Guppedantha Manasu: తప్పించుకున్న వసు-రిషి.. ప్లాన్ బీ అమలు.. తల్లీకొడుకుల మోసం!
రిషి వసుధార కిడ్నాప్ అవుతారు. రౌడీలకు కాల్ చేసిన సౌజన్య రావు.. వాళ్లను తిట్టొద్దు.. కొట్టొద్దు.. కేవలం వాళ్లిద్దరూ ఒకే గదిలో ఉన్నారని మీడియాకు సమాచారం ఇవ్వండి చాలు. మిగిలిన కథ నేను చేసుకుంటాను అని చెబితాడు. రౌడీలు అలాగే చేస్తారు. మిస్టర్ రిషీంద్ర భూషణ్ నిన్ను పడగొట్టాలని చాలా సార్లు ప్రయత్నించాను. ప్రతిసారి తప్పించుకున్నావ్. కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేవు. నీ పేరు ప్రఖ్యాతలు మొత్తం ఈరోజు పోవడం ఖాయం అని క్రూరంగా నవ్వుతాడు సౌజన్య రావు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 13 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 736లో ఇంకా ఏం జరిగిందంటే?
ప్రెస్ కారు.. కాలేజీ పరువు: మరోవైపు వసుధార, రిషి తప్పించుకునేందుకు మార్గం వెతుకుతుంటారు. ఇంతలో రిషికి ఓ కిటికి కనిపిస్తుంది. దాని తలుపు ఓపెన్ చేస్తే అడ్డం ఊచలు లేకుండా మనిషి దూరేలా ఖాలీగా కనిపిస్తుంది. దీంతో అందులో నుంచి ముందు రిషి, వసుధార దిగి వస్తారు. గోడకు వంగి వంగి నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడే రిషిధార ఉన్నవైపు ఏదో శబ్దం రాగానే ఏం అయ్యింటుందా అని వాళ్ల వైపు రౌడీ వెళ్తాడు. ఇంతలో మరో రౌడీ కారు వస్తుంది ఇటురా అనడంతో ఆ రౌడీ వెనక్కి వెళ్లిపోతాడు. ప్రెస్ కారు వస్తుంది. దానిలో నుంచి రిపోర్టర్స్, కెమెరా మెన్స్ చాలా మంది దిగి రిషి, వసుధారను బంధించిన గదివైపు వెళ్తారు. వెళ్లండి ఆ కాలేజీ పరువు మొత్తం ఈరోజు పోవాలి అని రౌడీ అరుస్తాడు. అదంతా గమనించిన రిషి జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం బయటపడాలి అని చెబుతాడు.

ఎస్సైకి రిషి ఫోన్: అక్కడి నుంచి పారిపోతారు రిషి, వసుధార. ఇంతలో సార్ మన కారు, మన ఫోన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అని వసుధార అంటే.. అవన్నీ ఎలా వెనక్కి తీసుకుని రావాలో నాకు తెలుసు. మనం ఇప్పుడు అక్కడికి వెళితే మళ్లీ ఇరుక్కుంటాం. ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్దాం. తర్వాత వాళ్ల సంగతి చెబుదాం అని రిషి అంటాడు. అప్పుడు వెళ్లే సమయంలో వసు కాళ్లకు గాజు పెంక గుచ్చుకుంటుంది. దాన్ని బయటకు తీసి కర్చీప్ తో కట్టుకడతాడు రిషి. వసుధార ననడవలేకపోవడంతో ఎత్తుకుని పరుగెడతాడు. తర్వాత ఆటోని పిలిచి అందులో ఇద్దరూ ఇంటికి బయలు దేరతారు. ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి ఎస్సై దినేష్ కు ఇవ్వమని జరిగినదంతా చెబుతాడు రిషి. ఎవరు చేశారో కనుక్కోండి అని రిక్వెస్ట్ చేస్తాడు రిషి. మరోవైపు ఇంట్లో దేవయాని రచ్చ చేస్తుంది.

