Raksha Gowda: స్లీవ్‌లెస్ సింగిల్ పీస్ డ్రెస్‌లో వసు మేడమ్ వయ్యారాలు.. అలా చూస్తూ ఉండిపోతారంతే!

గుప్పెడంత మనసు సీరియల్ లో వసుధారగా కనిపించిన ముద్దుగుమ్మ అసలు పేరు రక్ష గౌడ. ఆమె రియల్ నేమ్ ఎక్కువగా తెలియకపోయినా.. వసు మేడమ్ అంటే మాత్రం అంతా ఇట్టే గుర్తు పడతారు. అద్భుతమై అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా స్లీవ్ లెస్ సింగిల్ పీస్ డ్రెస్ లో సోకులు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రక్ష గౌడకు చిన్నప్పటి నుంచి సినిమాలు, సీరియల్స్ లో నటించడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టంతోనే ఈమె సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం 27 ఏళ్ల వయసు. అయితే ఎంబీఏ పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత మోడల్ గా కెరియర్ ప్రారంభించింది. అదే సమయంలో ఈమె ఫొటోలు చూసిన ఓ డైరెక్టర్ సీరియల్ లో అవకాశం ఇచ్చారు. అలా మొదటి సారి ఈ ముద్దుగుమ్మ రాధా రమణ అనే సీరియల్ లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో తొలిసారి కృష్ణవేణి అనే సీరియల్ లో చేసింది.

Guppedantha Manasu Serial Actress Vasu Alias Raksha Gowda Sizzling Look Photos Goes Viral

దాని తర్వాతే ఈ క్యూట్ బ్యూటీకి గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న రక్షా గౌడ పద్ధతైన పాత్రలో కనిపిస్తూ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది. ముఖ్యంగా రిషి సార్ ను ప్రేమించే అమ్మాయిగా, బాద్యత గల కూతురిగా, కోడలిగా.. నటిస్తూ మరింత పాజిటివీ సంపాదించుకుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా తెగ ఆరాధించే ఈమె రియల్ లైఫ్ లో మాత్రం చాలా పాష్ గా ఉంటుంది. అన్ని రకాల ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందాలను ఆరబోస్తుంటుంది.

ఓవైపు రోజూ సీరియల్ లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పూర్తి అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ తన అందాలను చూపిస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ స్లీవ్ లెస్.. సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఈ డ్రెస్ లో రక్ష గౌడ చాలా అందంగా కనిపిస్తోంది. ఎక్కడికో వెకేషన్ కు వెళ్లిన ఈమె అక్కడే అదిరిపోయే ఫొటోలు దిగగా.. అవి కాస్తా నెట్టింట వైరల్ అయ్యాయి.

రక్షా గౌడ షేర్ చేసిన ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను వర్ణించడం చాలా కష్టం అని కొందరు, ఐ లవ్ యూ బేబీ అంటూ మరికొందరు వరుసగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X