇచ్చారా.. అని రిషి షాక్ అవుతాడు. అవును, సర్వే కోసం వెళ్లాలని. టైమ్ అవుతోంది. ఎయిర్ పోర్టుకు బయలు దేరాలని మంత్రి చెప్పేసరికి మరింత షాక్ అవుతారు రిషి, వసుధార. అదేంటి మీకు చెప్పలేదా, మీరందరు ఒకే ఇంట్లో ఉంటారు కదా అని మంత్రి అడిగేసరికి రిషి కవర్ చేస్తాడు. వాళ్లు సర్వేకు వెళ్లారు కాబట్టి ఈ పనులన్నీ మీరిద్దరే చూసుకోమని మంత్రి చెబుతారు. రిజల్ట్స్ వస్తున్నాయి కదా. దాని తర్వాత కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతామని రిషి అంటే అవునని అంటాడు మినిస్టర్. డాడ్ కి అంతా కోపం ఏంటి.. నాకు కనిపించకుండా వెళ్లిపోయారు అని రిషి చాలా ఫీల్ అవుతాడు.

  నవంబర్ 8వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 8వ ఎపిసోడ్ లో..

  దేవయానికి కాఫీ తీసుకెళ్తుంది వసుధార. నా కోడలేదని దేవయాని అంటే.. నేను కూడా కోడలు లాంటిదాన్నే కదా అంటుంది వసుధార. అసలేంటీ నీ ప్లాన్.. ఎన్నాళ్లు తిష్ట వేస్తావ్ అని దేవయాని అంటే.. ప్లాన్స్ తో జీవితం నడువదు.. అయినా ఇప్పుడు రిషి సార్ ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉన్నా.. ఇక్కడే ఉంటా.. అని వసుధార అంటుంది. ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నావన్న దేవయాని మాటలకు కావాలనే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను.. నాక్కూడా తెలుసని వసుధార రిప్లై ఇస్తుంది. నీకు రిషి అండగా ఉన్నాడనే ధైర్యం కదా అని దేవయాని అంటుంది. నేను ఏం చేసినా డైరెక్ట్ గా చేస్తాను. కొంతమందిలా ఇన్ డైరెక్ట్ గా చేయడం నాకు నచ్చదు. చెప్పి చేయడం మంచి లక్షణమని వసుధార అంటుంది. నువ్ చేసే పనులన్నీ చూస్తున్నాను.. బాగా గమనిస్తున్నాను.. జగతి చెంప దెబ్బ కొట్టినందుకే రిషి అలా మాట్లాడాడు కాబట్టి నీకు బలం ఎక్కువైందని దేవయాని అంటుంది.

  నవంబర్ 9వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 9వ ఎపిసోడ్ లో..

  నేను రిషి సార్ నమ్మకాన్ని, జగతి మేడమ్-మహేంద్ర సార్ అందరి నమ్మకాన్ని ఒమ్ము చేశాను. నేను ఓడిపోయాను మేడమ్. నేను ఓడిపోయాను అంటూ వసుధార ఏడూస్తూ ఉంటుంది. రిషి అక్కడికి రావడంతో.. తాను ఫెయిల్ అయ్యానని చెప్పి ఏడుస్తుంటుంది వసుధార. కొద్దిసేపు చూసిన రిషి.. కంగ్రాట్స్ వసుధార అని చెబుతాడు. వసుధారకు ఏం అర్థం కాక.. ఏంటి సార్ ఫెయిల్ అయినా కంగ్రాట్స్ చెబుతారా.. అని అంటుంది వసుధార. దీనికి నువ్ ఫెయిల్ అయ్యావని ఎవరన్నారు.. నువ్ పాస్ అయ్యావ్ అంటే ఆనందంతో షాక అవుతుంది వసుధార. నా నెంబర్ లిస్ట్ లో లేదు కదా అని వసుధార అంటే.. యూనివర్శిటీ టాపర్ నెంబర్ లిస్ట్ లో అవసరమా అని నేనే ప్రింట్ చేయించలేదని రిషి సమాధానం ఇస్తాడు. దీంతో నేను సాధించాను అని వసుధార గట్టిగా అరుస్తుంది. గౌతమ్, స్టూడెంట్స్ అందరూ వచ్చి కంగ్రాట్స్ చెబుతారు. ఇదంతా గౌతమ్ వీడియో తీసి జగతి మహేంద్రలకు చూపిస్తాడు.

  నవంబర్ 10వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 10వ ఎపిసోడ్ లో..


