Guppedantha Manasu Weekly Roundup: పరీక్షలను పూర్తి చేసిన వసుధార.. దేవయాని, సాక్షిల మరో ప్లాన్!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ఈ వారం ఎపిసోడ్లలో వసుధారకు పరీక్షలు ప్రారంభం కాగా.. వాటిని చెడగొట్టేందుకు విఫలయత్నం చేస్తారు సాక్షి, దేవయాని. మరోవైపు రిషికి, వసుధారకు పెళ్లి చేయాలని అనుకుంటారు జగతి, మహీంద్రా, గౌతమ్. ఇలా గత వారం రోజులుగా అంటే ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఆగస్టు 29వ ఎపిసోడ్లో..
రిషి నిద్రలేవకముందే ఇటు గౌతమ్.. అటు మహీంద్రా కాపు గాసి లేపుతారు. వసుధారను కలిశావ్గా ఏమైంది? అంటూ ఆరాలు అడుగుతారు. వసుధారను కలిశావ్గా ఏం జరిగింది? ఏదైనా ఒప్పందానికి వచ్చారా? అండర్స్టాండింగ్ అయ్యిందా లేదా? అని అడగ్గా.. కూల్‌గా అయింది అని రిషి సమాధానం ఇస్తాడు. తెలుసు నాకు తెలుసు రిషి స్వీట్ బాయ్ అంటూ మహేంద్ర ఓ బుగ్గ, సూపర్ రిషి అంటూ గౌతమ్ మరో బుగ్గ పట్టుకుని ఆటపట్టిస్తారు.
ఇక మరోవైపు తను వసుధార కోసం ప్రిపేర్ చేసిన నోట్స్ ఇచ్చేందుకు వెళ్తుంది జగతి. గౌతమ్ కూడా జగతితోపాటు వెళ్తాడు. ఇంతలో వసుధార ఇంటిముందు రిషి కారు వచ్చి ఆగేసరికి.. రిషి వచ్చాడేమో అనుకుని వసుధార బయటకు పరుగెత్తుకుంటూ వస్తుంది. జగతి, గౌతమ్ కావడంతో కాస్త డల్ అవుతుంది. తర్వాత వసుధారకు జగతి నోట్స్ ఇచ్చి.. రిషి ఏం అన్నాడు? మీ మధ్య ఏం జరిగింది? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వసుధార ఏం చెప్పదు.

ఆగస్టు 30వ ఎపిసోడ్లో..
అనంతరం వసుధార బ్యాగులో పెన్ను పెడతాడు రిషి. ఎగ్జామ్స్ కోసం పెట్టిన గ్రూప్‌లో అందరూ యాక్టివ్‌గా ఉండండి. పరీక్షలు బాగా రాయండి. మంచిగా మార్క్స్ తెచ్చుకోండి అని చెబుతాడు రిషి. అలాగే వసుతో పాటు అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతాడు రిషి. తర్వాత తన బ్యాగులో రిషి పెట్టిన పెన్ను చూస్తుంది వసుధార. పెన్నుతోపాటు చిన్న లెటర్ కూడా ఉంటుంది.
ఆ లెటర్లో మనసు మాట్లాడమంటోడి. షరతు వద్దంటోంది. నీ లక్ష్యమే నీ గమ్యం. ఎగ్జామ్స్ బాగా రాయి. ఆల్ ది బెస్ట్ అని ఉంటుంది. థ్యాంక్యూ సార్, మీరు జెంటిల్ మెన్ సార్.. అని వసుధార అనుకుంటుంది.

ఆగస్టు 31వ ఎపిసోడ్లో..
వసుధారకు మొదటి రోజు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షలు నీకే కాదు, నాకు కూడా. నీ లక్ష్యం వైపు నిన్ను నడిపించేందుకు నేను ఎన్ని కష్టాలు అయిన అనుభవిస్తా. నీ గెలుపులోనే నా విజయం కూడా ఉంది వసుధార.. అని అనుకుంటూ ఎగ్జామ్ హాల్లోకి వస్తాడు రిషి. నీ నీడల ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను. ఇదే రిషి వాగ్దానం అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.
తర్వాత ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్స్ అయిపోయాక అందరం వెళ్లిపోవాలి కదా, అందరినీ వదిలి వెళ్లిపోవాలి కదా అంటుంది పుష్ప. ఇంతలో రిషి వస్తాడు. రిషి సార్‌తో మాట్లాడకపోతే ఇంత బాధగా ఉంటుందా? ఒక్కసారి గలగల మాట్లాడాలని ఉంది అని అనుకుంటుంది వసుధార. మరోవైపు వసుతో మాట్లాడితే బాగుండు. అనవసరంగా కండిషన్ పెట్టానని అనుకుంటాడు రిషి.

