Jyothi Rai: జగతి మేడమ్ గొప్ప మనసు.. అక్షయ తృతీయ రోజు అతడికి సాయం చేస్తూ ఎమోషనల్!

తెలుగు బుల్లితెర నటి జ్యోతి రాయ్ అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. జగతి మేడమ్ అంటే మాత్ర అంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు. కన్నడ బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి జ్యోతి.. తెలుగులోనూ సూపర్ సక్సెస్ సాధిస్తోంది. ఇలా కెరియర్ లో దూసుకుపోతున్న ఈమె.. అక్షయ తృతీయ రోజు అందరిలా బంగారం కొనకుండా... బంగారం లాంటి ఓ మంచి పని చేసింది. ఆ పనేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కన్నడలో అనేక సీరియల్స్ లో నటించి మెప్పించిన జ్యోతి రాయ్.. తెలుగులో ఒక్క సీరియల్ మాత్రమే చేసింది. ముందుగా గుప్పడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ లో జగతి మేడమ్లా కనిపించి అందరికీ దగ్గర అయ్యారు. పద్ధతైన చీర కట్టు, బొట్టుతో అందరినీ తెగ అలరించారు. ఈమె కట్టు, బొట్టుకే తెలుగలో పెద్ద ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Guppedantha Manasu Serial Actress Jyothi Rai helped to Kinnera Mogilaiah

ప్రస్తుతం సీరియల్స్ కు దూరం అయిన ఈమె సినిమాలపై ఫోకస్ చేస్తోంది. సరికొత్త వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే సీరియల్స్ లో కేవలం చీరల్లో మాత్రమే కనిపించి.. తెలుగు ప్రేక్షకుల అందరికీ చాలా దగ్గరమైన ఈమెను.. సోషల్ మీడియాలో చూస్తే మాత్రం అస్సలే గుర్తు పట్టలేరు. ఆమె అక్కో, చెల్లో అనుకుంటారే తప్ప ఆమె అంటే ఎవరు నమ్మరు. ఎందుకుంటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తుంటుంది. పొట్టి పొట్టి బట్టలు, బికినీల్లో కూడా దర్శనం ఇస్తుంది. హాట్ ట్రీట్ ఇస్తూ.. కుర్రాళ్లకు హీటెక్కిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేసే ఈమె.. తాజాగా ఓ మంచి పని చేసింది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అందరిలా బంగారం కొనుగోలు చేయకుండా.. బంగారం లాంటి ఓ మంచి పని చేసింది. అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మొగిలయ్య గురించి అందరికీ తెలిసిందే. బలగం సినిమాలో లాస్ట్ లో ఓ పాట పాడి.. అందరి చేత కన్నీరు పెట్టించిన ఈయన.. ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. బలగం సినిమా తర్వాత నుంచి ఆరోగ్యం బాగాలేని ఈయన అనేక ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న జ్యోతి రాయ్ స్పందించింది. ఆనయకు తన వంతు సాయంగా 50 వేల రూపాయలు ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా పోస్ట్ చేసింది. అలాగే ఆయనకు మధ్యాహ్నం భోజనం కూడా పెట్టించానని.. ఆయన టాలెంట్ కు గౌరవం కూడా ఇచ్చినట్లు వివరించింది. సన్మానించినట్లు చెప్పుకొచ్చింది. ఎవరైనా సాయం చేయాలనుకున్న వాళ్లు కూడా ఆయనకు సాయం చేయాలని కోరింది. అయితే తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా తానేం పట్టించుకోనని.. కొందరు తనను కిందకు లాగాలనుకుంటే తాను మరింత పైకి ఎగురుతానంటూ వివరించింది. ప్రస్తుతం జ్యోతి రాయ్ చేసిన ఈ పొస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X