twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Weekly Roundup: గదిలో బందీగా వసుధార.. దేవయాని కొత్త ప్లాన్, టెన్షన్ లో రిషి

    |

    యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

    నవంబర్ 14వ ఎపిసోడ్ లో..

    నవంబర్ 14వ ఎపిసోడ్ లో..

    జగతికి మెయిల్ చేస్తుంది వసుధార. వసుధార మెయిల్ చూసిన జగతి.. నా గురించి ఆలోచించడం మానేసేయ్. మా వల్ల నువ్వు రిషికి దూరం కావొద్దని జగతి మనసులో అనుకుని బాధపడుతుంది జగతి. ఇంతలో మహేంద్ర వస్తాడు. వసుధార మెయిల్ గురించి మహేంద్రకు చెబుతుంది జగతి. తప్పుదు.. కొన్నాళ్లు వేచి ఉండాలి అని మహేంద్ర జగతి ఇద్దరు అనుకుంటారు. ఇంతలో గౌతమ్ ఇంటికి రిషి, వసుధార వస్తారు. వెంటనే గౌతమ్ కి కాల్ చేస్తాడు మహేంద్ర. కాల్ చేసి రిషి, వసుధార వచ్చారని గౌతమ్ కి మహేంద్ర చెబుతాడు. దీంతో కంగారు పడతాడు గౌతమ్. రిషి ఇంట్లోకి వచ్చేలోపు వెళ్లి గదిలో దాక్కుంటారు మహేంద్ర-జగతి. ఎంత పిలిచినా పలకడం లేదంటే ఇంట్లో లేరేమో అని వసుధార అంటుంది.

    రిషి నిలబడిన గది లోపలే మహేంద్ర వాళ్లు ఉంటారు. రిషి గది తలుపు తీయబోతుంటే వెనుకాలే మహేంద్ర వాళ్లు తమను ఎక్కడా చూస్తారో అని టెన్షన్ పడుతుంటారు. గదిలోకి రిషి వెళ్లబోతుంటే.. ఇంతలో గౌతమ్ వచ్చి పిలుస్తాడు. దీంతో రిషి ఆ గదిలోకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తాడు.

    నవంబర్ 15వ ఎపిసోడ్ లో..

    నవంబర్ 15వ ఎపిసోడ్ లో..

    ఇంటికి ఫణీంద్ర వస్తాడు. ఇంటికొచ్చిన భర్తతో.. చూశారుగా ఈ మొగుడు పెళ్లాం ఎలా వెళ్లిపోయారో అంటుంది దేవయాని. ఏం చేశావ్ నువ్వు అని ఫణీంద్ర అడుగుతాడు. మీరు నన్ను అనడం కరెక్ట్ కాదు. నేను జగతిని చెల్లిలా చూసుకున్నాను. రిషిని పట్టించుకోకుండా వెళ్లిపోయారని దేవయాని అంటుంది. నేను అడుగుతుంది కాఫీ గురించి.. సరేకానీ అసలు వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటీ.. గొడవేమైనా జరిగిందా.. ఊరికెళ్లారని చెప్పావ్.

    ఇంటి పెత్తనం అంతా నాదే అంటావ్.. నువ్ చేసే పెత్తనం ఇదేనా.. నాకు నిజం చెబుతావా లేదా అని ఫణీంద్ర నిలదీస్తాడు. దేవయాని దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. జగతి చిన్నప్పుడే వెళ్లిపోతే రిషిని చూసుకున్నాను. ఇప్పుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడేమైందో తెలియదు ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఇంటిగుట్టు బయటపెట్టడం ఎందుకని పోలీస్ కంప్లైంట్ ఎందుకు అన్నాను. ఇది కూడా నా తప్పేనా అయినా న్యాయానికి రోజుల్లేవు. వాళ్లని ఎలా పిలుస్తారో మీరే చూసుకోండి అని ఏడుస్తుంది దేవయాని. ఏం జరిగిందో కాస్త ఊహించగలను. మిగిలింది చెప్పమని అడుగుతున్నాను అని ఫణీంద్ర అంటాడు.

    నవంబర్ 16వ ఎపిసోడ్ లో..

    నవంబర్ 16వ ఎపిసోడ్ లో..

    వసుధార అమ్మవారి దగ్గర నమస్కారం పెట్టుకుంటుంది. తల్లికొడుకుని ఒక్కటి చేయమంటే తండ్రి-కొడుకుని దూరం చేశావా అని బాధపడుతుంది. వాళ్లు లేకుండా మా పెళ్లికి సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకుంటాం. ఇదేం న్యాయం తల్లి నీకు.. రిషి సార్ కి తండ్రిని దగ్గరచేయి అని వేడుకుంటుంది. వెనక్కు తిరిగేసరికి అక్కడ రిషి ఉంటాడు.

    మీరేంటి ఇక్కడా అని అడిగితే.. నువ్ ఇక్కడున్నావని నా మనసు చెప్పిందని అంటాడు రిషి. నువ్వు కోరుకోవాల్సింది కోరుకున్నావ్ కదా.. నువ్ ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్పి వసుధారను చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. ఇంటర్వ్యూ గురించి అడుగుతాడు. ఇంటర్వ్యూ అద్దనడం సరికాదని చెబుతాడు. దీనికి నా జీవితంలో అడుగడుగునా జగతి మేడమ్ తోడు ఉండి నాకు సహాయపడింది. అలాంటి మేడమ్ నా పక్కన లేకుండా నా గురించి నేను చెప్పుకోవడం అంటే అది అసంపూర్ణం సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. కన్నీళ్లు తుడిచి ధైర్యం చెబుతాడు రిషి.

