Guppedantha Manasu: జగతికి తలవంచిన మహేంద్ర.. వసుధారకు అసలు నిజం చెప్పేసిన రిషి!

రిషి ఇంటర్నేషనల్ కాల్ మాట్లాడతాడు. జగతి, మహేంద్ర, ఫణేంద్ర ముగ్గురు ఆ కాల్ వింటారు. రిషితో మాట్లాడిన ఎన్ఆర్ఐ రిషి సార్ మీరు మిషన్ ఎడ్యుకేషన్ తో మీ కాలేజీ పేరును ప్రపంచ స్థాయికి తీసుకొచ్చారు. నాదో చిన్న సలహా. మీ కాలేజీ నుంచి కలెక్టర్స్, టీచర్స్ ఇలా చాలా మంది వస్తున్నారు. కానీ డాక్టర్స్ రావట్లేదు. మీరెందుకు మెడికల్ కాలేజీ పెట్టకూడదు అని అంటాడు. ఆ ప్రయత్నం కూడా చేస్తాం సార్. తప్పకుండా అంటూ థ్యాంక్స్ చెప్పి కాల్ పెట్టేస్తాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 11 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 734లో ఇంకా ఏం జరిగిందంటే?

ధైర్యంగా ఉండగలిగాను:పెద్దనాన్న డాడ్, మేడమ్ మనం మెడికల్ కాలేజీ పెడదాం. ఆయన చెప్పారనే కాదు. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. అది చాలా కష్టమైన పని అని నాకు తెలుసు. కానీ అది కూడా ముఖ్యమే కదా అని రిషి అంటాడు. దీంతో జగతి మహేంద్ర సరే అని ప్రోత్సహిస్తారు. వసుధార బస్తీ విజిట్ చేసుకున్నాకా.. మీరు లేకపోవడం ఏం బాలేదు అని రిషికి మెసేజ్ పెడుతుంది. తర్వాత మహేంద్ర, జగతి బయటకు వెళ్తారు. మహేంద్ర మనం విడిపోయినప్పుడు నేను ఒక్కదాన్నే. కానీ ధైర్యంగా ఉండగలిగాను. వసు, రిషిల మధ్య వచ్చిన అవాంతరాలు దూరం కావాలని, వాళ్లు గతంలోకి వెళ్లాలి అనుకున్నప్పుడు వసుధార కూడా అంతే ధైర్యంగా నిలబడింది అని జగతి చెబుతుంది.

Guppedantha Manasu Serial April 11 2023 Today Full Episode 734

తలవంచిన మహేంద్ర:వసుధార ధైర్యంగా నిలబడగలిగింది. కానీ రిషి నిలబడలేకపోయాడు. సాటి మగాడు ఎలా స్పందిస్తాడో అలానే స్పందించాడు. వసు ధైర్యంతో ఈరోజు తన ప్రేమను సాధించుకుంది. ఆడవాళ్లు ధైర్యంగా తట్టుకుంటారు మహేంద్ర. నమ్మితే దేనికైనా ఎదురు వెళ్తారు. రిషి, వసుధారల ప్రేమ అంటే నాకు గౌరవం మహేంద్ర. ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు అని జగతి అంటుంది. దీంతో జగతి దగ్గరికి వెళ్లిన మహేంద్ర ఈరోజు స్తీల అందరికీ తలవంచి నమస్కరిస్తున్నాను అని చేతులు పట్టుకుని మొక్కుతాడు. ఈ సీన్ కాస్తా ఎమోషనల్ గా ఉంటుంది. మనం అన్నేళ్లు దూరంగా ఉన్నా ఏ రోజు మనం విడిపోయాం అని, మన బంధం తెగిపోయింది అని నేను అనుకోలేదు అని మహేంద్ర అంటాడు.

