Guppedantha Manasu: షాకింగ్.. సరికొత్త విలన్స్ ఎంట్రీ.. రిషిధార కిడ్నాప్.. వసు మెడకు కత్తి

వసుధార, రిషి కారులో వెళ్తుండగా వెనుక నుంచి ఒక అమ్మాయి పరుగెడుతూ సార్ ఆపండి.. హెల్ప్.. హెల్ప్ అంటూ అరుస్తుంటుంది. అది చూసి షాక్ అయిన రిషిధారలు కారు ఆపుతారు. సడెన్ బ్రేక్ వేయగానే ఆ అమ్మాయి కింద పడిపోతుంది. ఆ అమ్మాయి దగ్గరికి రిషిధార ఇద్దరూ వెళ్లి ఏమైంది అని అడుగుతారు. ఇద్దరు రౌడీలు సార్.. ఇందాకటి నుంచి నన్ను తరుముతున్నారు అని చెబుతుంది. వసుధార వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇద్దరూ రౌడీలు అన్నావ్ ఎక్కడా అని రిషి అంటాడు. మిమ్మల్ని చూసి ఎక్కడో దాక్కున్నట్లు ఉన్నార్ సార్ అని అమ్మాయి చెబుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఏప్రిల్ 12 బుధవారం నాటి తాజా ఎపిసోడ్‌ 735లో ఇంకా ఏం జరిగిందంటే?

పోలీసుల వ్యవహారం:నీకేం భయం లేదు.. నీ పేరు ఏంటీ అని రిషి అడుగుతాడు. త్రివేణి సార్ అని అమ్మాయి చెబుతుంది. సరే ఇప్పుడు పోలీసులకు కాల్ చేసి చెబుతాను. వాళ్లే చూసుకుంటారు అని రిషి ఫోన్ తీస్తుంటే వద్దు సార్ అని త్రివేణి అంటుంది. ఎందుకు వద్దంటున్నావ్. నువ్వు ఏం తప్పు చేయలేదు కదా అని వసుధార అంటే.. మా అమ్మ నాన్నలకు పోలీసుల వ్యవహారం అంటే నచ్చదు. నేను జాబ్ చేయడం వాళ్లకు ఇష్టం లేకపోయినా. ఎంతో కష్టం మీద వాళ్లని ఒప్పించి జాబ్ చేస్తున్నా. ఇప్పుడు పోలీసులకు చెబితే అది అమ్మ నాన్నల దాకా వెళ్తుంది. వాళ్లు పరువు పోయిందని నన్ను జాబ్ మానిపించేస్తారు అని త్రివేణి చెబుతుంది. అది నిజమే. కొందరు తల్లిదండ్రులు ఇలానే ఉంటారు అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial April 12 2023 Today Full Episode 735

అమ్మా నాన్న ఎక్కడా:సార్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అని త్రివేణి అడుగుతుంది. సరే అని త్రివేణిని కారు ఎక్కించుకుంటారు. తర్వాత జగతికి వసు కాల్ చేసి మేడమ్ మాకో చిన్న పని పడింది. మేము కాస్తా ఆలస్యంగా వస్తాం. మీరు భోజనం చేసెయ్యండి అని చెబుతుంది. త్రివేణిని వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు రిషిధార. ఇదే సార్ మా ఇల్లు. మీరు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అంటూ కాఫీ తాగేందుకు ఇంట్లోకి పిలుస్తుంది త్రివేణి. కనీసం వాటర్ అయినా తాగి వెళ్లండి అని పిలుస్తుంది. దీంతో హాల్లోకి రిషి, వసుధార వెళ్తారు. మీరు కూర్చొండి. వెళ్లి వాటర్ తీసుకొస్తానంటూ లోపలికి వెళ్తుంది త్రివేణి. తర్వాత మీ అమ్మా నాన్న ఎక్కడా అని అడుగుతారు రిషిధార. ఇంట్లో పడుకుని ఉంటార్ సార్. రండి పరిచయం చేస్తాను అని గదిలోకి తీసుకుని వెళ్తుంది త్రివేణి.

వసుధార మెడకు కత్తి:మరోవైపు కొత్త విలన్ ను చూపిస్తారు. అతని ముఖం చూపించకుండా చదరంగంలో పావులను కదిపే చేతులను మాత్రమే చూపిస్తారు. మరోవైపు త్రివేణి గదిలోకి రిషిధార వెళ్తారు. అమ్మా నాన్న వాళ్లిద్దరూ వచ్చారు. ముసుగు తీయండి అని త్రివేణి అంటుంది. దీంతో వాళ్లు ముసుగు తీసి కూర్చుంటారు. ఆ ముసుగులో ఉన్న ఇద్దరు రౌడీలను చూసి వసుధార, రిషి షాక్ అవుతారు. వెంటనే వాళ్లు లేచి దుప్పటితో రిషిని పట్టుకునేందుకు ట్రై చేసిన ఫలించదు. రిషినే వాళ్లను కొట్టి ఎవర్రా మీరంతా అని అరుస్తాడు. ఇద్దరూ రౌడీలను మంచానికి రిషి ఆనించి కదలకుండా చేస్తాడు. అప్పుడు వసుధార మెడకు కత్తి పెడుతుంది త్రివేణి. అది చూసి రిషి షాక్ అవుతాడు. రిషి వెనక్కి తిరిగేసరికి రౌడీలు రిషిని కదలకుండా పట్టుకుంటారు.