    నవంబర్ 17వ ఎపిసోడ్ లో..

    నవంబర్ 17వ ఎపిసోడ్ లో..

    రిషి నుంచి వచ్చిన మెయిల్ చూసుకుని జగతి మురిసిపోతుంది. ఆ మెయిల్ లో.. మీరు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్లారో నాకు ఇప్పటికీ తెలియదు. నాకు ఎందుకింత శిక్ష పడిందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అదే శిక్ష వసుధారకు వేస్తున్నారు. డాడ్ ఆనందం కోసం ఒక మెట్టు దిగి నేను మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాను.

    వచ్చినట్టే వచ్చి డాడీని తీసుకుని వెళ్లిపోయారు. ఇది మీకు న్యాయం కాదు కదా మేడమ్. ఎక్కడికి వెళ్లారో ఏంటో తెలియదు. మీరెలా ఉన్నారో అని ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాను. కానీ మీ ఇద్దరి వైపు నుంచి సమాచారం లేదు. మినిస్టర్ గారి దగ్గరి నుంచి కావాలనే నాకు కనిపించకుండా వెళ్లారు. అది నాకు ఎంతో బాధ కలిగించిన విషయం. కానీ ఇప్పుడు ఈ బాధ నా ఒక్కిడిదే కాదు. వసుధారది కూడా.

    వసుధార యూనివర్శిటీ టాపర్ అయ్యాక కూడా మీరు ప్రత్యక్షంగా అభినందించాలని ఎందుకు అనుకోవడం లేదే అర్థం కావడం లేదు. మీడియా ఇంటర్వ్యూ సమయంలో మీరుంటే బాగుంటుందని తను ఆశపడుతుంది. తన కోరికను మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. తల్లి వదిలేసి వెళ్లిన కొడుకు ప్రార్థన అనుకుంటారో.. గురువు వదిలేసి వెళ్లిన శిష్యురాలి బాధ అనుకుంటారో.. వసుధార కళ్లలో సంతోషం చూడాలని డాడ్ తో కలిసి మీరు కాలేజీకి వస్తారని ఎదురుచూస్తున్నాను అని మెయిల్ లో ఉంటుంది.

    నవంబర్ 18వ ఎపిసోడ్ లో..

    నవంబర్ 18వ ఎపిసోడ్ లో..

    జగతి గురించి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. ప్రెస్ మీట్ లో మేడం వాళ్లు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. గౌతమ్ ని పిలిచి అడుగుదాం అనుకున్నా.. తప్పించుకుని వెళ్లిపోయాడని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఏంటీ మేడమ్ గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. మేడమ్ వస్తారా.. రారా.. అనే విషయం పక్కన పెట్టి నువ్వు ధైర్యంగా మీడియా ముందు ఇంటర్వ్యూకి అటెండ్ అవు అని ధైర్యం చెబుతాడు.

    కాసేపు సరదాగా ఇంటర్వ్యూ చేస్తాడు. జగతి మేడమ్ గురించి వసుధార ఎమోషనల్ గా మాట్లాడుతుంటుంది. మరోవైపు కాలేజీలోకి జగతి ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు గౌతమ్ ఇంట్లో జగతి కోసం వెతుకుతాడు మహేంద్ర. అప్పుడు ఒక లెటర్ ఉంటుంది. నేను వెళ్లిపోతున్నాను మహేంద్ర అని లెటర్ లో రాసిపెట్టి వెళ్లిపోతుంది జగతి. ఇటు కాలేజీలో నేను రిపోర్టర్ అంటూ వసుధారపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రిషి. అప్పుడు రిషి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది వసుధార. మరోవైపు వసుధార కోసం జగతి వస్తూ ఉంటుంది.

    నవంబర్ 19వ ఎపిసోడ్ లో..

    నవంబర్ 19వ ఎపిసోడ్ లో..

    దేవయాని మరో ప్లాన్ కు సిద్ధమవుతుంది. చెప్పింది గుర్తుంది కదా.. ఈసారి నేను చెప్పినట్లు జరగాలి మర్చిపోవద్దండి అని అంటుంది. మీరు చేయాల్సింది మీరు చేయండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు కాలేజీలో జగతి గురించి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. వేరే వ్యక్తి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ కావాలనే వసుధార డ్రెస్ పై పోస్తాడు.

    రిషి సీరియస్ అవుతాడు. డ్రెస్ క్లీన్ చేసుకుందామని లోపలకి వెళ్తుంది వసుధార. డ్రెస్ క్లీన్ చేసుకుంటూ ఉండగా జగతి అక్కడికి రావడంతో షాక్ అవుతుంది. కంగ్రాట్స్ వసు.. నువ్ సాధించావని అంటుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు.. మేడమ్ డాడ్ ఎక్కడా అని అడుగుతాడు రిషి. ఓ వ్యక్తి వచ్చి వసుధార లోపల ఉండగా గదికి తాళం వేస్తాడు.

    English summary
    Guppedantha Manasu Weekly Roundup
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X