సెప్టెంబర్ 1వ ఎపిసోడ్లో..
మత్తుమందు చల్లిన కర్చీఫ్ తెచ్చి వసుధార మొహానికి పెడుతుంది. దీంతో వసుధార స్పృహ తప్పుతుంది. వెంటనే తనను ఓ రూమ్‌లోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి వెళ్తారు సాక్షి, ఆ మహిళ. రాత్రి అవుతుంది. వసు ఏం చేస్తుంది అని మెసేజ్ చేస్తాడు రిషిభూషన్. రిప్లై రాదు. దీంతో తను ఏం చేస్తుందో అని ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది.
ఇక్కడ కట్ చేస్తే రిషి, గౌతమ్ ఇద్దరూ కాలేజ్‌కు వెళ్తారు. మహీంద్రా, జగతి కూడా కాలేజ్‌కు వస్తారు. సెక్యూరిటీని అడుగుతారు. తర్వాత వసుధారను పడుకోబెట్టిన రూమ్‌కు వెళ్తాడు రిషి. అక్కడ వసుధారను చూసి షాక్ అవుతాడు రిషి. ఆ తర్వాత వసుధారను ఇంటికి తీసుకొస్తాడు రిషి. నీ ఆశయం బతకాలి. లే.. వసుధార అంటాడు. కానీ.. వసు లేవదు.

సెప్టెంబర్ 2వ ఎపిసోడ్లో..
వసుధార నీకు ఏమైంది? వసుధార లే అని అంటాడు. రిషి ఎంత లేపిన వసుధార లేవదు. ఇంతలో గౌతమ్ వస్తాడు. వసుధార ఇక్కడ పడిపోయింది. వెంటనే డాక్టర్‌ను తీసుకురా అని గౌతమ్‌కు చెబుతాడు రిషి. వసుధారను లేపి అక్కడి నుంచి తీసుకెళ్తాడు రిషి. తన గదిలో సోఫాపై కూర్చోబెడతాడు. మరోవైపు ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది.
జగతి క్వశ్చన్ పేపర్స్ తీసుకెళ్తుంది. వసుధారకు ఏమైంది? ఎగ్జామ్‌కు ఎందుకు రాలేదు అని జగతి అనుకుంటుంది. క్వశ్చన్ పేపర్స్ అందరికీ ఇచ్చేశాక పరీక్ష స్టార్ట్ అవ్వగానే.. మేడమ్ క్వశ్చన్ పేపర్ అని వసుధార అడుగుతుంది. దీంతో ఏమైంది వసుధార? అని అడుగుతుంది. తర్వాత.. సరే ముందు ఎగ్జామ్ రాయి.. తర్వాత మాట్లాడుదాం అంటుంది జగతి.

సెప్టెంబర్ 3వ ఎపిసోడ్లో..
వసుధార చాలా నీరసంగా ఎగ్జామ్ హాల్‌కు వచ్చి పరీక్ష రాస్తూ ఉంటుంది. ఇది చూసి ఎస్ దటీజ్ వసుధార అని అనుకుంటాడు రిషి. మహీంద్రా కూడా వచ్చి వసుధార ఎగ్జామ్ రాయగలదు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అంటాడు. రిషి, వసుధార విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి పెళ్లి త్వరగా చేసేద్దాం అని చెబుతాడు మహీంద్రా.
దూకుడుగా ముందుకు అడుగు వేయకపోతే కుదిరేలా లేదు అని మహీంద్రా అంటాడు. కట్ చేస్తే తమ ప్లాన్ ఫెయిల్ అయిందని టెన్షన్ పడుతుంది దేవయాని. ఇంతలో దేవయానికి సాక్షి ఫోన్ చేస్తుంది. నేను చేయాల్సిదంతా చేశాను. ఎలా కనిపెట్టారో తెలియదు అని సాక్షి చెబుతుంది. ఎగ్జామ్స్ అయిపోయాయిగా, వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని సాక్షిపై దేవయాని చాలా సీరియస్ అవుతుంది. మీరు టెన్షన్ పడకండి ఆంటీ.. వసుధారకు లక్ బాగుంది. అందుకే చివరి నిమిషంలో రిషి చూశాడు. రిషి మంచితనమే మనకు ఆయుధంగా ఉపయోగపడుతుంది. తన ప్రేమనే క్షణాల్లో ద్వేషంగా మార్చొచ్చు. ఒక చిన్న అవకాశం చాలు.. రిషి, వసుధారను విడదీయడానికి అని దేవయానితో సాక్షి అంటుంది.


Click it and Unblock the Notifications