రాత్రి పూట ఏంటీ : వసు, రిషి ఇంత లేట్ అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అని జగతి, మహేంద్రలను తిడుతూ ఉంటుంది. దీంతో ఫణీంద్ర ఫైర్ అవుతాడు. గౌరవం ఇస్తున్నాం కదా అని హద్దు దాటి మాట్లాడకూడదు. నువ్వు రిషినీ పెంచావ్. తనమీద హక్కు ఉంది. కానీ జగతి కన్న తల్లి. తన ఆందోళనతో పోలిస్తే నీ బాధెంత చెప్పు. ఇప్పటిదాకా అన్న మాటలు చాలు అని ఫణీంద్ర కోపంగా అంటాడు. ఇంతలో రిషి, వసుధార వస్తారు. మీరు ఆటోలో రావడం ఏంటీ.. ఇద్దరూ ఇంతసేపు ఎందుకు ఇంటికి రాలేదు. పని ఉంటే పొద్దున్నే చూసుకోవాలి కానీ ఇలా రాత్రి పూట ఏంటీ.. ఇలా రావడం ఎవరైనా చూస్తే ఏం అనుకుంటారు, కుటుంబం పరువు ఏం అవుతుందని ఆలోచించావా అని దేవయాని అరుస్తుంది.

నాకు నచ్చలేదు పెద్దమ్మా: పెద్దమ్మా ప్లీజ్.. వసుధార కాలికి దెబ్బ తగిలిందని చెప్పి జగతితో పంపిస్తాడు రిషి. పెద్దమ్మా మేము ఇంటికి రావడం లేట్ అయింది. కానీ దానికి కారణం ఉంది. అంతేకానీ కావాలని లేట్ చేయలేదు. సమాజం గురించి మాట్లాడారు. అది నాకు నచ్చలేదు పెద్దమ్మా. తప్పటడుగులు వేసేవాళ్లే మీరు అన్నట్లు ఆలోచించాలి. మేము కాదు. అయినా సొసైటీకి భయపడే అంతా తప్పులు మేము చెయ్యం. ఇదివరకే చెప్పాను. మీ హద్దులు. మీ పద్ధతులు నాకు బాగా తెలుసు. వాటిని ఎప్పుడు దాటం. అర్థం చేసుకుంటే మంచిది అని రిషి అంటాడు. దేవయాని ఏదో చెబుతుంటే మీరు వెళ్లి పడుకోండి. నేను డాడ్ పెద్దనాన్నతో మాట్లాడాలి అని రిషి అంటాడు. నేను ఉండకూడదా అని దేవయాని అంటే. అలా కాదు. ఇది కాలేజీ సమస్య. వింటే మీరు ఒత్తిడికి గురవుతారు అని రిషి చెబుతాడు.

అంత ఈజీగా వదిలిపెట్టను: శాసనాలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎదురు తిరిగితే మొత్తం పాడవుతుంది. అనుకున్నది జరగదు అని మనసులో అనుకున్న దేవయాని సరే నాన్న త్వరగా పడుకో అని వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు సౌజన్య రావు రగిలిపోతుంటాడు. నువ్వు సమర్థుడివి రిషీద్ర భూషణ్. నేను వేసిన ప్లాన్ నుంచి తప్పించుకున్నావంటే నువ్వు చాలా సమర్థుడివి. నో ప్రాబ్లమ్. నాకు ఇలాంటి చదరంగం ఆటలు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. ఈసారికి తప్పించుకోవచ్చు. కానీ నెక్ట్స్ టైమ్ అంత ఈజీగా వదిలిపెట్టను. మిమ్మల్ని తప్పించే వరకు నేను తప్పుకోను అని సౌజన్య రావు అనుకుంటాడు. ఇంతలో అతనికి మెసేజ్ వస్తుంది.

దేవయాని కొడుకే: మేసెజ్ చూసి వాళ్లు తప్పించుకున్నారు. ప్లాన్ ఫెయిల్డ్ అని రిప్లై ఇస్తాడు సౌజన్య రావు. నో ప్లాబ్లమ్. ప్లాన్ బీ అమలు చేయండి అని అటువైపు నుంచి వ్యక్తి మెసేజ్ పంపుతాడు. ఓకే సార్ అని సౌజన్య రావు అంటాడు. అయితే సౌజన్య రావు అటువైపు వ్యక్తి ఫోన్ నెంబర్ ను SB అని సేవ్ చేసుకున్నాడు. SB అంటే దేవయాని కొడుకు శైలేంద్ర భూషణ్ అనే అనుమానాలు వస్తున్నాయి. దేవయాని, శైలేంద్ర కలిసి ఇలా ప్లాన్ వేస్తున్నారు కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎదురు తిరిగితే మొత్తం పాడవుతుంది. అనుకున్నది జరగదు అన్న దేవయాని మాటలు అలాగే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