  జగతి మేడమ్ రావాలని వసుధార అనుకుంటే.. వసు నమ్మకం నిజం కావాలని, డాడ్ వాళ్లు ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటాడు రిషి. తర్వాత సంతోషంతో నీటిలో ఎగురుతూ కిందపడుతుంది వసుధార. దీంతో రిషి కంగారు పడతాడు. బట్టలు తడిచిపోయాయని వసుధార అంటే.. నాకోటు వేసుకో అని ఇస్తాడు రిషి. మరోవైపు ఇంట్లో దేవయాని చిరాకుతో ఉంటుంది. ఇంకా ఎవ్వరూ ఇంటికి రావడం లేదేంటో అనుకుంటూ ధరణిని కోపంగా పిలుస్తుంది దేవయాని. వచ్చిన ధరణి.. వసుధార మంచి విజయం సాధించింది కదా.. రిషి స్వీట్స్ చేయమన్నాడు రిషి అని చెబుతుంది. నాకు చెప్పాల్సిన పనిలేదా అని దేవయాని అంటుంది. సరే.. వద్దులేండి ఆపేస్తాను.. రిషి అడిగితే మీరు వద్దన్నారని చెబుతాను అని ధరణి అంటుంది. నన్నెందుకు రాక్షసిని చేయాలని అనుకుంటున్నావ్. ఈ భూమి మీద ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయో అన్నీ చేయు అని దేవయాని అంటుంది.

   నవంబర్ 11వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 11వ ఎపిసోడ్ లో..

  ఇంట్లో అందరూ వసుధారకు కంగ్రాట్స్ చెబుతారు. దేవయాని కూడా పొగుడుతుంటుంది. దీంతో ఏంటీ ఇలా మాట్లాడుతోంది అని అక్కడ అందరూ అనుకుంటారు. రిషి కూడా వసుధారకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెబుతాడు. ఈ విజయం నాది మాత్రమే కాదు.. ఇది రిషి సార్ గొప్పతనం అంటూ రిషికి స్వీట్ తినిపిస్తుంది వసుధార. ఈ సమయంలో డాడ్ ఉండే బాగుండేది అని రిషి మొదలుపెడితే.. అవును జగతి మేడమ్, మహేంద్ర సార్ ఉంటే చాలా బాగుండేది అని వసుధార కూడా ఫీల్ అవుతుంటుంది. ఇంతలో దేవయాని కలుగజేసుకుని.. వాళ్లు ఇక్కడ లేకపోతే ఏంటి కనీసం ఒక బొకే పంపించి అయినా కంగ్రాట్స్ చెప్పొచ్చుగా అంటుంది. న్యూస్ పేపర్ తీసుకుని వస్తాడు గౌతమ్. స్వయంగా అంకుల్-మేడమ్ వసుధారకు అభినందనలు తెలిపారంటూ పేపర్ చూపిస్తాడు గౌతమ్. దీంతో దేవయాని షాక్ అవుతుంది. రిషి, వసుధార మాత్రం తెగ సంతోషపడిపోతారు.

  నవంబర్ 12వ ఎపిసోడ్ లో..

  నవంబర్ 12వ ఎపిసోడ్ లో..


  ఇంతకీ వసుధార ఏం ఆలోచిస్తుంది.. అసలు మారాను అంటుందా... మారలేదు అంటుందా.. ఇంట్లో అందరినీ ఒక్కటి చేసి.. నన్ను ఒంటరి చేస్తుందా.. రిషి నా పట్టులో నుంచి జారిపోయినట్టేనా.. జగతి మహేంద్ర ఇంట్లోంచి వెళ్లడం నాకు కలిసి వస్తుందనుకుంటే వసుధారకు కలిసొచ్చినట్టుంది. ఈ పరిస్థితిన ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవాలి. నీ దూకుడికి కళ్లెం వేస్తాను.. నిన్ను ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. జగతి లాంటి తెలివైనదాన్నే 20 ఏళ్లు ఇంట్లోంచి బయటకు పంపించగలిగా నువ్ నాకొక లెక్కా.. నీ ఎత్తుకు పైఎత్తు తప్పకుండా వేస్తాను అని దేవయాని అనుకుంటుంది. పెద్దనాన్న కాల్ చేస్తున్నారని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి. ఇక్కడికి వచ్చిన పని సక్సెస్ అయింది.. నేను వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు ఫణీంద్ర. పెద్దమ్మా, పెద్దనాన్న వచ్చాక డాడ్ గురించి అడిగితే ఏం చెబుదాం.. డాడ్ వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయారని తెలిస్తే పెదనాన్న బాధపడతాడని రిషి అంటాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను.. ఆయన వచ్చి వీళ్ల గురించి అడిగితే నాక్కూడా ఇబ్బందే.. అని దేవయాని అంటుంది. వసుధార, రిషి వెళ్లిపోయాక.. ఏంటో మహేంద్ర జగతి వెళ్లిన వ్యవహారం నా మెడకు చుట్టుకునేలా ఉందని అనుకుంటుంది దేవయాని.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X