తల్లడిల్లిపోతాను:మనసులోనే ఎంతో ఏడ్చాను. కానీ నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఒంటరిగా రాలేదు. నీ కొడుక్కి జీవితాంతం తోడుగా ఉండేందుకు వసుధారను తీసుకొచ్చావ్ అని మహేంద్ర ఎమోషనల్ గా అంటాడు. మరోవైపు దేవయాని రగిలిపోతూ ఉంటుది. ధరణి దగ్గరికి వెళ్లి ఈ జంటలు ఇంకా రాలేదు. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది. ఆ జగతి, మహేంద్రలకు కొడుకంటే బాధ్యతే లేదు. వసుధారను నెత్తిన పెట్టుకుంటారు. అసలు రిషి మనసులో ఏముంది అనేది తెలుసుకోనే తెలుసుకోరు. రిషి గురించి నేను ఒక్కదాన్నే తల్లడిల్లిపోతాను. అసలు ఎవరికీ పట్టదు అంటూ ఎప్పుడూ వినిపించే సోదే మాట్లాడుతుంది. అత్తయ్యగారు రిషి ఎవరి మాట వినడు కదా. తన నిర్ణయం తానే తీసుకుంటాడు కదా అని దేవయానికి ధరణి చురకలు వేస్తుంది.

Guppedantha Manasu Serial April 11 2023 Today Full Episode 734

ఆనందం కోసం:మరోవైపు బస్తీలో ఉన్న వసుధార దగ్గరికి రిషి వెళ్తాడు. దీంతో వసుధా షాక్ అవుతుంది. అక్కడున్న పిల్లతో గోలీలు ఆడతారు. తర్వాత వారికి చాక్లెట్స్ పంచి ఇచ్చి ఇస్తాడు రిషి. మరి నాకేం లేదా సార్ అని వసుధార అంటే నీకు ప్రత్యేకమైనది ఉంది అని ఒకచోట కూర్చుంటారు. ప్రేమగా మాట్లాడుకుంటారు. వసుని కళ్లు మూసుకోమ్మని చెప్పి కారు డోర్ తీసి వసుధార చేతిలో ఒక బ్యాగ్ పెడతాడు. అది ఓపెన్ చేసి చూసిన వసుధార తెగ సంతోషపడుతుంది. అందులో గతంలో వసుధార చలికి వణుకుతుంటే రిషి కప్పిన శాలువా ఉంటుంది. జగతి మేడమ్ ని అడిగి తెచ్చాను. నీ కళ్లలో ఆనందం చూద్దామని అని రిషి అంటాడు. దీంతో రిషి భుజాలపై వాలిపోతుంది వసుధార.

పెళ్లి గురించే కదా: తర్వాత చాక్లెట్ తీసి కాకి ఎంగిలి చేయకుండా ఇద్దరు తింటారు. మనకి కాకి ఎంగిలొద్దు. ఈ తియ్యటి క్షణాల సాక్షిగా చెబుతున్నాను. ఇక మన మధ్య ఎడబాటు ఉండదు అని రిషి అంటే వసుధార్ ప్రేమగా ఆ చాక్లెట్ తీసుకుంటుంది. తర్వాత ఇద్దరూ కారులో బయలు దేరతారు. ఈ క్షణం ఇలా ఆగాలని అనిపిస్తోంది వసుధార. నీతోనే ఉండాలనిపిస్తోంది. ఇంకేదీ వద్దు అనిపిస్తుంది అని అంటాడు రిషి. నాకు అలానే ఉంది సార్. కానీ ఆడపిల్ల గౌరవానికి తప్పకుండా ఒకమాత్రం కావాలి అని వసుధార అంటుంది. నువ్వు మాట్లాడేది పెళ్లి గురించే కదా. నేను నీకొకటి చెప్పనా. ఎవరికీ చెప్పవు కదా అని అంటాడు రిషి.

Guppedantha Manasu Serial April 11 2023 Today Full Episode 734

నాకే తొందరెక్కువ:చెప్పను సార్ చెప్పండి అని వసుధార నవ్వుతూ అంటుంది. నిజంగా ఎవరికీ చెప్పకూడదు. చెప్పను అంటేనే చెబుతాను అని రిషి అంటాడు. అయ్యో ఎందుకు సార్ అంత గట్టిగా అంటున్నారు. చెప్పను కానీ చెప్పండి అని వసుధార అంటుంది. పెళ్లి విషయం నీకంటే ఎక్కువగా నాకే తొందరగా ఉంది ఎమ్ హెచ్ అని సిగ్గుపడుతూ రిషి అంటాడు. నిజమా సార్ అని నవ్వుతూ వసుధార అంటుంది. నిజంగా నిజం.. కొన్ని కొన్ని దాచుకోవడం కొన్ని కొన్ని అణుచుకోవడం చాలా కష్టం. అందుకే నీకు చెప్పేశా అని రిషి అంటాడు. దీంతో వసుధార నవ్వుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X