Guppedantha Manasu Serial April 12 2023 Today Full Episode 735

కొత్త విలన్ గా రామ్ జగన్:ఫోన్ కారు కీస్ తీసుకోండ్రా అని త్రివేణి అరుస్తుంది. రౌడీలు అలానే చేస్తారు. తర్వాత గుమ్మం దగ్గర వసుధారను నెట్టేసి వాళ్లు బయటకు వెళ్లి తలుపు పెట్టేస్తారు. వసు వెళ్లి రిషి మీద పడుతుంది. తర్వాత డోర్ తీయండి అంటూ ఇద్దరూ అరుస్తారు. వసుధార భయం వేస్తుందా అని రిషి అంటే మీరున్నారు కదా సార్ అని సమాధానం ఇస్తుంది. ఎవరు సార్ వీళ్లంతా. ఎవరు ఇలా చేశారు అని వసుధార అంటుంది. ఎవరైనా కావొచ్చు అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విలన్ ను పూర్తిగా చూస్తారు. అతను నటుడు రామ్ జగన్. చదరంగంలో రాజు, రాణీలను తోసి గెలిచిన ఆనందంలో ఉంటాడు. కంటికి కనిపించని శత్రువులు చాలా మంది ఉంటారు రిషీంద్ర భూషణ్ అంటూ నవ్వుతాడు.

వాళ్లెవరో నాకు తెలుసు:మరోవైపు మనం ఎవరికీ అన్యాయం చేయలేదు, కానీ మనకు ఇలా జరగడమేంటీ వసుధారతో రిషి అంటాడు. ఈరోజుల్లో మంచి చేసేవాడికి శత్రువులు ఎక్కువైపోతున్నారు మిస్టర్. ఏం చేస్తాం. కలికాలం అంటూ నవ్వుతాడు విలన్. ఏం ఆశించి ఇదంతా చేశారంటావ్ అని రిషి అంటే.. మరోవైపు అధికారం అని విలన్ అంటాడు. ఎందుకు ఈ మధ్య శత్రువులు ఎక్కువయ్యారనిపిస్తోంది అని రిషి అంటే.. రాజుకు ఎప్పుడూ శత్రువులు ఉంటూనే ఉంటారు అని నవ్వుతాడు విలన్. మొన్న స్పాట్ వాల్యూషన్ లో ఇరికించాలని చూసినవాళ్లే అనిపిస్తుందని రిషి అంటాడు. అప్పుడే జాగ్రత్తపడి వాళ్లు ఎవరో, ఎందుకు చేశారో తెలుసుకోవాల్సింది అని వసు అంటే.. వాళ్లెవరో నాకు తెలుసు వసుధార అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial April 12 2023 Today Full Episode 735

తప్పించుకోకూడదు..:వసుధార షాక్ అవుతో అవును, ఆ పని చేయించినవాళ్లు నాకు తెలుసు. కానీ సాటి విద్యాసంస్థలను అవమానించకూడదు అని వదిలేశాను. కానీ వాళ్లకు ఆ విశ్వాసం లేదు. మళ్లీ వక్రబుద్ధి చూపించారు అని రిషి అంటాడు. ఇప్పుడు ఎలా బయటపడాలో ఆలోచించాలి అని రిషి అంటాడు. రిషీంద్ర భూషణ్ ఈ పని ఎవరు చేశారన్న అయోమయంలో ఉన్నావా. నేనే ఈ సౌజన్య రావే నిన్ను ఆ చీకటి గదిలో బంధించాడు. ఎప్పటి నుంచో పావు కదుపుతుంటే ఇప్పటికీ ఇలా దొరికావ్ అని విలన్ అంటాడు. ఇంతోలో విలిన్ కు ఒక మెసేజ్ వస్తుంది. ఇంకా అప్డేట్ రాలేదు అని ఉంటుంది. చిక్కాల్సిన వాళ్లు చిక్కారు సార్ అని విలన్ సౌజన్య రావు మెసేజ్ చేస్తాడు. అంటే సౌజన్య రావు కాకుండా అసలు విలన్ వేరే ఉన్నారని అర్థం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లు తప్పించుకోకూడదు. ఏం చేయాలో తెలుసుగా అని అటు నుంచి మెసేజ్ వస్తే సౌజన్య రావు ఓకే సార్ అని అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X