Guppedantha Manasu: దేవయాని పనికి వసుధార జగతి బిక్కమొహం.. బుక్ అయిన రిషి!
డీబీఎస్టీ కాలేజీలో ఆధ్యాత్మిక ఆధునిక సంగమం మేధోమూర్తి జయచంద్ర గారికి ఆహ్వానం అంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు అంతా జయచంద్ర రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక దేవయాని, ఫణీంద్ర, మహేంద్ర, జగతి అంతా ఆయన కోసం ఎదురుచూస్తుంటారు. అంతా బాగానే ఉంది కానీ.. జయచంద్ర గారు ఎక్కడ ఉండాలి అనేదే కష్టంగా మారింది.
గెస్ట్ హౌజ్ నచ్చుతుందో లేదో అని రిషి అంటాడు. అయితే మన ఇంటికి తీసుకుపోదాం సార్ అని వసుధార అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 1 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 726లో ఇంకా ఏం జరిగిందంటే?

నైస్ కపుల్ అంటూ..
వసుధార మన ఇంటికి తీసుకుపోదాం అని చెప్పేసరికి మంచి ఐడియా అంటాడు రిషి. మన ఇళ్లా అని దేవయాని కోపంగా అంటుంది. కానీ రిషి మాటలు విన్నాక సరే రిషి నీ ఇష్టమే నా ఇష్టం. నేను వెళ్లి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది దేవయాని. ఇక జయచంద్ర వస్తాడు.
నైస్ కపుల్ అంటూ వసుధార, రిషిలను పొగుడుతాడు. జగతీ, మహేంద్ర, ఫణీంద్రలు తమ కాలేజీ గురించి, చేసే పనుల గురించి చెప్పడంతో జయచంద్ర వాళ్లతో చాలా పాజిటివ్ గా ఉంటాడు.
ఇక స్టూడెంట్స్ ముందు చాలా గొప్పగా మాట్లాడతాడు జయచంద్ర. మీరు నాతో స్నేహం చేస్తారా. నా డ్రెస్ మీకు నచ్చిందా. లేక జీన్స్ టీ షర్ట్స్ వేసుకుని రానా. మీరంతా నేను చెప్పేది వినాలి. అదే నాకు ముఖ్యం అని జయచంద్ర చెబుతాడు.

అంతా విడ్డూరమే..
పూర్వ సంస్కృతి, ఇప్పటి వరకు ఆధునికతకు మధ్య తేడా గురించి మాట్లాడుకుందాం. వీటిల్లో ఏది గొప్పదో చర్చించుకుందాం. నేను పూర్వ వైభవం గురించి చెబుతాను. మీరు నేటి ఆధునికత గురించి చెప్పండి. చర్చిద్దాం. ఏ టాపిక్ మీద అనేది రేపు చెబుతాను. ఓకేనా అని అంటాడు జయచంద్ర. అందరు ఓకే అంటారు. మరోవైపు దేవయాని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
ఈ వసుధారకు ఎక్కడ పని పాట లేదు. ఈ ఇంట్లో తను ఉండటమే ఎక్కువ. ఇంకా అతిథి గురించి ఆలోచించడం ఎందుకు. ఆయన గారు గెస్ట్ హౌజ్ లో ఉండేవారు కదా. అంతా విడ్డూరమే అని తిట్టుకుంటూ రగిలిపోతుంది దేవయాని. వెంటనే వసుధార గదికి వెళ్తుంది.

కాళ్లమీద పడబోయిన దేవయాని..
వసుధార గదిలో ఉన్న బట్టలన్నీ సర్దుతూ కనిపిస్తుంది ధరణి. హేయ్ ధరణి.. ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావ్. వసుధార చేసుకోగలదు కదా అని దేవయాని అంటుంది. అంటే తను అతిథిగారితో వస్తుంది కదా. అందుకే సర్దుతున్నాను అని చెప్పిన ధరణి.. ఆ బట్టలు తీసుకుని వెళ్తుంది. ఇంతలో ఓ చున్నీ మంచం పక్కకు పడిపోయి ఉండిపోతుంది.
అది ఇటు ధరణి.. ఇటు దేవయాని ఇద్దరు చూడరు. ఇక జయచంద్రని ఒప్పించి ఇంటికి బయలుదేరతారు రిషి, వసుధరా, జగతి, మహేంద్ర. జగతి, మహేంద్ర కారులోనే జయచంద్ర వెళ్తాడు. జయచంద్ర రిషి ఇంటికి వస్తాడు. ఆయన రాగానే జయచంద్ర కాళ్ల మీద పడబోతుంది దేవయాని.

అసలే పాము చెవులు..
గురువు గారు మీ రాక మాకు ఎంతో సంతోషం. మీలాంటి వాళ్లు మా ఇంట్లో ఉండటం మా అదృష్టం అంటూ చాలా గౌరవంగా మాట్లాడుతుంది దేవయాని. అది విన్న జగతి, వసుధార ఒకరి మొఖాలు మరొకరు చూసుకుంటూ బిక్కం మొహం పెడతారు. అమ్మో మేడమ్.. ఈ దేవయాని మేడమ్ ఇలాంటి వాటిలో చాలా గ్రేడ్ కదా. అద్భుతంగా నటిస్తారు. అంటూ నసుగుతుంది వసుధార. నవ్వుకుంటూ మరింత చిన్నగా జాగ్రత్త వసు.. అక్కయ్యవి అసలే పాము చెవులు అని జగతి అంటుంది.

వసుధార సైగ చేస్తుంటే..
తర్వాత జయచంద్రకు ఏర్పాటు చేసిన అతిథి గదిలోకి రిషి, వసుధారలు ఆయన్ని తీసుకుని వెళ్తారు. అప్పుడే వసుధార మంచం పక్కనే పడి ఉన్న చున్నీని చూస్తుంది వసుధార. వసుధార చున్నీ రిషి కాళ్ల దగ్గర్లోనే ఉంటుంది. అది తీసెయ్యమని రిషికి వసుధార సైగ చేస్తుంటే జయచంద్ర చూసేస్తాడు. ఇంతకుముందు ఈ గదిలో ఆడవాళ్లు ఎవరైనా ఉండేవారా అని సూటిగా అడుగుతాడు జయచంద్ర.
రిషి అప్పుడే వసుధార సైగలను చూస్తాడు. అప్పుడు ఆ చున్నీ వైపు చూస్తాడు రిషి. జయచంద్ర అడిగిన ప్రశ్నకు ఆలోచనలో పడిపోతాడు రిషి. ఇలా జయచంద్ర ప్రశ్నకు రిషి బుక్కైనట్లే కనిపిస్తోంది. మరి ఆయనకు ఏం చెబుతాడో తర్వాతి ఎపిసోడ్ లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











